For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే రోజులో మొటిమల సమస్యకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు

ఒకే రోజులో మొటిమల సమస్యకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు .అమ్మాయిలు నిద్రలేవగానే ఒత్తిడి మరియు ఆందోళనకి గురిచేసేవి మొటిమలు. రాత్రి పడుకున్నప్పుడు అందంగా కనబడిన ముఖం ఉదయానికి మొటిమలతో కనబడితే ఇక అంతటి నరకం

|

అమ్మాయిలు నిద్రలేవగానే ఒత్తిడి మరియు ఆందోళనకి గురిచేసేవి మొటిమలు. రాత్రి పడుకున్నప్పుడు అందంగా కనబడిన ముఖం ఉదయానికి మొటిమలతో కనబడితే ఇక అంతటి నరకం మరొకటి ఉండదేమో. మొటిమలు మన అందానికి శత్రువు. అవాంఛిత వచ్చే మొటిమలు అందాన్ని తగ్గించేస్తారు. ముఖంలో చీరాకు తెప్పిస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో మొటిమలు రావడం సహజం.

ఇలా అకస్మికంగా ముఖంలో కనబడే మొటిమలు చాలా మంది మహిళలు మరియు యవ్వనంలో ఉండే అమ్మాయిలను ఆందోళన కలిగిస్తాయి. చాలా మంది పురుషులు కూడా ఈ మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. ఇవి ముఖ అందాన్ని నాశనం చేస్తాయి. ఈ మార్కులను తొలగించి మీలో విశ్వాసం పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది.

Effective Remedies To Remove Pimples In One Day At Home,

ముఖ్యంగా అమ్మాయిలు తమ మొటిమలున్న ముఖాన్ని ఇతరులకు చూపించడానికి సిగ్గుపడతారు. ఈ ఇబ్బంది ఇప్పటికీ ప్రత్యేక సందర్భాలలో మరియు వీరిని వెంటాడుతోంది. మొటిమలను వదిలించుకోవడానికి క్రీములు, మందులు వాడటం మంచిది కాదు. ఇవి తాత్కాలికంగా మాత్రమే ఫలితం చూపుతాయి. వీటిని వాడిన తర్వాత మొటిమలు తిరిగి పునరావృతమవుతాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం సహజ మార్గాన్ని ఎంచుకోవడం. మొటిమలను వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం ....

పసుపు మరియు తులసి ఆకులు

పసుపు మరియు తులసి ఆకులు

పసుపు కొమ్ము, కొద్దిగా తులసి ఆకులు మరియు కర్పూరం తీసుకోండి. వీటికి కొద్దిగా నీళ్ళు చేర్చి మూడింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రిసమయంలో నిద్రించడానికి ముందు దీన్ని ముఖంపై అప్లై చేసి ఉదయం లేచినప్పుడు కడగాలి.

శెనగపిండి -తులసి ఆకులు

శెనగపిండి -తులసి ఆకులు

తులసి ఆకులను పేస్ట్ చేసి ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి, ఈ పేస్ట్ కు కొద్ద శెనగపిండి జోడించాలి. తులసి ఆకులను పేస్ట్ కు నీటికి బదులుగా రోజ్ వాటర్ ను జోడిస్తే ఉత్తమ ఫలితం ుంటుంది. నల్లబడిన ముఖం, మెడ మరియు చేతులకు ఈ పేస్ట్ ను అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. కానీ సబ్బును ఉపయోగించవద్దు.

పాలు మరియు తాజా నిమ్మరసం

పాలు మరియు తాజా నిమ్మరసం

కాచిన పాలలో కొద్దిగా తాజా నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమం వల్ల డ్రై స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. ఇది ముఖంలో నల్ల మచ్చలు మరియు మొటిమలను నివారిస్తుంది. గోరువెచ్చని లేదా చల్లటి పాలలో తాజా నిమ్మరసం 2-3 చుక్కలు వేసి కలపాలి. తర్వాత కాటన్ తీసుకుని పాలు నిమ్మరసం మిశ్రమంలో అద్ది మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి . అరగంట తర్వాత మీ ముఖాన్నిగోరువెచ్చని నీటితో కడగాలి.

వేప

వేప

భారతీయులు వేప చెట్లను ఎందుకు ఎక్కువగా పెంచుతారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దీనిలో ఉండే ఔషధ గుణాలు వల్ల ప్రతి ఒక్కరూ వేప చెట్లను పెంచుకోవడానికి మెగ్గుచూపుతున్నారు. మొటిమలు మరియు మొటిమలకు సంబంధించిన మచ్చలను నివారించడంలో వేపలోని ఔషధగుణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. వేప ఆకులకు కొద్దిగా నీరు చేర్చి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఉపయోగించడం వల్ల మీరు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను పొందుతారు.

బియ్యం నీరు

బియ్యం నీరు

వండిన బియ్యం నీరు (గంజి) ని ఒక పాత్రలో భద్రపరుచుకోండి. ఈ నీటితో మీ ముఖాన్ని తరచూ కడగాలి. ఈ నీటిలోని సహజ లక్షణాలు ముఖ, చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి.

టమోటా

టమోటా

టొమాటోస్‌లో యాంటీఆక్సిడెంట్ ఎక్స్‌ట్రాక్ట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. మొటిమలను వదిలించుకోవడానికి మరియు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇది ఒక గొప్ప మార్గం. మొటిమలకు టొమాటో ముక్కలు చేసి అందులోని రసాన్ని మొటిమలపై నేరుగా రాయాలి. ఇలా టమోటో రసాన్ని మొటిమలకు అప్లై చేయడం వల్ల మొటిమలు, వాటి ద్వారా వచ్చే మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గంధం

గంధం

ఆయుర్వేదం ప్రకారం, చందనం లేదా గంధం చర్మాన్ని చల్లబరచడానికి మరియు మృదువుగా చేయడానికి ఒక ప్రభావవంతమైన సాధనం మరియు ఇది చర్మ నివారణ.

సలహా:

సలహా:

చందనంను కొన్ని గంటలు నీటిలో నానబెట్టండి. తరువాత దానిని ఆరబెట్టి, పునర్వినియోగం కోసం నిల్వ చేయండి. పత్తి సహాయంతో, మొటిమల మచ్చల ప్రాంతానికి ఈ నీటిని సున్నితంగా అప్లై చేయండి. రోజూ ఒక వారం పాటు ఈ విధానాన్ని అనుసరించండి. వారం గడుస్తున్న కొద్దీ, మొటిమలు తొలగిపోయే తేడాను మీరు గమనించవచ్చు మరియు మీ చర్మం మెరుగుపడుతుంది. ప్రత్యామ్నాయంగా, రోజ్ వాటర్ లో నానబెట్టిన గందం నీళ్ళను మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు మాయం అవ్వడంతో పాటు చర్మంలో కొత్తగా కాంతి వస్తుంది. ఈ కాంభినేషన్లో మీరు మంచి ఫలితాలను పొందుతారు.

బొప్పాయి చేసే మ్యాజిక్

బొప్పాయి చేసే మ్యాజిక్

నేడు మార్కెట్లో లభించే చర్మ సంరక్షణ ఉత్పత్తులలో చాలావరకు బొప్పాయి ఉంటుంది. మొటిమలకు ఇది మంచి ఔషధం. బొప్పాయి పేస్ట్ తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. పూర్తిగా ఎండిన తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. మొటిమల నివారణకు ఇది మంచి పద్ధతి.

అరటి

అరటి

మీరు అరటి ప్రేమికులైతే, అరటి పై తొక్కను మీ చర్మ సంరక్షణకు ఉపయోగించుకోండి. మొటిమలకు ఇది మంచి ఔషధం. అరటిపండు తిని, తొక్కను ముఖం మీద రుద్దండి. ముఖంలో రుద్దిన తర్వాత సుమారు 30 నిమిషాలు అలాగే ఉండండి. అరగంట తరువాత కడగాలి.

ఆవాలు మరియు తేనె

ఆవాలు మరియు తేనె

ఆవపిండిలో సాలిసిలిక్ ఆమ్లం ఉన్నందున, ఇది అంటువ్యాధులు మరియు మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. మొటిమలకు ఆవాలు ఉత్తమ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఒక చెంచా ఆవపిండిలో మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి మరియు మీ ముఖం మీద రాయండి. దీన్ని 15 నిమిషాలు వదిలి ఆ ర నీటితో శుభ్రం చేసుకోండి.

 గుడ్డుతో మాస్క్

గుడ్డుతో మాస్క్

గుడ్డులోని తెల్లని సొనను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా గిలకొట్టాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల పొందండాలంటే దీనికి కొద్దిగా నిమ్మరసం జోడించి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

English summary

Effective Remedies To Remove Pimples In One Day At Home

These ayurvedic remedies help to get rid of those stubborn pimple marks, have a look ... Effective Ayurvedic Remedies To Remove Pimple Marks
Story first published:Saturday, September 14, 2019, 16:04 [IST]
Desktop Bottom Promotion