For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవంగా...డల్ గా ఉన్న చర్మాన్నిఆపిల్ ఫేస్ వాష్ తో గుడ్ బై చెప్పండి!

|

నిస్తేజమైన చర్మానికి ఊరటనిచ్చే ఆపిల్ ఫేస్ వాష్

ఈ ప్రపంచంలోని ప్రతిఒక్కరి చర్మం భిన్నరకాలుగా ఉంటుంది. కొందరికి పొడి చర్మం ఉండగా, కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. కొందరికి మందపాటి దృడమైన చర్మం ఉంటే, కొందరికి అత్యంత సున్నితమైన చర్మం ఉంటుంది. క్రమంగా ప్రతి ఒక్కరూ వారి వారి చర్మ రకాల మీద ఆధారపడి ఉత్పత్తులను ఎన్నుకుంటూ ఉంటారు. మార్కెట్లో కొనుగోలు చేసే అనేక రకాల ఉత్పత్తులలోని రసాయనాల కారణంగా, అవి మీ చర్మానికి హాని కలిగించే అవకాశాలు అధికంగా ఉంటాయని సౌందర్య నిపుణులు, చర్మ వైద్యులు తరచుగా హెచ్చరిస్తూనే ఉంటారు. క్రమంగా సహజ సిద్దంగా ఇంట్లోనే అందుబాటులో ఉండే ఉత్పత్తులను, మన చర్మానికి ఏవిధంగా వినియోగించవచ్చునో కూడా తెలియబరుస్తున్నారు. ఇవి మీ చర్మానికి సహజసిద్దమైన మెరుగులను, అందాన్ని ఇస్తూనే, చర్మాన్ని ఆరోగ్యకర స్థితిలో ఉంచుతాయి కూడా.

 

చర్మ సంరక్షణ కోసం ఇంట్లోనే అందుబాటులో ఉండే ఉత్పత్తుల గురించి, ఇదివరకే మీరు ఎన్నో తెలుసుకుని ఉంటారు. అయితే, మీ చర్మ సంరక్షణలో భాగంగా ఎప్పుడైనా ఆపిల్స్ ఉపయోగించారా ? విటమిన్ సి ప్రధానంగా ఉంటూనే, అనేక ఇతరత్రా శక్తివంతమైన ఆవశ్యక పోషకాలను కలిగి ఉన్న ఆపిల్, ఆరోగ్యకరమైన చర్మానికి గొప్ప ఎంపికగా ఉంటుందని చెప్పబడింది. ఇవి మీ చర్మంలోని కొల్లాజెన్ను అరికట్టడానికి ఎంతగానో సహాయపడుతాయి. అంతేకాకుండా మెలనిన్ ఉత్పత్తిలో కూడా సహాయం చేస్తాయి. మీ చర్మం యొక్క రంగుకు బాధ్యత వహించే ముఖ్యమైన పిగ్మెంట్లను కూడా అందిస్తుందని చెప్పబడుతుంది.

Apple Face

అన్నిటినీ మించి, మీ చర్మాన్ని కాంతివంతం చేయడంలో మరియు హైడ్రేట్ చేయడం, పోషణను అందించడానికి ఆపిల్స్ ఎంతగానో మీకు సహాయం చేస్తాయని మీకు ఇదివరకే తెలుసు. ఆపిల్స్, చర్మం మీది చారలను, సన్నటి గీతలను మరియు ముడతలను తగ్గించడం ద్వారా వృద్దాప్య సంకేతాలను (యాంటీ ఏజింగ్ లక్షణాలు) దూరంగా ఉంచగలదు. అంతేకాకుండా, ఆపిల్స్ మీ చర్మాన్ని సాధ్యమైనంత వరకు ఎండ వలన కలిగే చర్మ నష్టం నుండి కాపాడుతుంది. మరియు సన్ టాన్, సన్ బర్న్ నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. నిజానికి వాటి శీతలీకరణ లక్షణాలకు ధన్యవాదాలు చెప్పుకోక తప్పదు. అంతేకాకుండా, మొటిమల సమస్యలకు, డార్క్ స్పాట్స్, నల్ల మచ్చల చికిత్సలోనూ ఆపిల్ అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది.

 

ఆపిల్ మీ చర్మానికి గొప్ప టోనర్ వలె పనిచేస్తుంది. మరియు అన్ని చర్మ రకాలకు సిఫార్సు చేయబడుతుంది. ఇవి మీ చర్మాన్ని బిగుతుగా చేయడానికి, మీ చర్మం యొక్క పిహెచ్ లెవల్స్ సంతులనం చేయడానికి, పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి. ఇవి అధిక మోతాదులో చేరుతున్న జిడ్డును తగ్గించడంలో కూడా ఉత్తమంగా సహాయపడుతాయి. అదనంగా, ఆపిల్స్ కళ్ల సంరక్షణలో కూడా సమర్థవంతమైన పరిష్కారంగా భావిస్తారు. తరచుగా క్రమంతప్పకుండా వినియోగించిన ఎడల కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కూడా ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది.

టోనర్, స్క్రబ్, ఫేస్ మాస్క్ లేదా ఫేస్ వాష్ మొదలైన అనేక రకాల చర్మ సంరక్షణా పద్దతుల దృష్ట్యా ఆపిల్స్ వినియోగించవచ్చు. మీకిష్టమైన ఆపిల్ ఫేస్ వాష్ ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఈ వ్యాసంలో ఆపిల్ ఫేస్ వాష్ తయారీ పద్దతులలో శీఘ్రమైన మరియు సులభమైన పద్దతిని పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

Apple Face

ఆపిల్ ఫేస్-వాష్ ఇంట్లోనే తయారుచేసే విధానం :

కావలసిన పదార్ధాలు :

• 1 ఆపిల్

• 2 టేబుల్ స్పూన్ల తేనె

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

• 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్

Apple Face

తయారుచేసే విధానం :

• ఆపిల్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, గుజ్జుగా మారే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ గుజ్జుని ఒక బౌల్లోనికి తీసుకోండి..

• ఒక చిన్న గిన్నెలోనికి తేనెను తీసుకోండి.

• తరువాత, తాజాగా సంగ్రహించిన కలబంద గుజ్జుని తేనెలో కలిపి, రెండు పదార్ధాలను మిశ్రమంగా చేయండి.

• ఈ మిశ్రమానికి కొంత రోజ్ వాటర్ జోడించి మరలా కలపండి.

• చివరగా, ఈ మిశ్రమానికి కొంత జొజోబా నూనెను జోడించి, అన్ని పదార్ధాలను బ్లెండ్ చేయండి.

• ఇప్పుడు ఆపిల్ గుజ్జును తీసుకొని, మిశ్రమానికి జోడించి, ఒక స్థిరమైన మిశ్రమం తయారయ్యేంత వరకు అన్ని పదార్ధాలను బాగుగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లోనికి బదిలీ చేయండి. మరియు భవిష్యత్తు వినియోగం కొరకు చల్లని మరియు పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి.

• మీ ముఖాన్ని సాదా నీటితో శుభ్రపరచి, తర్వాత మీ చేతులలో కొంత ఆపిల్ ఫేస్ వాష్ తీసుకొని, మీ వేలికొనను ఉపయోగించి మీ ముఖానికి మసాజ్ చేయండి.

• సుమారు నిమిషం పాటు మసాజ్ చేసి, కడిగేయాలి.

• మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరచి, శుభ్రమైన టవల్తో ముఖంపై నీటిని తొలగించండి.

• ఆశించిన ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ ఆపిల్ ఫేస్ వాష్ని అనుసరించండి.

• ఇది సహజ సిద్దమైన ఫేస్ వాష్ అయినందువలన, ఎటువంటి హానికరమైన రసాయనాలను కలిగి ఉండదు.

• ఇది అన్ని రకాల చర్మాలకు నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు. మరియు సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది ఒక గొప్ప ఎంపికగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

How To Make Apple Face Wash At Home?

Apples are a great choice if you want healthy skin. They help to build collagen in your skin and also assist your skin in producing melanin. Apples hydrate and nourish your skin along with lightening your skin tone. Apples are also known to posses anti-ageing properties and are effective in treating acne, pimples, dark spots, and blemishes.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more