For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం కాంతివంతంగా , క్లియర్ గా మార్చే హోం రెమెడీస్

|

నిజానికి మనమందరమూ మన చర్మం స్పష్టంగా, నిష్కల్మషంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిస్తుంటాం. కానీ, బాహ్య ప్రపంచంలో మనం అనుకున్న విధంగా ఉండదు. పాటించే ఆహార ప్రణాళిక, జీవనశైలి, కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, రేడియేషన్, మొబైల్ లేదా గాడ్జెట్స్ స్క్రీన్స్ లకు ఎక్కువగా ప్రభావితమవడం వంటి అనేక సమస్యల కారణంగా , మన చర్మం తరచుగా పెళుసుగా మారడం, పాడైపోవడం, మొటిమల బారిన పడడం, మృత కణాలు పేరుకుని పోవడం, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, చారలు, వృద్దాప్య చాయలు, కంటి కింద వలయాలు, చర్మం ముడతలు పడడం వంటి సంకేతాలను తరచుగా ఎదుర్కొంటుంటాము . ఈ సమస్యలకు కారకాలు ఎన్ని ఉన్నప్పటికీ, కొన్ని చర్మ సంరక్షణా చర్యలను తీసుకుంటున్న ఎడల, అనేక సమస్యలను ఆదిలోనే తొలగించుకోవచ్చు.

క్రమంగా ఈ ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్, వంటి పలు సమస్యల పరంగా దిగులు చెందకుండా, మన వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను అనుసరించడం ద్వారా, అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

Revitalise

క్రమంగా పాడైపోయిన చర్మాన్ని పునరుద్దరించుకోవడానికి మరియు చర్మఆరోగ్యానికి ముందు జాగ్రత్తలలో భాగంగా పాటించదగిన గృహ చిట్కాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. పూర్తిగా తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

1.కీరాదోసకాయ :

1.కీరాదోసకాయ :

కీరా దోసకాయలోని హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని పుష్టిపరచడంలో, మరియు పాడైపోయిన చర్మాన్ని పునరుద్దరించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. అదేవిధంగా, కీరాదోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీది ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడుతాయి. దీనికి తోడు కీరాదోసకాయను తరచుగా ఉపయోగించడం ద్వారా వృద్దాప్య చాయల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

మొదటగా సగం కీరాదోసకాయను తీసుకుని తురమండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కీరాదోసకాయను కలపండి. ప్యాక్ చేసే క్రమంలో భాగంగా అర కప్పు సాదా పెరుగును కలపండి. ఈ కీరాదోసకాయ మరియు పెరుగు ప్యాక్ ను శుభ్రపరిచిన ముఖంపై అప్లై చేసి 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి.

2. బొప్పాయి :

2. బొప్పాయి :

విటమిన్ ఎ, సి , ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉండే బొప్పాయి చర్మాన్ని పునరుద్దరణ గావించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది పిగ్మెంటేషన్ మరియు నల్లమచ్చల చికిత్సలో కూడా సహాయపడుతుంది.

ఇందుకు మీకు కావలసినవల్లా, 1 పండిన బొప్పాయి ముక్క, ముడి తేనె మరియు కొన్ని చుక్కల తాజా నిమ్మ రసం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ముడి తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి. అన్నిటిని పూర్తిస్థాయిలో మిక్స్ చేసి మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది డ్రై అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉండనివ్వాలి. సాధారణ నీటిని ఉపయోగించి దీనిని శుభ్రం చేయవచ్చు.

3. యోగర్ట్ లేదా పెరుగు :

3. యోగర్ట్ లేదా పెరుగు :

పెరుగు, మనందరికీ తెలిసిన అత్యుత్తమ చర్మ సంరక్షణకారిణి. ఇది చర్మంపై సమర్థవంతంగా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ నేచురల్ క్లెన్సర్ వలె పనిచేస్తుంది, ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది.

ఒక గిన్నెలో, 2 టేబుల్ స్పూన్ల సాదా పెరుగు, ½ టీస్పూన్ శెనగ పిండి మరియు ½ టీస్పూన్ పసుపు పొడిని కలపండి. మూడు పదార్థాలను పూర్తిస్థాయిలో బ్లెండ్ చేయండి. ఈ మందపాటి మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి, 20 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాలకోసం వారానికి కనీసం రెండుసార్లు పునరావృతం చేయండి.

4. నారింజ తొక్క :

4. నారింజ తొక్క :

మనందరికీ తెలిసిన మరొక ఉత్తమ చర్మ సంరక్షణకారిణి నారింజ తొక్క. ఇందులోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం మీది నల్ల మచ్చలను తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడతాయి, తద్వారా ఆరోగ్యవంతమైన చర్మాన్ని కొనసాగించడంలో దోహదపడుతుంది.

దీనికి మీరు చేయవలసినదల్లా, నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి, చక్కని పొడిలా తయారుచేయడానికి గ్రైండ్ చేయండి. అందులో అర టీస్పూన్ శెనగ పిండిని చేర్చి, కొద్దిగా నీళ్లు చేర్చి మృదువుగా మిశ్రమంగా చేయండి. దీనిని మీ చర్మం మరియు మెడ మీద అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత, చల్లని నీటితో శుభ్రపరచండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర చర్మ సంరక్షణ, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Must Try Home Remedies To Revitalise The Skin

Problems like fine lines, dark spots, pigmentation, blackheads, etc., can be troubling. One can use home remedies using cucumber, yoghurt, orange peel etc., to remove dullness and restore healthy skin.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more