For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ బర్న్ చికిత్సకు 10 ఎఫెక్టివ్ అలోవెర రెమెడీస్

|

కలబంద అనేది గృహ వైద్యానికి సూచించదగిన ఒక అద్భుతమైన పదార్ధంగా చెప్పబడుతుంది. అనేకరకాల చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు ఒక వైవిధ్యమైన పదార్ధం, ఇది మన చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తోంది.

మీ చర్మ సంరక్షణలో అలోవేరా చేసే ఉత్తమ ఉపయోగాలలో ఒకటి సన్ బర్న్ సమస్యకు చికిత్స చేయడం. సూర్యరశ్మికి మీ చర్మం ఎక్కువగా బహిర్గతమవడం మూలాన సన్ బర్న్ సమస్య తలెత్తుతుంది. సన్ బర్న్ అనేది అత్యంత బాధాకరమైన సమస్య, మరియు ఇది ముఖాన్ని ఎర్రగా మారుస్తూ, వాపుతో కూడుకుని చికాకును కలిగిస్తుంటుంది.

Aloe Vera

సన్ బర్న్స్ చికిత్సకు రసాయనాలు జోడించని హోం రెమెడీస్ అన్ని విధాలుగా సురక్షితమైనవిగా చెప్పబడుతుంది. కలబంద గుజ్జును నేరుగా కానీ, లేదా ఏదేని ఇతర సహజ పదార్థాలతో కలిపి వినియోగించడం ద్వారా, సన్ బర్న్ తో కూడిన నొప్పి మరియు అసౌకర్యం నుండి ఉపశమనాన్ని పొందవచ్చునని సౌందర్య నిపుణుల సూచనగా ఉంటుంది. పైగా కలబంద ఎటువంటి చర్మతత్వానికైనా సరిపోయేలా, ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా ఉంటుంది. కావున ఎటువంటి సంకోచమూ లేకుండా ఎవరైనా అనుసరించవచ్చునని సూచించబడుతుంది.

సన్ బర్న్ నుండి ఉపశమనానికి కలబందనే ఎందుకు ఉపయోగించాలి ?

కలబంద గుజ్జు శోథ నిరోధక గుణాలను కలిగి ఉంటుంది. ఇది వాపు మరియు చికాకును కలిగించే చర్మానికి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా యాంటీ సెప్టిక్ మరియు అనాల్జెసిక్ గుణాలను కలిగి ఉండి, మీ చర్మాన్ని సమస్య నుండి దూరం చేస్తూ, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కలబంద గుజ్జు చర్మానికి లోతుగా తేమను అందించి, చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది. క్రమంగా స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. పైగా దీనితో పాటు జతచేసే ఇతర పదార్దాలైన పసుపు, రోజ్ వాటర్, చందనం, పెరుగు, శెనగ పిండి వంటి పదార్ధాలు కూడా కలబంద వలెనే ఎటువంటి దుష్ప్రభావాలు లేనివిగా ఉంటూ ఉత్తమ ప్రయోజనాలను అందివ్వగలవు.

సన్ బర్న్ కు చికిత్స చేయడానికి కలబందను ఉపయోగించే ఉత్తమ మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.

సన్ బర్న్స్ చికిత్సకు కలబందతో కూడిన రెమెడీస్ :

1. కలబంద గుజ్జుతో మసాజ్ :

1. కలబంద గుజ్జుతో మసాజ్ :

కలబంద యొక్క ఉపశమన తత్వాలు, మరియు శీతలీకరణ ప్రభావం, మిమ్మల్ని సన్ బర్న్ అసౌకర్యం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

కావలసిన పదార్థాలు :

• కలబంద గుజ్జు (అవసరమైనంత).

ఉపయోగించు విధానం :

• మీ వేలికొనలపై కొంత కలబంద గుజ్జును తీసుకోండి.

• ప్రభావిత ప్రాంతం మీద సమపాళ్ళలో అప్లై చేసి, కొన్ని సెకన్ల పాటు మృదువుగా మర్దన చేయాలి.

• తరువాత కాసేపు అలాగే గాలికి ఆరనివ్వండి.

• ఈ సమయంలో ఆ కలబంద గుజ్జు చర్మంలోనికి శోషించుకోబడుతుంది.

• కాసేపటి తరువాత, చల్లటి నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి.

• కమిలిన చర్మాన్ని మృదువుగా చేయడం కొరకు రోజులో పలుసార్లు ఈ రెమిడీని పునరావృతం చేయండి.

2. కలబంద, పెరుగు మరియు శెనగపిండి

2. కలబంద, పెరుగు మరియు శెనగపిండి

శెనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, పెరుగు చిరాకు నుండి ఉపశమనం కలిగించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ వృద్దాప్య చాయలను తగ్గించడంలో సహాయం చేయగలదు.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు.

• 1 టేబుల్ స్పూన్ తాజా పెరుగు.

• 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి.

ఉపయోగించు విధానం :

• కలబంద గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి పెరుగు మరియు శెనగపిండిని జోడించి, మిశ్రమంలా తయారుచేయడానికి అన్నింటిని బాగా కలపండి.

• ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, తడిని తొలగించండి.

• ప్రభావిత ప్రాంతంలో మిశ్రమాన్ని నలుదిక్కులా అప్లై చేయండి.

• 10 నుండి 15 నిమిషాలపాటు అలానే గాలికి ఆరనివ్వండి.

• చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం రోజుకొకసారి ఈ పద్దతిని పునరావృతం చేయండి.

3. కలబంద మరియు గుడ్డు :

3. కలబంద మరియు గుడ్డు :

గుడ్డులో ఉండే ల్యూటెన్లు, హానికరమైన UV కిరణాల మూలంగా కలిగే వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. తద్వారా సన్ బర్న్ మూలంగా కమిలిన చర్మానికి ఉపశమనం అందిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• 1 గుడ్డు తెల్లసొన.

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలో గుడ్డుసొన తీసుకుని, దానిని బాగా కలపండి.

• దానిలోనికి కలబంద గుజ్జును చేర్చుకుని మిశ్రమంగా చేయండి.

• ప్రభావిత ప్రాంతంమీద ఈ మిశ్రమాన్ని నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి.

• 15 నిమిషాలపాటు గాలికి అలానే వదిలేయండి.

• చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం వారంలో 2 నుండి 3 మార్లు పునరావృతం చేయండి.

4. కలబంద మరియు బొప్పాయి :

4. కలబంద మరియు బొప్పాయి :

బొప్పాయి బీటా కెరోటిన్ నిక్షేపాలను సమృద్దిగా కలిగి ఉంటుంది. మరియు కలబందతో కలిపినప్పుడు, ఇది హానికరమైన సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి మరియు సన్ బర్న్స్ చికిత్సలో కూడా సహాయపడుతుందని చెప్పబడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• 1 టేబుల్ స్పూన్ బొప్పాయి.

ఉపయోగించు విధానం :

• రెండు పదార్ధాలను కలిపి ఒక గిన్నెలోనికి తీసుకోండి.

• ప్రభావిత ప్రాంతం మీద నలుదిక్కులా అప్లై చేయండి.

• 15 నిమిషాలపాటు గాలికి అలానే విడిచిపెట్టండి.

• తర్వాత శుభ్రంగా చల్లని నీటితో కడిగేయండి.

• ఆశించిన ఫలితాల కోసం రోజూలో ఒకసారి ఈ పద్దతిని పునరావృతం చేయండి.

5. కలబంద మరియు కీరదోసకాయ :

5. కలబంద మరియు కీరదోసకాయ :

కీరదోసకాయ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు చర్మానికి ఊరటనిస్తుంది. అదేవిధంగా సన్ బర్న్ వలన కలిగే నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ తాజా దోసకాయ రసం

ఉపయోగించు విధానం :

• కలబంద గుజ్జును ఒక గిన్నెలోనికి తీసుకోవాలి.

• దీనికి కీరా దోసకాయ రసాన్ని జోడించి, రెండు పదార్థాలను బాగుగా మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతం మీద రాయాలి.

• 20 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తర్వాత శుభ్రంగా చల్లటి నీటితో కడిగేయండి.

• ఆశించిన ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ రెమెడీని పునరావృతం చేయండి.

6. కలబంద మరియు నిమ్మరసం :

6. కలబంద మరియు నిమ్మరసం :

నిమ్మరసం, కలబంద గుజ్జు మిశ్రమం సన్ బర్న్ చికిత్సలో అత్యుత్తమంగా సహాయపడుతుందని చెప్పబడుతుంది. మరియు హానికరమైన UV కిరణాల ప్రభావం నుండి కాపాడేందుకు, మరియు అకాల వృద్దాప్య చాయలను నివారించడంలో కూడా ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు.

• ఒక నిమ్మకాయ రసం.

ఉపయోగించు విధానం :

• కలబంద గుజ్జును ఒక గిన్నెలోనికి తీసుకోవాలి.

• దీనికి నిమ్మరసాన్ని జోడించి, రెండు పదార్థాలను కలిపి మిక్స్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి కొన్ని నిముషాలపాటు మీ చర్మానికి మృదువుగా మసాజ్ చేయాలి.

• అది మీ చర్మంలోనికి పూర్తిగా శోషించుకోనివ్వండి.

• నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాలకోసం వారానికి 2 నుండి 3 సార్లు పునరావృతం చేయండి.

7. కలబంద గుజ్జు మరియు నారింజ తొక్క :

7. కలబంద గుజ్జు మరియు నారింజ తొక్క :

చర్మ సంరక్షణలో ఎంతగానో సహాయపడే విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న నారింజ తొక్క, చర్మాన్ని అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి కాపాడుతుంది. అంతేకాకుండా, వాపు మరియు చిరాకుగా ఉండే చర్మానికి ఉపశమనంగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• 1 టేబుల్ స్పూన్ ఎండిన నారింజ తొక్క పొడి.

ఉపయోగించు విధానం :

• రెండు పదార్ధాలను ఒక గిన్నెలోనికి కలిపి తీసుకోండి.

• ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతం మీద అప్లై చేయండి.

• కొన్ని నిముషాలపాటు మీ చర్మాన్ని మృదువుగా మసాజ్ చేయండి.

• పూర్తిగా ఆరిన తరువాత, చల్లని నీటితో శుభ్రపరచండి.

• ఆశించిన ఫలితాల కోసం వారంలో 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి.

8. కలబంద మరియు బ్రౌన్ షుగర్ :

8. కలబంద మరియు బ్రౌన్ షుగర్ :

కలబంద గుజ్జు, బ్రౌన్ షుగర్ సన్ బర్న్ చికిత్సలో ఎంతగానో సహాయపడుతుంది మరియు హానికరమైన సూర్యకిరణాల నుండి చర్మాన్ని కాపాడడం ద్వారా అకాల వృద్దాప్య చాయలను కూడా నివారిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• 2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్.

ఉపయోగించు విధానం :

• రెండు పదార్ధాలను ఒక గిన్నెలోకి తీసుకుని, మిశ్రమంగా కలపండి.

• ప్రభావిత ప్రాంతంమీద ఈ మిశ్రమాన్ని కొన్ని సెకన్లపాటు ఉంచి మృదువుగా మర్దన చేయండి.

• 10 నుండి 15 నిమిషాల పాటు గాలికి అలానే వదిలేయండి.

• పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి.

• ఆశించిన ఫలితాల కోసం వారానికి 2 నుండి 3 సార్లు పునరావృతం చేయండి.

9. కలబంద మరియు చందనం పొడి :

9. కలబంద మరియు చందనం పొడి :

చందనంపొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది వాపును మరియు చిరాకును తగ్గించి చర్మానికి ఉపశమనాన్ని ఇవ్వడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. కమిలిన చర్మానికి విశ్రాంతిని ఇస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్.

• 1 టేబుల్ స్పూన్ చందనం పొడి.

• కొన్ని చుక్కల రోజ్ వాటర్.

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలో కలబంద గుజ్జు మరియు చందనం పొడిని తీసుకుని మిశ్రమంగా చేయండి.

• అందులో కొంత రోజ్ వాటర్ వేసి మిశ్రమంగా పేస్ట్ వలె కలపండి.

• ప్రభావిత ప్రాంతంమీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

• 15 నిమిషాలపాటు గాలికి ఆరనివ్వండి.

• కాసేపటి తర్వాత చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం వారంలో రెండుసార్లు అనుసరించండి.

10. కలబంద మరియు పుదీనా :

10. కలబంద మరియు పుదీనా :

పుదీనా యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని మృదువుగా చేయడంలో, మరియు సన్ బర్న్ వలన కలిగే చికాకు మరియు దురద వంటి వాటినుండి ఉపశమనాన్ని అందివ్వడంలో అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• ఒక గుప్పెడు పుదీనా ఆకులు.

ఉపయోగించే విధానం :

• పుదీనా ఆకులను పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

• ఈ పేస్ట్ కు కలబంద గుజ్జును జోడించి, మిశ్రమంగా కలపాలి..

• ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతం మీద రాయండి.

• 15 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి.

• చల్లటి నీటిని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం రోజుకొకసారి పునరావృతం చేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Effective Aloe Vera Remedies To Treat Sunburns

Aloe vera gel is a miraculous natural ingredient that works wonders for a ton of skin issues. This soothing gel is a versatile ingredient that can benefit our skin in a number of ways. One of the best uses of aloe vera gel in your skincare is that of treating sunburns. It can be used either by itself or with ingredients like egg, mint, cucumber etc.,
Desktop Bottom Promotion