For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చింతపండు ఫేస్ వాష్ మీ చర్మానికి చేసే మేలు

|

మన ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కోసం ప్రతిరోజూ ఫేస్ వాష్ ఉపయోగించడం సర్వసాధారణం. సాధారణంగా, మహిళలు కొనుగోలు చేసే మార్కెట్ ఉత్పత్తులు, రసాయనిక నిక్షేపాలను కలిగి ఉంటూ, దీర్ఘ కాలిక వాడకం కారణంగా చర్మానికి హాని చేకూరుస్తాయని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తుంటారు కూడా. ప్రధానంగా తమ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కొరకు మార్కెట్లో లభించే ఫేస్ వాష్ల మీదే పూర్తిస్థాయిలో ఆధారపడుతున్నారు అన్నది వాస్తవం. ఈ ఉత్పత్తులలో అనేకం, మీ చర్మానికి హానిచేసే పదార్థాలను సైతం కలిగి ఉండవచ్చని సౌందర్య నిపుణులు, చర్మ సంబంధ వైద్యులు చెప్తుంటారు. అవి క్రమంగా అనేకరకాల ముడుతలు, వృద్దాప్య చాయలు వంటి తీవ్ర పరిస్థితులకు సైతం దారితీస్తాయి. కావున, మీరు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తిలో పొందుపరచబడిన పదార్ధాలని తనిఖీ చేయడం అత్యావశ్యకంగా సూచించబడుతుంది.

Tamarind Face Wash

ఒక కొత్త ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి బ్యూటీ స్టోరను ఆశ్రయించిన ప్రతిసారీ, మీ వంటగదిలో తక్షణం లభ్యం అయ్యే కొన్ని ముఖ్యమైన పదార్థాలతో ఇంటి వద్దనే ఫేస్ వాష్లు తయారు చేయవచ్చునని గుర్తుంచుకోండి. పైగా ఇంట్లోనే తయారుచేసుకోవడం మూలంగా ధర తక్కువగా ఉండడంతో పాటుగా, మార్కెట్లో లభించే ఉత్పత్తుల కన్నా ఉత్తమ ప్రయోజనాలను కూడా అందించగలవని చెప్పబడుతుంది. కేవలం ఫేస్ వాష్లు మాత్రమే కాకుండా, మాయిశ్చరైజర్లు, క్లీనర్లు, టోనర్లు, ఫేస్ స్క్రబ్లు, ఫేస్ మాస్క్లు, ఫేస్ వాష్లను కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతానికి చింతతో అనుసరించదగిన ఫేస్ వాష్ గురించిన వివరాలను తెలుసుకుందాం.

మీ చర్మం మరియు ముఖసౌందర్యం కోసం చింతపండులో ఉండే అద్భుతమైన ప్రయోజనాల గురించిన వివరాలను క్రింద ఇవ్వబడ్డాయి. మరియు మీ చర్మ సంరక్షణా ప్రక్రియలో భాగంగా ఇవి ఎలా సహాయపడగలవో ఇప్పుడు చూద్దాం.

మీ ముఖానికి చింత పండు ఎందుకు లాభదాయకరంగా సూచించబడుతుంది?

మీ ముఖానికి చింత పండు ఎందుకు లాభదాయకరంగా సూచించబడుతుంది?

వాస్తవానికి చింతపండు పోషకాల గనిగా ఉంటుంది. క్రమంగా ఇది మీ చర్మం నుండి మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది, తద్వారా అది చర్మాన్ని పునరుద్దరించగలుగుతుంది. ఇది మీ చర్మానికి పోషణ అందించి, మాయిశ్చరైజ్ చేసి, చర్మాన్ని మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది. అంతేకాక చింతపండు మీ స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది. మరియు మీ స్కిన్ టోన్ తేలికపరచడానికి కూడా సహాయపడుతుంది. ఇది సహజ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ వలె పనిచేస్తూ, సెల్యులైట్ చికిత్సలో సమర్ధవంతమైనదిగా ఉంటుంది.

అంతేకాకుండా, చింతపండు చర్మాన్ని టోనింగ్ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు ఇది ఇంట్లో ఉండే టోనర్లలో, ఇది అత్యంత మంచి ఎంపికల్లో ఒకటిగా ఉంటుంది. ఇది ప్రధానంగా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా యుక్తవయసులో వృద్దాప్య చాయలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఫైన్ లైన్స్(చారలు) మరియు ముడుతలను కూడా నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ మరియు డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. మెడ చుట్టూ చేరే ముదురు రంగు వలయాల చికిత్సలో కూడా దీనిని ఉపయోగించడం జరుగుతుంది. చింతపండు ఆక్నే సమస్య, మొటిమలు మరియు మచ్చల చికిత్సలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది.

మీ సౌందర్య పరిరక్షణలో భాగంగా చింతపండును జోడించి, ఫేస్ వాష్ వలె ఎలా ఉపయోగించవచ్చునో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో చింతపండు ఫేస్ వాష్ ఏవిధంగా తయారుచేయవచ్చు ?

ఇంట్లో చింతపండు ఫేస్ వాష్ ఏవిధంగా తయారుచేయవచ్చు ?

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

• 1 విటమిన్ ఇ క్యాప్సూల్ లేదా 1/2 టేబుల్ స్పూన్ విటమిన్ ఇ పౌడర్

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 1 టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్

తయారుచేసే విధానం :

తయారుచేసే విధానం :

• ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, పెరుగు తీసుకుని రెండు పదార్ధాలను బాగా బ్లెండ్ చేయాలి.

• ఇప్పుడు దానికి రోజ్ వాటర్ కలపండి.

• ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ తెరవండి మరియు దానిని బాగా స్క్వీజ్ చేసి ఆ ద్రవాన్ని మిశ్రమానికి జోడించండి లేదా ఈ మిశ్రమానికి కొంత విటమిన్ ఇ పొడిని జోడించండి.

• తరువాత, కొంత తేనెను కలపండి. అన్ని పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి జోడించేటప్పుడు, వాటన్నిటినీ సరిగ్గా కలుపుతున్నారో లేదో ధృవీకరణ చేసుకోండి.

• చివరగా, ఈ మిశ్రమానికి జోజోబా నూనెను జోడించి అన్నింటినీ బాగా బ్లెండ్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని ఫేస్ వాష్ కంటైనర్లో పోయాలి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకునే సమయంలో, ఈ మిశ్రమాన్ని మీ చేతులకు పట్టించి, మీ వేలికొనను ఉపయోగించి ముఖాన్ని మసాజ్ చేయండి. మీరు వాష్ చేయడానికి ముందు కనీసం 2 నిమిషాలపాటు మసాజ్ చేశారని నిర్ధారించుకోండి.

• ఆశించిన ఫలితాల కోసం ప్రతిరోజూ దీనిని పునరావృతం చేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Make Tamarind Face Wash At Home?

Rich in AHA, tamarind helps in removing dead skin cells from your skin, thus rejuvenating it. It deeply nourishes and moisturises your skin, making it soft and supple. Moreover, tamarind improves your skin tone. You can simply include tamarind in your beauty regime by making a tamarind-enriched face wash at home.
Story first published:Friday, April 12, 2019, 15:02 [IST]
Desktop Bottom Promotion