మీ సౌందర్య సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి వైట్ వెనిగర్

By Lakshmi Bai Praharaju
Subscribe to Boldsky

వైట్ వెనిగర్ తరచూ చర్మ సంరక్షణా ప్రయోజనాలకు ఉపయోగించే బహుముఖ పదార్ధం. ఇది ఆస్త్రింజేంట్ లక్షణాలతో నిండి ఉండి, ఇబ్బందికరమైన చర్మ సమస్యలకు అనేక రకాలుగా చికిత్స చేస్తుంది.

అంతేకాక, మొటిమలు, బ్లాక్ హెడ్స్ మొదలైన చర్మ సంబంధిత రోగాలకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.

white vinegar in skin care routine

అయితే, సమర్ధవంతమైన, గుర్తించదగ్గ ఫలితాల కోసం ఈ వైట్ వెనిగర్ ను ఉపయోగించడం చాలా అత్యవసరం. మీ సౌందర్య సంరక్షణా విభాగంలో ఈ చర్మ సంరక్షణా పదార్ధాన్ని ఎలా తయారుచేసుకోవాలా అని మీరు అనుకుంటున్నారా, అయితే మేము మీకు చెప్తాము.

నేడు, మీ చర్మ సంరక్షణకు వైట్ వెనిగర్ జోడించే సరైన మార్గం గురించి తెలియచేస్తాము.

తక్కువ ఖరీదు, ఎక్కువ ప్రభావవంతమైన, వైట్ వెనిగర్ పిగ్మేంటేషన్, సమంగా లేని స్కిన్ టోన్, యాక్నే మచ్చలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలను తొలగించగలవు.

వైట్ వెనిగర్ ని కేవలం మీ సౌందర్య సాధనాలలో ఒకటిగా ఉంచుకుంటే పైన తెలిపిన చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మీ సౌందర్యానికి వైట్ వెనిగర్ ని ఉపయోగించడానికి ఇక్కడ ఇచ్చిన మార్గాలపై దృష్టి పెట్టండి:

1.స్కిన్ పిగ్మేంటేషన్ కి ఉల్లిపాయ రసంతో వైట్ వెనిగర్

1.స్కిన్ పిగ్మేంటేషన్ కి ఉల్లిపాయ రసంతో వైట్ వెనిగర్

-1 టీస్పూన్ వైట్ వెనిగర్, ఉల్లిపాయ రసంతో 2-3 టీస్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి.

-మీ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి, 10 నిమిషాల సేపు ఆరనివ్వండి.

-తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-స్కిన్ పిగ్మేంటేషన్ అరికట్టడానికి వారానికి ఒకసారి ఇలా చేయండి.

2.మృదువైన చర్మం కోసం బియ్యంపిండితో వైట్ వెనిగర్

2.మృదువైన చర్మం కోసం బియ్యంపిండితో వైట్ వెనిగర్

-1 టీస్పూన్ వైట్ వెనిగర్, 1 టీస్పూన్ బియ్యంపిండి, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపి మిశ్రమం తయారుచేయండి.

-ఈ మిశ్రమాన్ని మీ ముఖం అంతా అప్లై చేసి, 10 నిమిషాల సేపు బాగా ఆరనివ్వండి.

-తరువాత, గోరువెచ్చని నీటితో కడగండి.

-మృదువైన, కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

3.బ్లాక్ హెడ్స్ కి స్ట్రాబెర్రీ లతో వైట్ వెనిగర్

3.బ్లాక్ హెడ్స్ కి స్ట్రాబెర్రీ లతో వైట్ వెనిగర్

-1 టీస్పూన్ వైట్ వెనిగర్ తో 2 పండిన స్ట్రాబెర్రీలను కలిపి మిశ్రమం తయారుచేయండి.

-ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై పూసి, కొద్ది నిమిషాల సేపు సున్నితంగా మర్దనా చేయండి.

-గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని కడగండి.

-ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించినట్లయితే మీ చర్మం బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి సహాయపడుతుంది.

4.శుభ్రమైన రంధ్రాల కోసం బెంటోనైట్ క్లే తో వైట్ వెనిగర్

4.శుభ్రమైన రంధ్రాల కోసం బెంటోనైట్ క్లే తో వైట్ వెనిగర్

-1 టీస్పూన్ వైట్ వెనిగర్, ½ టీస్పూన్ బెంటోనైట్ క్లే, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ని బాగా కలపండి.

-మీ ఫేషియల్ స్కిన్ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

-10 నిమిషాల పాటు అలా ఉంచి, తేలికైన క్లెన్సర్, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి మీ చర్మ సంరక్షణ విభాగంలో చేర్చినట్లయితే మీ చర్మ రంధ్రాలు మురికి లేకుండా ఉంటాయి.

5.సమమైన స్కిన్ టోన్ కి నీటితో వైట్ వెనిగర్

5.సమమైన స్కిన్ టోన్ కి నీటితో వైట్ వెనిగర్

-1 టేబుల్ స్పూన్ డిస్టిల్డ్ వాటర్ తో 1 టీస్పూన్ వైట్ వెనిగర్ ని కలపండి.

-ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ పై రాయండి.

10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-సమమైన స్కిన్ టోన్ పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

6.పొడి చర్మానికి ఆలివ్ ఆయిల్ తో వైట్ వెనిగర్

6.పొడి చర్మానికి ఆలివ్ ఆయిల్ తో వైట్ వెనిగర్

-2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తో 1టీస్పూన్ వైట్ వెనిగర్ ని కలపండి.

-ఈ మిశ్రమాన్ని మీ ఫేషియల్ స్కిన్ పై పూయండి.

-మంచిగా తయరవ్వడానికి 10 నిముషాలు అలా ఉంచండి.

-తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

-పొడి చర్మం పోగొట్టుకోవడానికి ఈ పద్ధతిలో వైట్ వెనిగర్ ని ఉపయోగించండి.

7.యాక్నే మచ్చాలకు అలోవేరా జెల్ తో వైట్ వెనిగర్

7.యాక్నే మచ్చాలకు అలోవేరా జెల్ తో వైట్ వెనిగర్

-ఒక బౌల్ తీసుకుని, అందులో 1 టీస్పూన్ వైట్ వెనిగర్, 2 టీస్పూన్ల అలోవేరా జెల్ వేయండి.

-ఈ పదార్ధాలను అన్నిటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ భాగానికి పట్టించండి.

-ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేయాలి అంటే దాదాపు 10-15 నిమిషాల పాటు అలా ఉంచి, తేలికైన క్లెన్సర్, గోరువెచ్చని నీటితో కడగండి.

-నిలిచిపోయిన యక్నే మచ్చలను పోగొట్టుకోవడానికి మీ వారపు సౌందర్య దైనందినం లో ఈ మిశ్రమాన్ని ఒక భాగంగా చేసుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Include White Vinegar In Your Skin Care Routine

    White vinegar when mixed with certain natural ingredients helps to reduce pigmentation, treat acne and solve many other beauty-related issues. So, we'll tell you what are the ingredients that are required and ways to use white vinegar for beauty.
    Story first published: Thursday, January 11, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more