Just In
- 7 hrs ago
రంజాన్ 2021: పవిత్రమైన ఉపవాసం నెల గురించి ఇవన్నీ తెలిసి ఉండాలి
- 7 hrs ago
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- 8 hrs ago
రంజాన్ 2021: డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండటం సురక్షితమేనా?
- 10 hrs ago
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో ధనస్సు రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
Don't Miss
- News
‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’.. 7 ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు తొలి పయనం
- Movies
శంకర్ 'ఇండియన్ 2' రెమ్యునరేషన్ గొడవ.. ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సింది ఎంత?
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్పై బెంగళూరు ఘన విజయం!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Automobiles
పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోవు బ్యూటి టిప్స్
మీరు మీ దైనందిక కార్యక్రమాలు, పని ఒత్తిళ్ల కారణంగా సాయంత్రానికి డస్సిపోయి ఇంటికి చేరి, ఏదైనా ఆహారం తీసుకుని వెంటనే విశ్రాంతికి ఉపక్రమిస్తుంటారు. అవునా ? అనేకమంది ఇంటికి వచ్చాక కనీసం ఫ్రెషప్ కూడా కాకుండా, నేరుగా సాక్సులతో సహా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. కానీ అవన్నీ దీర్ఘకాలిక అలవాట్లుగా మారి, జీవన శైలిలో అస్తవ్యస్త పోకడలకు దారితీస్తుంటాయి. క్రమంగా శారీరిక మానసిక సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఈ రోజుల్లో అనేకమంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారనడం వాస్తవం. కార్యాలయ పని ఒత్తిళ్ళు, చిన్న పిల్లల బాగోగులు చూసుకోవడం, లేదా సాధారణ బిజీ షెడ్యూల్స్ మొదలైన అనేక కారకాలు విశ్రాంతి లేమికి దారితీస్తుంటాయి.
అనేక సార్లు, మీరు మంచి చర్మం మరియు జుట్టు కలిగి ఉన్నప్పటికీ, మీరు సరైన సౌందర్యపరమైన జాగ్రత్తలు నిర్వహించకపోవడం మూలంగా అవి సమస్యలలో కూరుకోవడం ప్రారంభిస్తుంటాయి. సమయం లేకపోవడం, ఒత్తిడి, కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడపాల్సి రావడం, దుమ్ము మరియు కాలుష్యాల ప్రభావాలు, మొదలైనవి మీ చర్మం మరియు జుట్టు మీద తీవ్రమైన ప్రతికూలతలకు దారితీయవచ్చు.
సాధారణంగా, అనేకమంది ఉదయం పూట మాత్రమే చర్మ మరియు జుట్టు సంరక్షణ వ్యవస్థని అనుసరించడానికి మొగ్గు చూపుతారు. ఒకవేళ వాటిపట్ల ప్రత్యేక శ్రద్ద కనపరచాలని భావిస్తే వారాంతరాలనే ఎన్నుకుంటూ ఉంటారు. ఆ వారాంతరాలలోనే కాస్త సమయం ఉంటుంది కాబట్టి.
ఏదిఏమైనా, ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని మరియు జుట్టును సాధించడం కొరకు రోజువారీ అలవాట్లలో భాగంగా కొన్ని చిన్న మార్పులను జోడించుకోవడం ద్వారా కనీసం కొంతమేర సమస్యలకు దూరంగా ఉండగలరు. అవునా ?
ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కొన్ని సౌందర్యపరమైన చిట్కాలను అనుసరించడం ద్వారా దీర్ఘకాలంలో మీరు సమస్యాత్మక చర్మానికి, జుట్టుకు దూరంగా ఉండగలరు.

1. ఖచ్చితంగా ముఖాన్ని కడుక్కోవాలి :
మీరు కేవలం కొన్ని గంటల క్రితం ముఖాన్ని కడుక్కుని ఉన్నా కూడా, నిద్రపోయే ముందు ఖచ్చితంగా కడుక్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. రాత్రి సమయాలలో మీ చర్మ రంద్రాలలో సెబం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమల అభివృద్ధికి దారితీస్తుంది.

2. మీ మేకప్ తొలగించండి :
రోజు చివరల్లో మీ మేకప్ తొలగించడం ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. మేకప్ అలాగే ఉంచి నిద్రపోవడం సరికాదు. మేకప్ అలాగే ఉంచడం మూలంగా, కెమికల్స్ మరియు గ్రీజుతో మీ రంద్రాలు మూసుకుంటాయి. దీని వలన తరచుగా మొటిమలు మరియు మచ్చలు ఏర్పడుతాయి. కావున ఖచ్చితంగా మేకప్ తొలగించాలని నిర్ధారించుకోండి. దీనికి మీరు నువ్వుల నూనెను కూడా కాటన్ పాడ్ సహాయంతో ఉపయోగించవచ్చు.

మీ చర్మానికి ఎక్స్ఫోలియేట్ చేయండి :
మీ రోజు చివరలో మీ చర్మంపై పేరుకుని పోయిన మురికి, గ్రీజ్ మరియు మృత కణాలను పూర్తిస్థాయిలో తొలగించిన తర్వాతనే నిద్రకు ఉపక్రమించడం మేలు. ఇవి పేరుకునిపోవడం వలన చర్మం పొడిబారడం, వృద్దాప్య చాయలు ఏర్పడడం, డార్క్ సర్కిల్స్, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ఖచ్చితంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఏదైనా ఒక తేలికపాటి స్క్రబ్ వినియోగించి మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి.

కంటి కింద సూచించిన క్రీమ్ అప్లై చేయడం ఎంతో ముఖ్యం :
మంచి అండర్-ఐ క్రీమ్ వైద్యుని సహాయంతో ఎంచుకోండి. దీనిని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాలపాటు మీ కళ్ళ చుట్టుపక్కల భాగంలో మసాజ్ చేయండి. ఇది డార్క్ సర్కిల్స్ మరియు వృద్దాప్య చారలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

5. మీ చేతులను, పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి :
మీ చేతులు మరియు పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీ చేతులు మరియు పాదాల మీద విటమిన్ ఎ లేదా విటమిన్ సి తో కూడిన ఒక స్కిన్ క్రీమ్ ఉపయోగించండి.

6. మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం :
ముఖానికి తరచుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది మీ ముఖం యొక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, ముడతలు మరియు చారల వంటి సంకేతాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

7. కాటన్ దిండు కవర్లు వాడడం మానండి :
మీరు ఒక కాటన్ బదులుగా ఒక సిల్క్ జోడించిన దిండు కవర్ ఉపయోగించవచ్చు. కాటన్ దిండు కవర్లు మీ చర్మం మరియు జుట్టును పొడిబారేలా మరియు నిస్తేజంగా మార్చగలవు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి