For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ల చుట్టూ నల్లని వలయాలున్నాయా? ఇలా చేస్తే అవన్నీ మాయం అయిపోతాయి

కళ్ళ చుట్టూ నల్లని వలయాలు సమస్య గా మారిందా? కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నల్లని వలయాలని సంపూర్ణంగా పోగొట్టుకోవచ్చు. మరి అవి ఏమిటో మీరూ తెలుసుకోండి.

|

మనలోని చాలా మందికి కళ్ల చుట్టూ నల్లని వలయాలు సమస్య గా మారుతుంది. లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిలో ఈ సమస్య సమానంగా ఉంది. ఇది మన అందాన్ని పాడుచేసి ఆత్మవిశ్వాసంను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు వయసు మీద పడుతున్న కొద్ది, కంటి చుట్టూ నల్లని వలయాలు అనువంశికత కారణంగా కూడా రావచ్చు. ప్రతిసారి ఈ వలయాలు వయసు మీద పడటమనే కారణం వలన కాకపోవచ్చు.

కొన్నిసార్లు ఇతర కారణాలైన నిద్రలేమి, అధిక ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వాటి వలన కూడా కావచ్చు.

how to remove dark circles naturally

మీకు తెలుసా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ నల్లని వలయాలని సంపూర్ణంగా పోగొట్టుకోవచ్చని? ఆశ్చర్యపోతున్నారా! ఈనాడు మార్కెట్ లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తులు ఒక వారం లేదా నెలలో నల్లటి వలయాలని తగ్గిస్తామని చెబుతున్నాయి. కానీ వీటిలో ఉండే రసాయనాలను విశ్వసించలేము.అవి మన చర్మాన్ని ఇంకా నష్టపరచవచ్చు.

ఇటువంటి సమస్యల నివారణకు సహజ పదార్ధాలను వినియోగించడం సర్వోత్తమం. ఇప్పుడు మనం ఏ ఏ పదార్థాలను ఉపయోగించి కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయాలని సహజంగా, సంపూర్ణంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం!

1. కలబంద గుజ్జు:

1. కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు చర్మానికి తేమ మరియు పోషణ అందిస్తుంది. ఇది చర్మానికి చల్లదనం చేకూర్చి కళ్ళ చుట్టూ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

ఒక తాజా కలబంద ఆకును కోసి, దానిలోని గుజ్జును బయటకు తీయండి. ఈ గుజ్జును కళ్ళ చుట్టూ రాసుకుని10-15 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. తరువాత కాటన్ ప్యాడ్ తో తుడిచేయండి.

2. గ్రీన్ టీ సంచులు:

2. గ్రీన్ టీ సంచులు:

గ్రీన్ టీ బ్యాగులు కళ్ళ చుట్టూ వలయాలని బాగా తగ్గిస్తాయి. వీటిలో ఉండే గుణాలు కళ్ళను తాజాగా ఉంచుతాయి.

దీనికై మీరు రెండు గ్రీన్ టీ బ్యాగులు తీసుకోండి. వీటిని నీటిలో వేసి అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టండి.తరువాత 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. తరువాత చల్లని నీటితో ముఖం కడిగేయండి. ఇలా రోజుకొకసారి చేయండి.

3. తేనె

3. తేనె

తేనె చర్మానికి పోషణ ఇచ్చి చల్లబరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు కళ్ళ చుట్టూ ఉన్న వలయాలని చాలా త్వరగా తగ్గిస్తుంది.

కళ్ళ చుట్టూ ఆర్గానిక్ తేనెని రాసుకుని 20 నిమిషాలు అనంతరం చల్లని నీటితో కడిగేయండి. తరువాత పొడిగా తుడుచుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.

4. బంగాళదుంప:

4. బంగాళదుంప:

బంగాళాదుంపకు చర్మ రంగును తేలికపరిచే గుణముంటుంది. అంతేకాక ఇది కళ్ళ చుట్టూ వాపును కూడా తగ్గిస్తూంది. దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం!

ఒక దుంపను తీసుకుని గంటసేపు ఫ్రిజ్ లో ఉంచండి. తర్వాత దానిని బాగా తురిమి రసం తీయండి. ఈ రసాన్ని పడుకునేముందు దూదితో కళ్ళ చుట్టూ రాయండి. పొద్దుట లేచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. పాలు:

5. పాలు:

పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి తేమ చేకూరుస్తుంది. కళ్ళ చూస్తూ వాపు మరియు వలయాలని ఇది తగ్గిస్తుంది.

చల్లని పాలను దీనికై ఉపయోగించాలి. రెండు దూది ఉండలని చల్లని పాలలో ముంచండి. వీటిని కళ్లపై పెట్టి పదిహేను నిమిషాల పాటు వదిలేయండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితముంటుంది. ఎంత ఎక్కువగా పాటిస్తే అంత మెరుగైన ఫలితముంటుంది.

6. నిమ్మరసం:

6. నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుందన్న విషయం మనందరికి తెలిసిందే! ఇది చర్మాన్ని తేటుగా మార్చి నల్లని వలయాలు తగ్గిస్తుంది.

ఒక దూది ఉండతో కళ్ళ చుట్టూ నిమ్మరసం రాసుకోండి. పది నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు సార్లు పొద్దుట, రాత్రి చేయండి. ముఖం కడుక్కున్న తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ తప్పక రాసుకోండి. ఇలా చేస్తే చర్మం పొడిబారదు.

7. పుదీనా ఆకులు:

7. పుదీనా ఆకులు:

పుదీనా ఆకులలో ఉండే విటమిన్ సి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు తగ్గించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి దోహదపడుతుంది.

దీనికి కావలసినదల్లా గుప్పెడు పుదీనా ఆకులు మాత్రమే! పుదీనా ఆకులకు కొన్ని చుక్కల నీటిని కలిపి ముద్దగా నూరండి. ఈ ముద్దను కళ్ళచుట్టూ పట్టించి పది నిమిషాలు తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా ప్రతిరోజూ పడుకొనే ముందు చేయండి.

8. పసుపు:

8. పసుపు:

పసుపు సహజంగా చర్మాన్ని కాంతివంతంగా మార్చి, నల్లని మచ్చలు మరియు మరకలను తగ్గిస్తుంది.

పావు చెంచాడు పసుపును ఒక చెంచాడు కొబ్బరి లేదా బాదం నూనెలో వేసి బాగా కలపండి. ఈ ముద్దను కంటి చుట్టూ పట్టించి పది నిమిషాలు పాటు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి.

English summary

Worried Of Dark Circles? Here Are Some Natural Ways To Treat Them

Dark circles is an issue which is faced by most of us out there, isn't it? Irrespective of the gender, dark circles equally bothers everyone, since it affects our confidence in the way we look. Dark circles are often considered as a hereditary condition, which appears in the process of ageing. But, it's not always necessary that dark circles are signs of ageing.
Story first published:Thursday, March 22, 2018, 13:43 [IST]
Desktop Bottom Promotion