For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహ గడియలు సమీపిస్తున్నాయా ? అయితే మీరు తప్పక ఆచరించదగిన 12 ఫేస్ ప్యాక్స్ ఇవే..!

|

మీ వివాహ గడియలు సమీపిస్తున్నాయా ? వివాహానికి ముందుగల సమయం మీకు కొంచం గందరగోళ వాతావరణంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అందం నుండి వస్త్రధారణ వరకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక ప్రణాళికలు అవసరమవుతాయి. ఒకరకరంగా చెప్పాలంటే, ఈ సమయం ఒక అందమైన మధురానుభూతిగా ఉంటుంది. అయితే మీ పెళ్లి రోజున మీరు అందమైన ప్రకాశవంతమైన చర్మంతో కనపడాలని కోరుకుంటున్న వారైతే, మీ చర్మం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా ఉంటుంది. బ్యూటీపార్లర్లలో ఫేషియల్ వంటి వాటికి పూనుకుంటే, అది కృత్రిమంగానే కాకుండా, అధిక ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

Brides-To-Be

కావున డబ్బును సమయాన్ని వృధా చేయకుండా, ఇంట్లోనే సహజ సిద్దమైన అందాన్ని పొందాలని భావిస్తున్న ఎడల, గృహ చిట్కాలను పాటించక తప్పదు. ఇవి మీకు సహజ సిద్దమైన చర్మ సౌందర్యాన్ని అందివ్వడమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి. క్రమంగా, మీరు అనుసరించదగిన సహజ సిద్దమైన ఫేస్ పాక్ల గురించిన సమగ్ర వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

1. తేనె మరియు టమోటో జ్యూస్ మాస్క్ :

1. తేనె మరియు టమోటో జ్యూస్ మాస్క్ :

తేనె చర్మానికి సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ వలె పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఇది చర్మం పెళుసుగా మారకుండా, మృదువుగా ఉండేలా ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. టొమాటాలో లైకోపీన్ ఉంటుంది, ఇది హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్దిగా ఉంటాయి.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 2 టేబుల్ స్పూన్ల టమోటా రసం

ఉపయోగించే విధానం :

• ఈ రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలపండి.

• మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా నలువైపులా విస్తరించునట్లు వర్తించండి.

• దీనిని 25 నిమిషాలపాటు అలాగే ఉంచండి.

• సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రపరచండి.

2. అవకాడో మరియు తేనె మాస్క్ :

2. అవకాడో మరియు తేనె మాస్క్ :

విటమిన్లు మరియు ఖనిజాలు కలిగిన, అవకాడో చర్మానికి పోషణనిస్తుంది. అవకాడోలో విటమిన్ ఎ, సి, ఇ మరియు కె, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండి మీ చర్మానికి సహజ సిద్దమైన గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 పండిన అవకాడో

• 1 టేబుల్ స్పూన్ ముడి తేనె

• 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

ఉపయోగించే విధానం :

• అవకాడోను, ఒక గిన్నెలో వేసి దానిని గుజ్జు వచ్చేవరకు మాష్ చేయాలి.

• గిన్నెలో తేనె మరియు కొబ్బరి నూనెలను చేర్చి వాటిని బాగా మిక్స్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై నలుదిక్కులా సమానంగా విస్తరించునట్లు వర్తించాలి.

• పొడిగా మారేవరకు 20 నుండి 30 నిమిషాలపాటు వదిలేయండి.

• శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని గోరు వెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి.

• ఈ కాటన్ క్లాత్ లేదా కాటన్ బాల్ ఉపయోగించి మీ ముఖాన్ని తుడవండి.

• కొంతసేపటి తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.

గమనిక : పొడిచర్మం కలిగిన వారికి ఈ ఫేస్ పాక్ ఉత్తమంగా ఉంటుంది.

3. కలబంద మరియు పసుపు :

3. కలబంద మరియు పసుపు :

కలబంద మొటిమలు మరియు మచ్చలతో పోరాడేందుకు సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగిఉంటుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచుతుంది. పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మొటిమలతో పోరాడి మీ సమస్యను తగ్గుముఖం పట్టించగలదు.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు.

• చిటికెడు పసుపు

ఉపయోగించే విధానం :

• రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకొని, బాగా కలపండి.

• దీనిని మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు వర్తించండి.

• పొడిగా మారేవరకు 20 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి.

• సాధారణ నీటితో దానిని శుభ్రపరచండి

• పొడి తువాలుతో ముఖం మీది నీటిని తొలగించండి.

• ఆశించిన ఫలితాల కోసం వారంలో కనీసం రెండు మార్లు దీన్ని అనుసరించండి.

గమనిక: ఈ మాస్క్ జిడ్డు చర్మానికి అనువుగా ఉంటుంది.

4. నిమ్మ మరియు పాలపొడి :

4. నిమ్మ మరియు పాలపొడి :

నిమ్మ యాంటీ ఆక్సిడెంట్స్లో సమృద్ధిగా ఉండి, ఫ్రీ రాడికల్ (స్వేచ్చా రాశులు) సమస్యతో పోరాడడంలో సహాయపడుతుంది. క్రమంగా ఇది మొటిమలతో పోరాడుతూ, చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పాలపొడి మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమంగా ఇది మొటిమలతో పోరాడేందుకు సహాయపడుతుంది. మరియు చర్మాన్ని శుభ్రంగా మరియు ప్రకాశవంతముగా ఉంచుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 స్పూన్ పాలపొడి

• కొన్ని చుక్కల నిమ్మరసం

ఉపయోగించు విధానం :

• మిల్క్ పౌడర్లో నిమ్మరసం వేసి, మిశ్రమంలా చేసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా అప్లై చేయాలి.

• పొడిగా మారేవరకు కనీసం 20 నిమిషాలపాటు, అలాగే ఉంచండి.

• తరువాత చల్లటి నీటితో దానిని శుభ్రపరచండి.

• ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మంచిది.

5. అరటి పండు మరియు తేనె :

5. అరటి పండు మరియు తేనె :

అరటి పండు మొటిమలను తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. దీనికి కారణం, ఇందులో ప్రధానంగా పొటాషియం, జింక్, అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ ఎ, B6 మరియు C ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయం చేస్తూ, ఆరోగ్యకరస్థితిలో ఉంచుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 పండిన అరటి పండు

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 గుడ్డు

• 1 కప్ కొవ్వు అధికంగా ఉన్న పాలు

ఉపయోగించే విధానం :

• పాలను మరిగించి చల్లారనివ్వాలి.

• పాల ఉపరితలంపై ఏర్పడ్డ క్రీమ్ బయటకు తీసి, దానిని పక్కకు పెట్టండి.

• అరటి పండును ఒక గిన్నెలోకి తీసుకుని, దానిని మాష్ చేసి గుజ్జులా చేయండి.

• గుడ్డును బ్లెండ్ చేసి, దాన్ని అరటి గుజ్జుకు జోడించండి.

• ఒక గిన్నెలో తేనె మరియు మిల్క్ క్రీమ్ చేర్చి అన్నింటినీ కలిపి ఒక మిశ్రమంలా కలపండి.

• దీనిని మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు వర్తించండి.

• పొడిగా మారేవరకు 20 నుండి 30 నిమిషాలపాటు అలాగే ఉంచండి.

• చల్లటి నీటితో దానిని శుభ్రపరచండి..

• కాసేపటి తర్వాత మాయిశ్చరైజర్ రాయండి.

గమనిక: ఈ ప్యాక్ ఎటువంటి చర్మానికైనా అనువుగా ఉంటుంది.

6. నిమ్మ మరియు నారింజ తొక్క :

6. నిమ్మ మరియు నారింజ తొక్క :

నారింజ తొక్క చర్మం పాడవకుండా కాపాడడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లను అధిక మొత్తాలలో కలిగి ఉన్న కారణంగా, ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయం చేస్తుంది. ఇది మీ చర్మానికి ఒక ఆరోగ్యకరమైన మెరుపును జోడిస్తుంది. ఇది మీ చర్మ రంద్రాలు తెరుచుకోవడంలో సహాయం చేసి, మృత కణాలను తొలగించి, మొటిమలను మరియు మచ్చలను నివారించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మీ చర్మాన్ని పునరుజ్జీవనం గావిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• కొన్ని చుక్కల తాజా నిమ్మరసం

• 1 టమాటా

• 1 టేబుల్ స్పూన్ ఎండిన నారింజ తొక్క పొడి

ఉపయోగించు విధానం :

• బ్లెండ్ చేసి టమాటా నుండి రసాన్ని సంగ్రహించండి.

• టమాటా రసంలో నిమ్మరసం, నారింజ తొక్కల పొడిని కలపండి.

• వీటన్నిటినీ మిశ్రమంగా కలపండి.

• దీనిని మీ ముఖంపై అప్లై చేయండి.

• పొడిగా మారేవరకు, సుమారు 15 నుండి 20 నిమిషాలపాటు ఆరనివ్వండి.

• సాధారణ నీటితో శుభ్రపరచండి.

గమనిక: ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి అనువుగా ఉంటుంది.

7. స్ట్రాబెర్రీ మాస్క్ :

7. స్ట్రాబెర్రీ మాస్క్ :

స్ట్రాబెర్రీలో విటమిన్ సి మరియు పీచు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ, చర్మంనుండి విషతుల్య పదార్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీ మొటిమలతో పోరాడటానికి, మరియు హానికరమైన అతినీలలోహిత కిరణాల వలన కలిగే నష్టం నుండి మీ చర్మాన్ని రక్షించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. క్రమంగా చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 3 నుండి 4 స్ట్రాబెర్రీలు

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 2 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

ఉపయోగించు విధానం :

• స్ట్రాబెర్రీలను ఒక బౌల్లో జోడించి, మాష్ చేసి గుజ్జుగా చేయండి.

• గిన్నెలో పెరుగు, తేనె చేర్చి మిశ్రమంగా కలపండి. .

• ఈ మిశ్రమంలో నిమ్మరసం జోడించి బ్లెండ్ చేయండి.

• దీనిని మీ ముఖంపై నలుదిక్కులా అప్లై చేయండి.

• పొడిగా మారేవరకు 15 నుండి 20 నిమిషాలపాటు విడిచిపెట్టండి.

• తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి.

8. ద్రాక్ష మాస్క్ :

8. ద్రాక్ష మాస్క్ :

ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి మరియు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాకుండా ద్రాక్షలో యాంటీ ఏజింగ్ (వృద్దాప్య వ్యతిరేక లక్షణాలు) మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. మరియు ద్రాక్ష విటమిన్-సి లో సమృద్ధిగా ఉంటుంది. క్రమంగా ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడంలో సహాయపడగలదు.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ద్రాక్ష రసం

• ¼ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా

• 1 టేబుల్ స్పూన్ పిండి (సెనగ పిండి వంటివి ఏదైనా)

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలో అన్ని పదార్థాలను కలిపి, మృదువైన మిశ్రమంగా చేయండి.

• దీనిని మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి.

• 20 నిమిషాలపాటు అలాగే ఉంచండి.

• సాధారణ నీటితో శుభ్రపరచండి.

9. బొప్పాయి ప్యాక్ :

9. బొప్పాయి ప్యాక్ :

బొప్పాయిలో విటమిన్ - ఎ మరియు సి వంటి విటమిన్లతో పాటుగా, పొటాషియం వంటి మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. క్రమంగా ఇది చర్మానికి మాయిశ్చరైజర్ వలె పనిచేస్తుంది. మరియు ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాల నుండి మృత కణాలను తొలగించి, మొటిమలు, మచ్చలు రాకుండా సహాయపడుతుంది. తద్వారా బొప్పాయి మీకు ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడంలో సహాయం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• ఒక చిన్న పండిన బొప్పాయి ముక్క ఒకటి.

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ చందనం పొడి

ఉపయోగించు విధానం :

• బొప్పాయిని ఒక గిన్నెలోనికి జోడించి, మాష్ చేసి గుజ్జులా చేయండి.

• ఈ మిశ్రమంలో తేనె మరియు చందనం పొడిని చేర్చి బాగా బ్లెండ్ చేయండి.

• దీనిని ముఖం మరియు మెడ మీద పూర్తిస్థాయిలో అప్లై చేయండి.

• 20 నిమిషాలపాటు దానిని అలాగే వదిలివేయండి.

• తరువాత నీటితో శుభ్రపరచండి.

• మీ ముఖంపై కొంత రోజ్ వాటర్ను చివరలో స్ప్రే చేయండి.

10. కీరా దోసకాయ మాస్క్ :

10. కీరా దోసకాయ మాస్క్ :

కీరా దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది మొటిమలు మరియు మచ్చల చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి మరియు కాఫిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. దీనిలోని సిలికా చర్మం స్థితిస్థాపకతను పెంచడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉండేలా చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 కీరా దోసకాయ

• 1 టేబుల్ స్పూన్ శెనగపిండి (బేశన్)

• చిటికెడు పసుపు

ఉపయోగించు విధానం :

• కీరా దోసకాయ నుండి రసాన్ని సంగ్రహించండి.

• దీనికి శెనగపిండి మరియు పసుపును జోడించి మిశ్రమంగా కలపండి.

• దీన్ని ముఖంపై వర్తించండి.

• పొడిగా మారేవరకు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి.

• గోరువెచ్చని నీటితో దానిని శుభ్రపరచండి. .

11. చందనం నూనె మరియు రోజ్ వాటర్ :

11. చందనం నూనె మరియు రోజ్ వాటర్ :

చందనం నూనె సహజ సిద్దమైన యాంటి ఆక్సిడెంట్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ గుణాలను సైతం కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయం చేస్తుంది. మరియు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి, చర్మాన్ని పునరుజ్జీవనంగావిస్తుంది. క్రమంగా చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచడంలో సహాయపడతాయి.

కావలసిన పదార్ధాలు :

• 3 టేబుల్ స్పూన్ల చందనం నూనె

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

• 3 టేబుల్ స్పూన్ల పాలపొడి

ఉపయోగించే విధానం :

• అన్ని పదార్థాలను కలిపి మిశ్రమంలా చేయండి.

• దీనిని ముఖంపై సమానంగా అప్లై చేయండి.

• పొడిగా మారే వరకు 15 నుండి 20 నిమిషాలపాటు అలాగే వదిలివేయండి.

• సాధారణ నీటితో శుభ్రపరచండి.

12. తేనె మరియు క్యారెట్ :

12. తేనె మరియు క్యారెట్ :

క్యారెట్ విటమిన్-ఎ లో సమృద్ధిగా ఉంటుంది మరియు ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడంలో సహాయపడతాయి. ఎండ ప్రభావాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి, చర్మం స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్దాప్య చాయలు రాకుండా నిరోధించగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల తాజా క్యారెట్ జ్యూస్

• 1 టేబుల్ స్పూన్ తేనె

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలోకి రెండు పదార్థాలను తీసుకుని మిశ్రమంగా కలపండి.

• దీనిని ముఖంపై నలుదిక్కులా సమానంగా అప్లై చేయాలి.

• 10 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.

• గోరువెచ్చని నీటితో దానిని శుభ్రపరచండి.

గమనిక: ఈ ప్యాక్ పొడి చర్మానికి అనువుగా ఉంటుంది.

టువంటి ఫేస్ పాక్ అనుసరించినా, మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అనుసరించాలని గుర్తుంచుకోండి. మరియు ఎండ ప్రభావం పడకుండా సన్స్క్రీన్ పాటించడం, తరచుగా చల్లని నీటితో ముఖం శుభ్రపరచుకోవడం కూడా మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

12 Must-Try Face Packs For The Brides-To-Be

Home-made face packs like honey and tomato pack, aloe vera andturmeric pack etc., can be used to nourish the skin and get the bridalglow.:
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more