For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ మీ తలకు నూనె పెడుతున్నారా? అలా చేస్తే ఏమైతుందో తెలుసా, ఒక్కసారి తెలుసుకోండి మరి

|

ప్రతిరోజూ తలకు నూనె పెట్టడం, ముందస్తు జుట్టు రంగు మారడాన్ని నిరోధిస్తుందని ఎప్పుడైనా విన్నారా ? ఒకవేళ మీకు ఈ అలవాటు ఉండి ఉంటే, ఇది నిజంగా ఆహ్వానించదగిన విషయం. ఈ అలవాటు మీ జుట్టును దృఢంగా మరియు ఆరోగ్యకరంగా చేస్తుంది. అంతేకాకుండా ముందస్తుగా జుట్టు తెల్లరంగులోకి మారడాన్ని నిరోధిస్తుంది.

తరచుగా నూనె పెట్టడం సంగతి సరే, అలాగని ప్రతిరోజూ అనుసరిస్తే ఏమన్నా దుష్ప్రభావాలు తలెత్తుతాయా ? దీనికి కూడా సమాధానం అవుననే చెప్పాలి. ఇక్కడ ఒక దుష్ప్రభావం ఉంది. కానీ అందుకూ ఒక పరిష్కారం ఉంది.

దుష్ప్రభావం :

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ప్రతిరోజూ జుట్టుకు నూనె పెడుతున్న ఎడల, ప్రతిరోజూ దానిని శుభ్రపరచవలసి ఉంటుంది. జుట్టు చర్మాన్ని చల్లబరిచే లక్షణం ఉన్న నూనెను అనుసరించడం వలన చుండ్రు మరియు దురదతో కూడిన చర్మం వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందువలన, జుట్టు నుండి అదనపు నూనెను తరచుగా శుభ్రంచేయడం అవసరంగా ఉంటుంది.

స్నానం చేసే విధానం :

మరోవైపు, జుట్టుమీద చమురును తొలగించడానికి ప్రతిరోజూ షాంపూ ఉపయోగించడం కూడా ఆరోగ్యకరమైన విషయం కాదు. అందువల్ల, ప్రతిరోజూ మీరు జుట్టుకు నూనెను పట్టించే అలవాటు ఉన్న ఎడల, మీ జుట్టు మీద షాంపూ లేదా కండీషనర్ను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. వీలయితే సాంప్రదాయక పదార్ధాలను అనుసరించడం ఉత్తమం. గోరువెచ్చని నీటితో జుట్టును పులిమి, శుభ్రం చేసి, ఆపై కాసేపు మర్దన చేసి, పేరుకొన్న దుమ్ము ధూళిని నీటితో తొలగించండి.

ఇక్కడ ప్రతిరోజూ మీ జుట్టుకు నూనెను ఎందుకు అప్లై చేయాలి ? క్రమంగా ఈ పద్దతిని అనుసరించడానికి గల కొన్ని ప్రయోజనకరమైన కారణాలను పొందుపరచడం జరిగింది.


ఆరోగ్యకరమైన జుట్టు కోసం :

ప్రతిరోజూ నూనెను అనుసరించడం ద్వారా, మీ వెంట్రుకలు మెరిసేలా తయరవుతాయి. నూనె, పొడి జుట్టుకు పోషకాలను అందించి ఆరోగ్యకర జుట్టుకు పెరుగుదలకు ప్రోత్సాహకం ఇస్తుంది. ఏదిఏమైనప్పటికీ ఈ అలవాటు మిమ్మల్ని పొడి జుట్టు సమస్య నుండి బయటవేస్తుందని బ్యూటీషియన్లు మరియు నిపుణుల అభిప్రాయం.


నునుపైన జుట్టు కోసం :

మీ తలకు తరచుగా నూనెను అప్లై చేయడం, క్రమంగా మీ తలకు మర్దనను అనుసరించడం ద్వారా, రక్త నాళాలలో మంచి సర్క్యులేషన్ను ప్రోత్సహిస్తుంది. క్రమంగా జుట్టును మృదువుగా చేయడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కాలుష్య వ్యతిరేక చర్యలు :

ప్రతిరోజు నూనెను అప్లై చేయడం, మీ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. జుట్టు మీద చేరే కాలుష్యం, ధూళి, దుమ్ము మరియు సూర్యుడి నుండి జనించే హానికరమైన అల్ట్రా వైలెట్ కిరణాల నుండి మీ జుట్టును రక్షించడానికి ఒక అవరోధంగా పనిచేస్తుంది.

తెల్లజుట్టును నిరోధిస్తుంది :

ప్రతిరోజూ నూనెను అనుసరించడం వలన, ముందస్తు మరియు అకాల తెల్లజుట్టు సమస్య నుండి దూరంగా ఉండేలా జుట్టుకు సహాయపడుతుంది. ఈ అలవాటు బలహీనమైన జుట్టును బలంగా చేస్తుంది. క్రమంగా, మీ జుట్టుకు నూనెను వర్తించడానికి ప్రతిరోజూ కనీసం 10 నిముషాల సమయం వెచ్చించేలా ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.


చుండ్రును నిరోధిస్తుంది :

జుట్టు పతనానికి, హెయిర్ ఫాల్ సమస్యకు గల ప్రధాన కారణం చుండ్రు. జుట్టు పతనాన్ని ఆపడానికి, ముందుగా చుండ్రు సమస్యను వదిలించుకునేలా చికిత్సా పద్దతులను అనుసరించవలసి ఉంటుంది. మరియు చుండ్రును వదిలించుకోవటానికి ఉన్న ఏకైక మార్గం స్కాల్ప్(జుట్టుచర్మం) చికిత్స చేయడం. క్రమంగా నూనెను ఉత్తమ పరిష్కారంగా సూచించడం జరుగుతుంది. కనుక మీ స్కాల్ప్ పొడిగా ఉన్నట్లయితే ప్రతిరోజూ నూనెను అనుసరించడం మంచిది.

మీ జుట్టుకు ప్రోటీన్ అందిస్తుంది :

నూనెలలో ప్రముఖంగా కాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి, జుట్టులో ప్రోటీన్ నిల్వలను పొందడంలో సహాయపడుతాయి. జుట్టులో ప్రోటీన్ నిల్వలు పెరగడం, ఆరోగ్యకర జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. కావున ప్రతిరోజూ మీ జుట్టుకు నూనెను అప్లై చేయడం మంచిది.


జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

నూనెలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దారితీసే మూలాలను బలపరుస్తాయి. క్రమంగా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

మార్కెట్లో లభించే అనేక రకాల నూనెలు, రసాయనాలను కలిగి ఉంటాయి. కావున, మీరు ఎంపిక చేసుకునే నూనెలు అధిక రసాయనాలు లేకుండా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైతే మీ బ్యూటీషియన్ను సంప్రదించండి.


ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
English summary

Do You Oil You Hair Everyday

do you oil your hair everyday