For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో ఈ ట్రిక్స్ పాటిస్తే చర్మం పగలమన్నా పగలదు, ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చిట్కాలు చూడండి

ఆపిల్ ద్వారా కూడా మీ పొడి చర్మాన్ని సున్నితంగా మార్చుకోవొచ్చు. ఆపిల్ పండు తీసుకుని దాన్ని తొక్క మొత్తం తీసేయండి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అందులో కాస్త తేనే కూడా కలపండి. ఆ పేస్ట

|

ప్రస్తుతం అన్ని ప్రాంతాలను చలి వణికించేస్తుంది. చలికాలంలో అందరూ ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య చల్లటి పొడి చర్మం. చర్మం మొత్తం పొడిబారి, పగిలిపోయి చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మీ చర్మానికి నిగారింపు చేకూరుతుంది.

1. ఆరెంజ్ తొక్క

1. ఆరెంజ్ తొక్క

ఆరెంజ్ పండు తొక్క ద్వారా మీ చర్మాన్ని సున్నితంగా మార్చుకోవొచ్చు. పొడిబారిన మీ చర్మానికి కొత్త అందాన్ని తీసుకురావొచ్చు. ఆరెంజ్ పండు తిన్న తర్వాత దాని తొక్కలు పారేయకుండా ఎండబెట్టుకోండి. ఎండిన తొక్కలను మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోండి. కాస్త ఆ పొడి తీసుకుని, దానికి ఒక టీ స్పూన్ ఓట్ మీట్ కలిపి బాగా మిక్స్ చేసుకోండి. అందులో కొంచెం తేనే కలుపుకోండి. అలాగే కొంచెం పెరుగు కూడా కలుపుకోండి. దాన్ని మీ ముఖానికి, పొడి బారిన మీ చర్మం మొత్తానికి పూసుకోండి. కాసేపు అయ్యాక చల్లటి నీటితో కడుక్కోండి. మీ చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. అందంగా కనపడతారు.

2. ఆపిల్

2. ఆపిల్

ఆపిల్ ద్వారా కూడా మీ పొడి చర్మాన్ని సున్నితంగా మార్చుకోవొచ్చు. ఆపిల్ పండు తీసుకుని దాన్ని తొక్క మొత్తం తీసేయండి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అందులో కాస్త తేనే కూడా కలపండి. ఆ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసుకోండి. 15 నిముషాల పాటు ఆ ప్యాక్ అలాగే ఉంచుకోండి. తర్వాత వెచ్చని నీటితో కడగండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

3. అరటి

3. అరటి

అరటి పండు ద్వారా కూడా పొడిబారిన చర్మాన్ని సున్నితంగా మార్చుకోవొచ్చు. బాగా మాగిన అరటిపండు తీసుకోండి. దాన్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దానికి కాస్త తేనె, కాస్త పెరుగు కలుపుకోండి.

Most Read :అమ్మాయిల ఎత్తును బట్టి వారికొచ్చే వ్యాధులు చెప్పొచ్చు, ఎంత మేరకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవొచ్చుMost Read :అమ్మాయిల ఎత్తును బట్టి వారికొచ్చే వ్యాధులు చెప్పొచ్చు, ఎంత మేరకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవొచ్చు

ముఖానికి పూసుకోండి

ముఖానికి పూసుకోండి

దాన్ని ముఖానికి పూసుకోండి. 15 నిముషాల పాటు దాన్ని అలాగే ఉంచుకోండి. తర్వాత కడుక్కోండి. ఫేస్ కళకళలాడిపోతుంది. ట్రై చేయండి.

4. బొప్పాయి

4. బొప్పాయి

బొప్పాడు పండు తీసుకుని దాన్ని తొక్క తీసి వేసి ముక్కలుగా చేసుకోండి. మీకు కావాల్సినన్నీ ముక్కలు దాదాపు 10 వరకు చిన్నచిన్న ముక్కలు తీసుకోండి. వాటిని మిక్సీలో వేసి మిశ్రమంగా చేసుకోండి.

నిమ్మకాయరసాన్ని కలుపుకోండి

నిమ్మకాయరసాన్ని కలుపుకోండి

దానికి కాస్త తేనె, నిమ్మకాయరసాన్ని కలుపుకోండి. తర్వాత దాన్ని మీ ముఖం మీద రాసుకోండి. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని కడుక్కోండి. కొత్త నిగారింపు వస్తుంది.

Most Read :కొబ్బరి నీళ్లతో అంగ స్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుందిMost Read :కొబ్బరి నీళ్లతో అంగ స్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుంది

5. టమాట

5. టమాట

బాగా మాగిన టమాటలను తీసుకోండి. అందులో విత్తనాలను మొత్త తీసేయండి. టమాటాల నుంచి రసం తీయండి. అందులో కాస్త పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీ చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.

English summary

Homemade Fruit Face Packs for Winter

Homemade fruit face packs that are ideal for winter
Desktop Bottom Promotion