For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సంరక్షణకై కర్పూరాన్ని ఎలా వినియోగించాలి?

|

'కర్పూరం' అనే పదం వినపడగానే మన సంప్రదాయాలు మరియు మతపరమైన ఆచారాలు స్ఫూరణకు వస్తాయి. కానీ, కర్పూరం చర్మ సంరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా?

తైలం లేదా బిళ్లల రూపంలో కర్పూరం లభిస్తుంది. కర్పూర తైలాన్ని 'సిన్నమోమం కాంఫొరా' అనే వృక్షం నుండి వెలికితీస్తారు. అందువలన, దీనిలోని ఆయుర్వేద, వృక్ష సంబంధిత ఔషధ గుణాలు సమర్థవంతమైన మరియు సహజ చికిత్సా విధానాలలో ఉపయోగపడతాయి. ఆయుర్వేద చికిత్సలలో కర్పూరంను ఎక్కువగా వాడతారు.

5 Ways To Use Camphor For Skin Care

కీళ్ల నొప్పులు నొప్పి మరియు చుండ్రు నుండి ఉపశమనం అందించడమే కాకుండా, కర్పూరం చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. మోటిమలను నయం చేయడమే కాక, మచ్చలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, ఇది సౌందర్య సాధనాలు వలె ప్రభావవంతమైనది, మరియు దీనిని ఖరీదు చేయడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇది మనందరికి అందుబాటులో ఉంటుంది.

మీకు ఈ విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ? ఈ వ్యాసం ద్వారా, మీకు కర్పూరం ద్వారా చర్మానికి కలిగే లాభాల గురించి మరియు చర్మ సంరక్షణలో దాని ఉపయోగించే పద్ధతుల గురించి తెలియజేయబోతున్నాము.

1. ఇది మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది:

1. ఇది మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది:

పుదీనా మరియు వేప వలె, కర్పూరానికి కూడా చల్లదనం చేకూర్చే గుణం ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు మోటిమలు మరియు చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. కనుక, కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా మోటిమలను నివారించుకోవచ్చు.

ఇది మొటిమల వలన కలిగే చికాకు మరియు ఎరుపుదనంను తగ్గిస్తుంది. కర్పూరంను రోజు ముఖానికి రుద్దుకుంటే, ఇది మోటిమలతో పాటుగా వాటి వలన కలిగే నొప్పి మరియు వాపును కూడా తగ్గిస్తుంది.

ఉపయోగించే విధానం:

మొటిమల నివారణకు కర్పూరంను తైల రూపంలో ఉపయోగించాలి.దీనిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున, చర్మానికి కలిగే నష్టాల నుండి నిరోధిస్తుంది. మోటిమలు చికిత్స కోసం ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూర తైలాన్ని కలిపి గాలి చొరబడని సీసాలో నింపాలి.

పడుకునే ముందు,ఈ మిశ్రమంను ఒక టీ స్పూనుడు తీసుకుని ప్రభావిత ప్రాంతంలోని రుద్దండి. రాత్రిపూట అది వదిలివేసి, మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కోవాలి. మంచి ఫలితాలకై ప్రతిరోజు ఇలా చేయండి.

2. మంట మరియు దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది:

2. మంట మరియు దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది:

కర్పూరంను కాలిన గాయాల చికిత్సలో ఉపయోగించవచ్చు. ఇది మచ్చలను కూడా తొలగిస్తుంది. చర్మం మరియు నరాలపై దాని శీతలీకరణ మరియు శ్లేష్మ ప్రభావం వలన, దీనిని కీటకాలు కాటేసినప్పుడు కలిగే దురద యొక్క చికిత్సకు కూడా వినియోగిస్తారు.

ఉపయోగించే విధానం:

నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి కరిగించి, ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా రాసుకోండి. మచ్చలు పూర్తిగా కనిపించకుండా తొలగిపోవడానికి, ఇలా ప్రతి రోజు చేయాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే, దురదలు త్వరగా తగ్గిపోతాయి.

3. మొటిమల వలన ఏర్పడిన మచ్చలుమరియు గాట్లు తొలగిపోతాయి:

3. మొటిమల వలన ఏర్పడిన మచ్చలుమరియు గాట్లు తొలగిపోతాయి:

మోటిమలు చికిత్స కోసం కర్పూర నూనె అనువైనదే, కానీ మోటిమల వలన ఏర్పడిన మచ్చలు పోవాలంటే మనం ఏమి చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో,కర్పూరం తో తయారు చేయబడిన ఫేస్ ప్యాక్లను ఉపయోగించడం మంచిది.

ఉపయోగించే విధానం:

ఒకవేళ మీ ముఖం మీద, మోటిమల వలన ఏర్పడిన మచ్చలు అనేకం ఉన్నట్లయితే, మీరు కొద్దిగా లవంగపొడిని, ముల్తానా మట్టి (ఫుల్లర్స్ ఎర్త్) మరియు చిటికెడు కర్పూరంలను బాగా కలిపి ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. దీనిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా కలపి చిక్కని పేస్ట్ లా చేయాలి. దీనిని చర్మానికి రాసుకుని, బాగా ఆరాక కడిగేయాలి.

లేదంటే, దీనికి ప్రత్యామ్నాయంగా సమాన పరిమాణంలో గులాబీ నీరు, పుదీనా రసం మరియు చిటికెడు కర్పూరం కలిపి టోనర్ గా ఉపయోగించండి.

4. అంటురోగాలను నివారిస్తుంది:

4. అంటురోగాలను నివారిస్తుంది:

ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ అంటువ్యాధుల చికిత్సలో కర్పూరంను వినియోగిస్తే, అది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది కాస్మెటిక్ పరిశ్రమల వారు ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్ధం.

ఉదాహరణకు, మీరు పాదాలను కడుక్కున్నాక, తేమ మరియు చెమటను నిరోధించడానికి పొడిగా తుడుచుకోకపోతే, తడి చర్మపు ఉపరితలంపై బ్యాక్టీరియా పేరుకుని, క్రమంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కర్పూరం గుళికలు ఇటువంటి సందర్భాలలో అంటువ్యాధులు కలుగకుండా ప్రభావవంతంగా నిరోధిస్తాయి.

ఉపయోగించే విధానం:

నీటిలో కర్పూర గుళికలు వేసి కలపి ఇన్ఫెక్షన్ ఉన్న బాధిత ప్రాంతంలో నేరుగా రాసుకోండి. ఇది ఆరిన తర్వాత పాదాలను కడగాలి. ప్రత్యామ్నాయంగా, కర్పూర తైలాన్ని కూడా శిలీంధ్ర వ్యాధులు ఉన్నచోట నేరుగా రాసుకోవచ్చు.

English summary

5 Ways To Use Camphor For Skin Care

Camphor is available in the form of oil or pellets. Camphor oil is extracted from the 'Cinnamomum camphora tree' and therefore has effective and natural therapeutic properties. Ayurveda depends heavily on camphor for most of its treatments.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more