For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూత్ పేస్టుతో పళ్లు తోముకోవడమే కాదు మీ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది, దాని వల్ల 10 ప్రయోజనాలివే

మీ చర్మంపై ఉపయోగించే టూత్పేస్ట్ అనేకరకాల చర్మ సమస్యలను తగ్గించడంలో గొప్పగా పనిచేయగలదని చెప్పబడింది. క్రమంగా టూత్ పేస్ట్, మచ్చలు, మొటిమలు, డార్క్ స్పాట్స్, చర్మంపై ముడుతలు, చర్మ రంధ్రాలు మొదలైనవి తొలగ

|

టూత్ పేస్టు మీ దంతాల పరిశుభ్రత, మరియు తెల్లగా నిగారించేలా చేయడమే కాకుండా ఇతరత్రా అనేక అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. మీ చర్మంపై ఉపయోగించే టూత్పేస్ట్ అనేకరకాల చర్మ సమస్యలను తగ్గించడంలో గొప్పగా పనిచేయగలదని చెప్పబడింది. క్రమంగా టూత్ పేస్ట్, మచ్చలు, మొటిమలు, డార్క్ స్పాట్స్, చర్మంపై ముడుతలు, చర్మ రంధ్రాలు మొదలైనవి తొలగించడంలో కూడా సహాయపడగలదు. కానీ ఎంపిక సరైనదిగా ఉండాలి.

ఈ అద్భుత గృహ నివారిణి, క్రమం తప్పకుండా అనుసరిస్తున్న ఎడల, నిర్దిష్ట సమయానికి మీ సమస్యలు తగ్గుముఖం పట్టి, చర్మాన్ని మెరిసేలా చేయగలదు. మరోవైపు, టూత్ పేస్టు పరిహారాన్ని ఉపయోగించడం అనేది మహిళలకు మాత్రమే కాకుండా, పురుషులు కూడా వివిధ రకాల అవసరాలకు కూడా చర్మంపై వినియోగించడం జరుగుతుంటుంది.

టూత్ పేస్టు వలన చర్మానికి చేకూరే 10 ఉత్తమమైన ప్రయోజనాలు

మీ చర్మంపై టూత్ పేస్టు వినియోగం కూడా మీ టోన్ ప్రకాశవంతంగా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. తెల్లటి టూత్ పేస్టులో ఉండే లక్షణాలు మచ్చలు మరియు గాయాలను సైతం తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా టూత్ పేస్టు వాడకం, మీ చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యను కూడా దూరం చేస్తుంది.

1. ముడుతలను తగ్గించడంలో టూత్పేస్ట్ వినియోగం

1. ముడుతలను తగ్గించడంలో టూత్పేస్ట్ వినియోగం

ముడుతలతో కూడిన చర్మానికి, టూత్పేస్ట్ ఎంతగానో సహకరిస్తుంది. టూత్ పేస్టు ముడతలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహకరిస్తుంది. ప్రభావిత ప్రాంతంలో టూత్ పేస్టును వర్తించి., రాత్రంతా అలాగే ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రం చేయండి. ఇటువంటి ఉపయోగాలు అనేకం టూత్ పేస్టుతో. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

2. చర్మం తెల్లబడటంలో

2. చర్మం తెల్లబడటంలో

చర్మం తెల్లబడటంలో టూత్ పేస్టు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పబడింది. టానింగ్ కూడుకున్న చర్మానికి ఉపశమనంగా పనిచేయడమే కాకుండా, చర్మం నిగారింపుకు తోడ్పాటుని అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ టూత్ పేస్టులో కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి వర్తించండి. మీ ముఖం మీది చర్మం టోన్ను మెరుగుపరచడానికి ఒక ప్యాక్ వలె పనిచేస్తుంది.

3. మొటిమల నివారిణిగా టూత్పేస్ట్

3. మొటిమల నివారిణిగా టూత్పేస్ట్

మొటిమల సమస్య ఎదుర్కోని చర్మం అంటూ ఉండదు. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ, ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కోవలసిందే. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, వాతావరణ కాలుష్యం నుండి శరీర అంతర్గత వ్యాధులు, హార్మోనుల ప్రభావాలు, ఆహారపు అలవాట్లలో అసాధారణ మార్పులు, క్రమంతప్పిన జీవన శైలి, అశుభ్రత వంటి అనేక అంశాలు దీని వెనుక గల ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఎప్పుడైనా ఒక మొటిమ కనిపించినప్పుడు, దానిపై కొద్దిగా పేస్ట్ అప్లై చేసి, ఒక రాత్రి అలాగే ఉండనివ్వండి. మరుసటి ఉదయం ఆ ప్రాంతం ఒక మచ్చ కూడా లేకుండా పొడిగా కనిపిస్తుంది.

మచ్చలను తొలగించుటలో టూత్పేస్ట్ వినియోగం

మచ్చలను తొలగించుటలో టూత్పేస్ట్ వినియోగం

టూత్పేస్ట్ సహాయంతో మచ్చలను కూడా తొలగించుకోవచ్చునని తెలుసా ? పేస్ట్ మరియు పాలను మిశ్రమంగా చేయండి, మీ ముఖం మీద మచ్చల సమస్యను వదిలించుకోవడానికి ఇది చక్కగా పని చేస్తుంది.

5. డార్క్ స్పాట్స్ తొలగించడంలో టూత్ పేస్టు ఉపయోగం

5. డార్క్ స్పాట్స్ తొలగించడంలో టూత్ పేస్టు ఉపయోగం

డార్క్ స్పాట్స్ సమస్యను టూత్ పేస్టు తేలికగా పరిష్కరించగలుగుతుంది. అయితే దీనిలో అదనంగా టమేటా రసం జోడించడం అవసరమవుతుంది.

6. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో టూత్ పేస్ట్ వినియోగం

6. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో టూత్ పేస్ట్ వినియోగం

బ్లాక్ హెడ్స్, మనం ప్రతిరోజూ ఎదుర్కొనే చర్మ సమస్యలలో ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ తొలగించడానికి, టూత్ పేస్టును వాల్నట్ స్క్రబ్ తో జోడించడం అవసరమవుతుంది.

7. డార్క్ లైన్స్ తొలగించడంలో టూత్పేస్ట్ వినియోగం

7. డార్క్ లైన్స్ తొలగించడంలో టూత్పేస్ట్ వినియోగం

చర్మ రక్షణలో టూత్పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని ఇప్పటికే మీకొక అవగాహన వచ్చింది కదా. క్రమంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది, అందులో డార్క్ లైన్స్ కూడా ఒకటి. మీరు చేయవలసిందల్లా పేస్ట్ లో కొద్దిగా నీటిని కలిపి, వర్తించడమే.

8. ముఖం మీది అవాంచిత రోమాలను తొలగించడంలో కూడా

8. ముఖం మీది అవాంచిత రోమాలను తొలగించడంలో కూడా

ముఖం మీది అవాంచిత రోమాలను తొలగించడంలో టూత్పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్రమంగా ఇందులో, నిమ్మకాయ మరియు ఉప్పు లేదా చక్కెరలను జోడించడం అవసరమవుతుంది. ఈ మిశ్రమం, అవాంచిత రోమాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Most Read :ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదేMost Read :ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

9. వైట్ హెడ్స్ నివారించడంలో కూడా

9. వైట్ హెడ్స్ నివారించడంలో కూడా

టూత్ పేస్టును నీటితో కలిపి క్రమం తప్పకుండా వర్తిస్తున్న ఎడల, బ్లాక్ హెడ్స్ తోపాటుగా వైట్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.

10. జిడ్డు చర్మానికి టూత్పేస్ట్ :

10. జిడ్డు చర్మానికి టూత్పేస్ట్ :

జిడ్డు చర్మానికి టూత్పేస్ట్ సహాయంతో చికిత్స చేయవచ్చు. టూత్ పేస్ట్ లో, నీరు మరియు ఉప్పును జోడించడం ఉత్తమ పరిష్కారంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ ఉదయాన్నే ఈ చిట్కాను అనుసరిస్తూ, ముఖాన్ని శుభ్రపరచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Uses of Toothpaste for your Skin

10 Uses Of Toothpaste For Your Skin
Desktop Bottom Promotion