మేకప్ చేసుకున్నా ముఖం ఎందుకలా డల్ గామారుతుందో తెలుసా

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మన ఫేసియల్ ఫీచర్స్ ని హైలైట్ చేయడానికి మనం మేకప్ ని వాడతాము. తద్వారా, మంచి లుక్ ని పొందుతాము. అయితే, కొన్నిసార్లు మేకప్ అనేది లుక్ ని మరింత డల్ గా మార్చే ప్రమాదం ఉంది. మేకప్ ముఖ్య లక్ష్యం ముఖాన్ని మరింత కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మార్చడం. మరి, మేకప్ వలన మన లుక్ మరింత డల్ అవటం మనల్ని బాధిస్తుంది.

కొన్నిసార్లు, కొన్ని మిస్టేక్స్ వలన మొత్తం మేకప్ దెబ్బతింటుంది.

causes of dull skin tone

మేకప్ అనేది మేజిక్ టూల్ వంటిది. మన ఫేస్ ని కాంతివంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది. నిద్రలేనప్పుడు, ఆ ఒత్తిడి ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. కాంకీలర్ తో ఈ లోపాన్ని దిద్దుకోవచ్చు. హైలైటర్ ను కూడా వాడవచ్చు.

అంతేకాక, మేకప్ అనేది ముఖంలోని ఫీచర్స్ ని మరింత షార్ప్ గా మారుస్తుంది. ఒకవేళ మేకప్ ని సరైన విధానంలో అప్లై చేసుకోకపోతే పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలను పొందుతారు. ముఖంలోని అందం హైడ్ అయిపోతుంది. మేకప్ లోని పొరపాట్ల వలన డల్ గా నిస్తేజంగా కనిపిస్తారు.

కాబట్టి, మేకప్ వేసుకునే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీ మేకప్ అనేది మ్యాజిక్ టూల్ లా పనిచేసి మీ ముఖాన్ని కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మారుస్తుంది.

1. అతి ఎక్కువ ప్రోడక్ట్స్ ని వినియోగించడం

1. అతి ఎక్కువ ప్రోడక్ట్స్ ని వినియోగించడం

మేకప్ అనేది మన ముఖంలోని ఫీచర్స్ లుక్ ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందన్న విషయం వాస్తవమే. అయితే, అన్ని రకాల ప్రోడక్ట్స్ ని వినియోగించడం సరైన ఆలోచన కాదు. అతిగా మేకప్ ప్రోడక్ట్స్ ని వినియోగించడం వలన మీ లుక్ పాడయ్యే ప్రమాదం ఉంది. అవును, బ్లష్, బ్రోన్జర్స్, కాంటర్ ప్రోడక్ట్స్ ని కలిపి ఎలా వాడాలో మనకు మేకప్ గురుస్ వివరించి ఉన్నారు.

అయితే, వీటన్నిటినీ కలిపి వాడినప్పుడు, ముఖ్యంగా మీరు మేకప్ కి తక్కువ టైమ్ మాత్రమే కేటాయించగలిగినప్పుడు వీటిని ఎలాగోలాగా అప్లై చేసుకుంటే మీ లుక్ మొత్తం స్పాయిల్ అవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించాలి.

దానికి బదులుగా, క్లీన్సింగ్ తరువాత బీబీ లేదా సీసి వంటి మల్టీ టాస్కింగ్ క్రీమ్ ను వాడి మీ ముఖాన్ని మేకప్ కి అనుగుణంగా మార్చుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

ఒక ప్రోడక్ట్ తరువాత ఒక ప్రోడక్ట్ తో ముఖంపై లేయర్స్ ని తయారుచేసే బదులు అవసరమైన ప్రోడక్ట్స్ ని మాత్రమే వాడి అందాన్ని రెట్టింపు చేసుకోండి. ఈ క్రీమ్స్ కవరేజ్ తో పాటు బ్రైటెనింగ్ ఎఫెక్ట్ ని ఎస్ పీ ఎఫ్ తో పాటు అందిస్తాయి. ఇప్పుడు, బ్లష్ మరియు కాంటర్ ని అప్లై చేయండి.

2. రాంగ్ కలర్

2. రాంగ్ కలర్

ఈ మిస్టేక్ ని మనలో చాలా మంది చేస్తూ ఉంటారు. ఇంటెన్షనల్ గా కాకపోయినా పొరపాటుగా ఈ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే మేకప్ ని ఎంచుకోవడం కాస్తంత కష్టమైన విషయమే. అందుకే, ప్రొఫెషనల్స్ హెల్ప్ ను మీరు తీసుకోవాలి. స్కిన్ టోన్ కి తగిన మేకప్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవాలి. మేకప్ ఆర్టిస్ట్ హెల్ప్ ని తీసుకోండి లేదా సేల్స్ కౌంటర్ లో ఉండే వాళ్ళ సహాయాన్ని తీసుకోండి.

చాలా హై ఎండ్ మేకప్ స్టోర్స్ లో మంచి మేకప్ ఆర్టిస్ట్స్ అందుబాటులో ఉంటారు. ఫౌండేషన్ లో బాగా డార్క్ షేడ్స్ ని వాడితే మీరు మీరు ఏజ్డ్ గా కనిపించే ప్రమాదం ఉంది. బాగా లైట్ షేడ్ ని వాడితే మీ స్కిన్ అనేది యాషీగా కనిపిస్తుంది.

3. చర్మానికి శ్వాస అందకపోవటం

3. చర్మానికి శ్వాస అందకపోవటం

కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ పోర్స్ ని శ్రిన్క్ చేస్తాయి. ఎక్కువగా అటువంటి ప్రోడక్ట్స్ ని వాడితే పోర్స్ క్లాగ్ అవుతాయి. ఇటువంటి, మేకప్ ప్రోడక్ట్స్ ని తరచూ వినియోగించకండి. అప్పుడప్పుడు మాత్రమే వీటిని వాడండి.

వీటిని వలన చర్మం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నిర్జీవంగా మారుతుంది. మీ చర్మానికి అన్ని విధాలా మేలు చేసే ఫార్ములాస్ ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోండి. మీ స్కిన్ టైప్ ని మైండ్ లో ఉంచుకుని ప్రోడక్ట్స్ ని ఎంచుకోండి. ఆయిలీ స్కిన్ కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ ని డ్రై స్కిన్ వారు వాడకూడదు.

4. ఎక్స్ఫోలియెట్ చేయకపోవటం

4. ఎక్స్ఫోలియెట్ చేయకపోవటం

చర్మంపై డెడ్ స్కిన్ పేరుకుపోయినప్పుడు మేకప్ ఫినిషింగ్ అనేది స్మూత్ గా జరగదు. మేకప్ అనేది యాషీగా కనిపిస్తుంది. డెడ్ స్కిన్ వలన చర్మం రఫ్ గా మారుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది.

హెవీ డ్యూటీ ఫౌండేషన్ ని వాడే ముందు జెంటిల్ స్క్రబ్ తో చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. ఆ తరువాత టోనర్ మరియు మాయిశ్చర్ సహాయంతో చర్మాన్ని తగినంతగా హైడ్రేట్ చేసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉంటే మేకప్ తో చర్మ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది.

5. ఎక్కువగా హైలైట్ చేయడం

5. ఎక్కువగా హైలైట్ చేయడం

మెరుస్తున్నట్టు కనిపించడం ఈ రోజుల్లో ట్రెండీగా మారింది. అయితే, కొంతమంది ఈ లుక్ ను అతిగా కోరుకుంటారు. అందువలన, హైలైటర్ ను విపరీతంగా వాడతారు. దాంతో, లుక్ మొత్తం పాడవుతుంది.

ముఖంపై సహజసిద్ధంగా లైట్ పడే చోటే హైలైటర్ ను వాడాలి. నోస్ బ్రిడ్జ్, చీక్స్ వద్ద హై పాయింట్స్ మరియు క్యూపిడ్స్ బో వద్ద హైలైటర్ ను వాడాలి. హైలైటర్ వినియోగంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయనడంలో సందేహం లేదు.

6. కాంకీలర్ లో రాంగ్ షేడ్స్

6. కాంకీలర్ లో రాంగ్ షేడ్స్

ఫ్లాస్ ని కవర్ చేసేందుకు కాంకీలర్ ఉపయోగకరంగా ఉంటుంది. బ్లేమిషెస్ ని కవర్ చేసి అండర్ ఐ ఏరియాని ప్రకాశవంతంగా మార్చేందుకు అలాగే ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు కాంకీలర్ తోడ్పడుతుంది. మీ యాక్చువల్ స్కిన్ టోన్ కంటే ఇది వన్ షేడ్ లైటర్ గా ఉండాలి. అంతకంటే తక్కువ షేడ్ ను వాడితే ముఖంలోని ఫ్లాస్ అనేవి ఎక్కువగా కనిస్తాయి.

7. రాంగ్ లిప్ స్టిక్ షేడ్ ను వాడటం

7. రాంగ్ లిప్ స్టిక్ షేడ్ ను వాడటం

మీ స్కిన్ అనేది డల్ గా ఉన్నప్పుడు బ్రౌన్ మరియు న్యూడ్ వంటి కొన్ని షేడ్స్ ని మీరు అవాయిడ్ చేయాలి. ట్రూ రెడ్ లిప్స్టిక్ ని ప్రిఫర్ చేయండి. అందులో సరైన మోతాదులో బ్లూ మరియు ఆరెంజ్ టోన్స్ నిక్షిప్తమై ఉంటాయి.

ఇవి ఇన్స్టెంట్ గా మీ ముఖాన్ని బ్రైటన్ చేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, మీ ముఖం కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మారుతుంది. ఈ షేడ్ అన్ని రకాల స్కిన్ టోన్స్ కి బాగా సూట్ అవుతుంది.

8. బ్లెండింగ్

8. బ్లెండింగ్

అంబ్లెండెడ్ మేకప్ లుక్ అనేది నో మేకప్ లుక్ కంటే వరస్ట్ గా ఉంటుంది. మేకప్ ని పెర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసేందుకు మీరు సమయాన్ని వెచ్చించాలి. ఫౌండేషన్ గానివ్వండి, కాంటర్ ప్రోడక్ట్స్ లేదా ఐ షాడో కానివ్వండి, వాటిని సరిగ్గా బ్లెండ్ చేయకపోతే లుక్ మొత్తం దెబ్బతింటుంది. మంచి బ్రష్ లపై అలాగే స్పాంజ్ లపై ఇన్వెస్ట్ చేయండి.

Read more about: makeup tips skin care beauty
English summary

మేకప్ ని అప్లై చేసిన తరువాత కూడా చర్మం డల్ గా ఎందుకు కనిపిస్తుంది?

Makeup is like a magic tool that can be used to change so many aspects of your face. Didn't get enough sleep? Concealers at your rescue! Lacking a glow? Use a highlighter.
Story first published: Wednesday, March 21, 2018, 14:00 [IST]