ముడతలకు చికిత్సగా ఎగ్ వైట్ ను ఎలా ఉపయోగించాలి

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

వయసు పెరిగేకొద్దీ, వృద్ధాప్య లక్షణాలు ముఖంపై కనిపిస్తాయి. ముడతలు, సన్న గీతలు, కళ్ళకింద వాపు చర్మంపై అభివ్రుద్దిచెండడం ప్రారంభమవుతాయి. వృద్ధాప్య ప్రక్రియను మనం ఆపలేనప్పటికీ, కొంతమేరకు వాటిని వాయిదా వేయొచ్చు.

ఆరోగ్యకర జీవనశైలి, సరైన చర్మ సంరక్షణా పద్ధతులు అనుసరించడమే చర్మ ఆరోగ్యానికి ముఖ్యం. యాంటీ-ఏజింగ్ చర్మ సంరక్షణ క్రమంలో వీటిని కలిపినా ముడతలు రాకుండా సహాయపడతాయి.

ఇంటి చికిత్సను ఉపయోగించి ముడతలు, సన్న గీతలను తేలికగా అరికట్టవచ్చు. ఆరోగ్యకరమైన, ముడతలు లేని చర్మాన్ని అందించడంలో అవి అద్భుతంగా పనిచేస్తాయి.

ఇంటి చికిత్స జాబితాలో ఎగ్ వైట్ ముందు స్ధానంలో ఉంది, దీన్ని ఉపయోగించి ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను పోగొట్టవచ్చు. యాంటీ-ఏజింగ్ చర్మ సంరక్షణ క్రమంలో వీటిని కలిపి ముడతలను నివారించవచ్చు.

ఎగ్ వైట్ చర్మాన్ని బిగితుగా ఉంచి, పెద్ద రంధ్రాలను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర పదార్ధాలతో కలిపి ఎగ్ వైట్ ని ఉపయోగించినపుడు, ముడతలు, సన్న గీతల కనిపించడంలో గణనీయమైన తగ్గింపును తీసుకొస్తుంది.

ఈ ప్యాక్ లు సాగిన చర్మాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఎగ్ వైట్ ను ఉపయోగించి బిగుతైన చర్మాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముడతలు, మచ్చలు లేని చర్మాన్ని పొందడానికి ఉపయోగించే కొన్ని మార్గాలపై దృష్టి పెడదాం!

ఎగ్ వైట్, తేనె

ఎగ్ వైట్, తేనె

తేనె, ఎగ్ వైట్ మిశ్రమం చర్మాన్ని బిగుతుగా చేయడానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని టోన్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది. అవసరమైనంత తేనెతో ఎగ్ వైట్ ని కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేయండి. కొద్దిసేపు వదిలేసి, శుభ్రం చేయండి.

ఎగ్ వైట్, పెరుగు

ఎగ్ వైట్, పెరుగు

ఈ మాస్క్ పెలుసుబారిన చర్మానికి, వదులైన చర్మాన్ని బిగుతుగా చేయడానికి, ప్రకాశవంతమైన కాంతిని ఇవ్వడం ద్వారా చర్మం యవ్వనంతో కనిపించేట్టు చేస్తుంది. పెరుగుతో కలిపిన ఎగ్ వైట్ లో కొద్దిగా పంచదారను కలపండి. ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని మర్దనా చేయండి. కొద్దిసేపు అలా వదిలేసి, కడిగేయండి.

ఓట్మీల్

ఓట్మీల్

ఎగ్ వైట్ ని గిలకొట్టి అందులో రెండు చెంచాల ఓట్మీల్ కలపండి. మృదువైన పేస్ట్ లా చేసి దాన్ని ముఖంపై అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటు వదిలేసి, కడిగేయండి.

ఎగ్ వైట్, నిమ్మరసం:

ఎగ్ వైట్, నిమ్మరసం:

ఈ మాస్క్ చర్మాన్ని బిగుతుగా చేయడమే కాకుండా నల్ల మచ్చలని కూడా తొలగి౦చి, కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. రెండు చెంచాల నిమ్మరస౦తో ఎగ్ వైట్ కలపండి. దీన్ని ముఖం అంతా పట్టించండి. కొద్దిసేపు అలా వదిలేసి, తరువాత కడిగేయండి.

ఎగ్ వైట్, యాపిల్

ఎగ్ వైట్, యాపిల్

ఎగ్ వైట్, యాపిల్ కలిపిని మిశ్రమాన్ని చర్మాన్ని బిగుతుచేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండు పదార్ధాలను బాగా కలపండి. దీన్ని ముఖం అంతా పట్టించండి. కొద్దిసేపు వదిలేసి, కడిగేయండి. ఇది ఎక్స్ఫోలిఎట్ చేసి, మృదువుగా చేసి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

ఎగ్ వైట్, గ్లిజరిన్

ఎగ్ వైట్, గ్లిజరిన్

ఎగ్ వైట్, గ్లిజరిన్ చర్మాన్ని బిగుతు చేయడంలో కూడా బాగా పనిచేస్తాయి. ఈ రెండు పదార్ధాలను బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేయండి. కొద్దిసేపు వదిలేసి, తరువాత కడిగేయండి.

English summary

How To Use Egg White To Treat Wrinkles

How To Use Egg White To Treat WrinklesEgg whites are extremely beneficial in tightening the skin and shrinking the large pores. Egg whites, when used with other ingredients, can bring out a significant reduction in the appearance of wrinkles and fine lines. These packs help to restore the elasticity of the skin. There,
Story first published: Tuesday, January 30, 2018, 9:00 [IST]
Subscribe Newsletter