For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్ ను మనం చర్మంపై వాడినప్పుడు ఏం జరుగుతుంది

|

ప్రముఖ సామెత ప్రకారం “రోజుకో యాపిల్ తినటం వలన డాక్టర్ ను దూరంగా ఉంచొచ్చు” అని.

నిజానికి, అది మీ చర్మానికి కూడా చాలా మంచినే చేస్తుంది. యాపిల్స్ ప్రకృతి మనకు అందించిన బహుమతుల్లో ఒకటి. ఇందులో సంపూర్ణ పోషణ దాగివుంటుంది. యాపిల్స్ లో శరీరానికి మంచి చేసే వివిధ విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. ఈ ముఖ్య పోషకాలు మన రోగనిరోధకశక్తిని పెంచుతాయి, జీర్ణక్రియలో సాయపడతాయి మరియు లోపలినుండి చర్మానికి పోషణనందిస్తాయి.

ఇవన్నీ మనకి సామాన్యంగా తెలిసిన జ్ఞానమే.కానీ మీకు ఆపిల్స్ ను చర్మం పైన రాసినా కూడా మన చర్మానికి మంచిదేనని తెలుసా?

మనం స్త్రీలం మన చర్మానికి చాలా సంరక్షణ తీసుకుంతాం. మనం స్పాలకి, ఫేషియల్స్ చేయించుకోటానికి వెళ్తాం. మనకి చేతనైనంత అన్ని పద్ధతుల్లో ఫర్ఫెక్ట్ గా కన్పించాలనే తపిస్తాం. కానీ చాలామంది స్త్రీలు ఈ కాలంలో కాస్మెటిక్స్ లో వాడుతున్న అనేక రసాయనాల గురించి కలత చెందుతున్నారు మరియు అందుకనే ఆర్గానిక్ మార్గాన్నే సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నారు.

ప్రకృతి మనకోసం అన్నీ మేటివే దాచి ఉంచింది. అది చర్మ సంరక్షణ కావచ్చు, జుట్టు లేదా ఆరోగ్య సంరక్షణ కూడా కావచ్చు. కొన్ని సహజ పదార్థాలకి మనకొచ్చే చాలా మటుకు సమస్యలను తగ్గించే శక్తి ఉన్నది. చర్మసంరక్షణలో ఉదాహరణకి, అనేక పళ్ళు వివిధ చర్మ సమస్యలకి వాడటం వలన అది కూడా ప్రకృతి మార్గంలోనే ఇటీవలి కాలంలో ప్రయాణిస్తోంది.

మొటిమల నుంచి ముడతల వరకూ, ప్రతి చర్మ సమస్యకి కాస్మెటిక్ స్టోరులో మీరు కొనే ఖరీదైన క్రీముకి ప్రత్యామ్నాయంగా ఒక సహజ పదార్థం దొరుకుతోంది.

పండ్లలో అనేక ఖనిజలవణాలుండి, మన చర్మానికి చాలా లాభదాయకంగా ఉంటాయి. మనందరికీ ఆరెంజిలు ,స్ట్రాబెర్రీలు, అరటిపండు మరియు బొప్పాయి పండ్లు అందానికి ఎంత ఉపయోగపడతాయో ఇదివరకే తెలుసు, ఇప్పుడు అదే లిస్టులో – యాపిల్స్ ను కూడా చేరుకోండి.

యాపిల్స్ లో పూర్తిగా విటమిన్ సి ఉంటుంది, ఇది మన చర్మానికి చాలా మంచిది. ఇది కొల్లాజెన్ ను ఉత్పత్తి చేసి చర్మం సాగేగుణాన్ని అలానే ఉంచి, మనల్ని యవ్వనంగా కన్పించేలా చేస్తుంది. యాపిల్స్ లో ఉండే కాపర్ చర్మాన్ని యువి కిరణాలనుండి రక్షిస్తుంది. యాపిల్స్ లోని విటమిన్ ఎ చర్మ క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది.

మంచి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందటం కోసం యాపిల్స్ ను కొన్ని అద్భుతమైన పద్ధతుల్లో ఎలా వాడుకోవచ్చో ఇక్కడ చదవండి;

1)అలసిపోయిన మరియు ఒత్తిడికి గురైన చర్మానికి యాపిల్;

1)అలసిపోయిన మరియు ఒత్తిడికి గురైన చర్మానికి యాపిల్;

యాపిల్స్ లో ఉండే వివిధ రకాల విటమిన్లు మీ అలసిపోయి డల్ గా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. రోజంతా కష్టపడి వచ్చాక కూడా పార్టీకి అప్పటికప్పుడు రెడీ అయ్యేలా చేసే యాపిల్స్ ను వాడే ప్రభావవంతమైన చిట్కా మీ చర్మం కోసం ఇదిగో.

కావాల్సిన వస్తువులు

-1యాపిల్

-కొంచెం నీరు

పద్ధతి;

పద్ధతి;

1.ఒక యాపిల్ కట్ చేసి మిక్సీలో తొక్కతో పాటు కలిపి వేయండి.

2.కొంచెం నీరుతో మెత్తని పేస్టులా చేయండి.

3.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు అలానే ఉంచండి.

4.చల్లనీరుతో కడిగేయండి.

2)ఒకే చర్మం రంగుకోసం యాపిల్స్

2)ఒకే చర్మం రంగుకోసం యాపిల్స్

ఆపిల్స్ లో ఉండే టాన్నిక్ యాసిడ్ చర్మం రంగు మొత్తం ఒకేలా కన్పించేలా చేస్తుంది. ఈ ప్యాక్ ఒకే చర్మం రంగు ఉండని ప్రాంతాలను బాగుచేసి, మృదువుగా మారేలా చేస్తుంది.

కావాల్సిన వస్తువులు;

-ఒక ఆపిల్ తొక్క

-1 చెంచా తేనె

పద్దతి;

పద్దతి;

1.ఆపిల్ పై తొక్కను మిక్సీలో వేసి, మెత్తని పేస్టుగా చేయండి.

2.ఒక చెంచా తేనెను జతచేయండి.

3.ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాలు అలా వదిలేయండి.

3)మొటిమల కోసం యాపిల్స్

3)మొటిమల కోసం యాపిల్స్

యాపిల్స్ లో ఉండే కొంచెం సహజమైన సాలిసిలిక్ యాసిడ్ మొటిమలతో పోరాడి మరియు వాటి సైజును తగ్గిస్తాయి. అలాంటి మొటిమలు సడెన్ గా బయటపడినప్పుడు పొడిబారిన చర్మాన్ని, మచ్చలను తొలగిస్తాయి.

కావాల్సిన వస్తువులు;

-1ఆపిల్

-ఒక చెంచా తేనె

-1/2 చెంచా నిమ్మరసం

పద్ధతి;

పద్ధతి;

1.ఆపిల్ ను తురమండి మరియు దాని రసాన్ని తీయండి.

2.దానికి తేనె మరియు నిమ్మరసాన్ని జతచేయండి.

3.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలు అలా వదిలేయండి.

4.చల్లనీరుతో కడిగేయండి.

5.ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ప్రయత్నించి ఫలితాలు చూడండి.

4)ఎండిపోయిన చర్మానికి ఆపిల్స్

4)ఎండిపోయిన చర్మానికి ఆపిల్స్

ఆపిల్స్ చాలా ఎక్కువగా తేమనందిస్తాయి, పొడిబారిన చర్మానికి సహజంగా తేమను అందేలా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని తేమగా మరియు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

కావాల్సిన వస్తువులు;

-1/2 ఆపిల్

-1చెంచా ఓట్ మీల్ పొడి

-1చెంచా తేనె

-1 గుడ్డు సొన

పద్ధతిః

పద్ధతిః

1.ఆపిల్ ను తురమండి.

2.ఓట్ మీల్ పొడిని, తేనె మరియు గుడ్డు సొనను దానికి జతచేయండి.

3.ఈ హైడ్రేటింగ్ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలా వదిలేయండి.

4.చల్లనీరుతో కడిగేయండి.

English summary

What Happens When We Use Apple On Skin

Apple is one such ingredient that can resolve most of the skin care issues. It helps to cure acne, improves skin tone, etc. This is because apple is rich in vitamin C, which is great for our skin. It helps in collagen production that helps the skin to maintain its elasticity, making us look younger.