For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యవ్వనంలో ఉండే వారంతా ఈ సూచనలు పాటించాలి, అందంగా కనపడతారు

చాలా మంది టీనేజర్స్ మేకప్ పై ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. యూత్ మేకప్ కు దూరంగా ఉంటేనే మేలు. కాస్త వయస్సు అయిపోయిన వారు మేకప్ వేసుకుంటే దానికంటూ ఒక అర్థం ఉంటుంది. కానీ టీనేజర్స్ కు అప్పుడప్పుడు మంచి

|

యవ్వనం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆ వయస్సులో ప్రతిదీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. లోకమంతా అదోలా ఉంటుంది. అంతేకాదు అందంగా ఉండాలని.. ఆనందంగా గడపాలని మనస్సు పరితపిస్తుంది. ఇక టీనేజర్స్ గర్ల్స్ అందంగా కనిపించాలని ఏవేవో చేసేస్తుంటారు.

అయితే కొన్ని చేయకుంటే మంచిది. కొన్ని చేస్తే మంచిది. మరి ఏం చెయ్యాలో.. ఏం చెయ్యకూడదో తెలుసుకోండి.

నీరు

నీరు

రోజూ నీరు తాగడం చాలా అవసరం. నీరు తాగకుంటే స్కిన్ మొత్తం డ్రైగా మారుతుంది. డార్క్ స్పాట్స్, మొటిమలు రాకుండా ఉండాలంటే రోజూ వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. టీనేజర్స్ చాలా మంది ఎక్కువగా నీరు తాగకుండా ఇంకేవేవో తాగుతూ ఉంటారు. దీంతో అందం అంతా పాడవుతుంది.

మేకప్

మేకప్

చాలా మంది టీనేజర్స్ మేకప్ పై ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. యూత్ మేకప్ కు దూరంగా ఉంటేనే మేలు. కాస్త వయస్సు అయిపోయిన వారు మేకప్ వేసుకుంటే దానికంటూ ఒక అర్థం ఉంటుంది.

కానీ టీనేజర్స్ కు అప్పుడప్పుడు మంచి చర్మం పెంపొందుతూ ఉంటుంది. దాన్ని మేకప్ వేసి పాడు చేసుకోకండి.

సహజసిద్దమైన జుట్టు

సహజసిద్దమైన జుట్టు

చాలా మంది జుట్టుకు రకరకాల రంగులు, షేడ్స్ వేస్తుంటారు. అలాకాకుండా టీనేజర్స్ జుట్టును సహజంగా ఉంచుకోవాలి. ఫ్యాషన్ లుక్ కోసం ఏవేవో కెమికల్స్ ను పూసి మీ అందమైన జుట్టును పాడుచేసుకోకండి.

Most Read :ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లయిన అమ్మాయినీ ప్రేమించొచ్చు, ఒకడితో కాపురం చేసొచ్చినా.Most Read :ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లయిన అమ్మాయినీ ప్రేమించొచ్చు, ఒకడితో కాపురం చేసొచ్చినా.

తక్కువ మేకప్

తక్కువ మేకప్

ఒకవేళ మేకప్ వేసుకోవాలనిపించినా కూడా తక్కువ మేకప్ వేసుకోండి. అతిగా మేకప్ వేసుకుంటే అది చూడడానికి అసహ్యంగా ఉండడంతో పాటు అందంపై ప్రభావం చూపుతుంది. అందుకే తక్కువ మేకప్ కే ప్రిపరెన్స్ ఇవ్వండి.

వాజిలిన్ ఉపయోగించండి

వాజిలిన్ ఉపయోగించండి

కళ్లకు సంబంధించిన మేకప్ ను తొలగించడానికి ఎక్కువగా వాజిలిన్ ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చీప్ గా దొరకడమే ఇందుకు కారణం. అంతేకాదు పగిలిపోయిన పెదాలకు మళ్లీ అందాన్ని ఇచ్చే గుణాలు వాజిలెన్ లో ఉంటాయి. వాజిలెన్ ను పెదాలపై పూసుకుంటూ ఉంటే చాలా మంచిది. పెదాలు చాలా సున్నితంగా మారుతాయి

కళ్లకు మేకప్

కళ్లకు మేకప్

కొందరు కళ్లకు చాలా ఎబ్బెట్టుగా మేకప్ వేస్తుంటారు. ఇది మంచి పద్దతి కాదు. దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. అలా చేయడం వల్ల మీరు తాత్కాలికంగా అందంగా కనపడినా తర్వాత చాలా రకాల అనారోగ్యాలకు గురవుతారు.

Most Read :బెల్లం తింటే ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా? అధిక బరువును అట్టే అధిగమించొచ్చుMost Read :బెల్లం తింటే ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా? అధిక బరువును అట్టే అధిగమించొచ్చు

English summary

Beauty secrets for teenage girls to make them look gorgeous

Beauty secrets for teenage girls to make them look gorgeous
Desktop Bottom Promotion