For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కనుబొమ్మల ఆకారానికి థ్రెడింగ్: థ్రెడింగ్ తర్వాత మంట, వాపు, దురద నివారించే ఇంటి చిట్కాలు

కనుబొమ్మల ఆకారానికి థ్రెడింగ్: థ్రెడింగ్ తర్వాత మంట, వాపు, దురద నివారించే ఇంటి చిట్కాలు

|

ముఖ అందంలో కనుబొమ్మలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కళ్లు అందంగా కనబడేలా చేస్తాయి. నయనాలు అందంగా ఉంటేనే కాదా ముఖారవిందం. కళ్లు అందంగా కనబడటానికి కాలేజీ అమ్మాయిల నుండి ఆఫీసులకు వెళ్ళే మహిళల వరకు కనుబొమ్మలను మంచి మంచి ఆకారాల్లో తీర్చి దిద్దుకుంటారు. అంతుకు థ్రెడ్డింగ్ పద్దతిని ఫాలో అవుతుంది. కనుబొమ్మలు మంచి షేప్ లో తీర్చి దిద్దుకోవడానికి థ్రెడింగ్ బాగా సహాయపడుతుంది. థ్రెడ్డింగ్ ఒకటే కాదు, కనుబొమ్మలకు సరైన ఆకారం ఇవ్వడానికి ప్లకింగ్, వాక్సింగ్, మరియు మైక్రోబ్లేడింగ్ కూడా చేయవచ్చు. థ్రెడింగ్ వల్ల కొద్దిగా నొప్పి అనిపించినా ఆర్థికంగా ఇది చాలా చౌకైన పద్దతి మరియు సులభ పద్దతి.

Home remedies to reduce inflammation after threading,

కనుబొమ్మలను మంచి ఆకారంలో తీర్చి దిద్దడానికి థ్రెడింగ్ సులభ పద్దతే అయినా, దీని వల్ల కొంతమందికి థ్రెడింగ్ తర్వాత కనుబొమ్మల వద్ద దద్దుర్లు లేదా వాపు లేదా ఎర్రగా మంటపుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, కనుబొమ్మల మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం చాలా ముఖ్యం. అందమైన కనుబొమ్మలకు థ్రెడింగ్ చేసిన తర్వాత వివిధ రకాల చర్మ సమస్యల నుండి బయటపడటానికి కొన్ని హోం రెమెడీస్ గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం.

థ్రెడింగ్ తర్వాత చర్మం చికాకు మరియు నొప్పి కారణాలేంటి?

థ్రెడింగ్ తర్వాత చర్మం చికాకు మరియు నొప్పి కారణాలేంటి?

థ్రాడ్లింగ్ సమయంలో మరియు తరువాత నొప్పికి కొన్ని కారణాలు ఉండవచ్చు, అవి:

స్కిన్ సెన్సిటివ్

సున్నితమైన చర్మం ఉన్నవారు కనుబొమ్మలు చేసిన తర్వాత నొప్పి మరియు చికాకును అనుభవించవచ్చు. థ్రెడింగ్ ను సరైన పద్దతిలో చేయకపోయినా , తప్పుగా థ్రెడ్ చేసినా, అప్పుడు మాత్రమే వారి చర్మం ఎర్రగా మారుతుంది.

పొడి చర్మం

పొడి చర్మం

పొడి చర్మం కూడా థ్రెడింగ్ సమయంలో నొప్పి మరియు బర్నింగ్ కు కారణం అవుతుంది. ఈ రకమైన చర్మంపై థ్రెడింగ్ వల్ల ఎరుపు మరియు దద్దుర్లు కలిగిస్తుంది.

జిడ్డుగల చర్మం

జిడ్డుగల చర్మం

చర్మంపై జిడ్డు చాలా సమస్య. జిడ్డుగల చర్మంపై చిన్న జుట్టును తొలగించడం అంత సులభం కానందున దానిపై జుట్టును తొలగించడం మరింత కష్టమవుతుంది.

బ్యూటీషియన్ శిక్షణ పొందకపోవడం

బ్యూటీషియన్ శిక్షణ పొందకపోవడం

బ్యూటీషియన్‌కు ఎక్కువ అనుభవం లేకపోయినా, థ్రెడింగ్ సమయంలో మీకు ఎక్కువ నొప్పి ఉండవచ్చు.

ఐబ్రో థ్రెడింగ్ తర్వాత చర్మ వాపు,మంట, దురద, దద్దుర్లు వంటి సమస్యలను నివారించుకోవడానికి ఇంటి నివారణలు

ఐబ్రో థ్రెడింగ్ తర్వాత చర్మ వాపు,మంట, దురద, దద్దుర్లు వంటి సమస్యలను నివారించుకోవడానికి ఇంటి నివారణలు

టోనర్ :

థ్రెడింగ్ తర్వాత టోనర్ లో చాలా కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మంలో చీకాకు, మంటను తగ్గిస్తుంది. పత్తిపై కొద్దిగా టోనర్ వేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి. థ్రెడింగ్ తర్వాత తెరచుకున్న చర్మ రంద్రాలను టోనర్ మూసివేస్తుంది.

కలబంద

కలబంద

కలబందలో అద్భుతమైన చర్మ శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మం ఎరుపు, మంట మరియు వాపు, మొటిమలను నయం చేస్తుంది. థ్రెడింగ్ చేసిన వెంటనే కలబందను అప్లై చేయాలి.

 దోసకాయ

దోసకాయ

దోసకాయ రెండు ముక్కలు తీసుకొని కనుబొమ్మల మీద 15-20నిముషాలు ఉంచండి. థ్రెడింగ్ సమయంలో కోతకు ఇది మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. దోసకాయలు నొప్పిని తగ్గించే మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు చర్మంలో వాపు మరియు మంటను తగ్గిస్తుంది.

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ :

థ్రెడింగ్‌లో కనుబొమ్మలపై హెయిర్ ను తొలగించబడినందున, చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. కాబట్టి మీరు ఈ రంధ్రాలను తిరిగి మూసివేయడానికి ఐస్ క్యూబ్స్ సహాయపడుతాయి. థ్రెడింగ్ తర్వాత ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో చీకాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇందులో ఉండే కూలింగ్ లక్షణాలు రాషెస్, కట్స్ ను నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పాలు

పాలు

ఒక శుభ్రమైన పత్తి తీసుకుని చల్లటి పాలలో ముంచి, ప్రభావిత ప్రదేశంలో రాయండి. పాలలో ఉండే ప్రోటీన్లు థ్రెడింగ్ వల్ల ఏర్పడే మంట, స్కిన్ రెడ్ నెస్, వాపును తగ్గిస్తాయి తరువాత చర్మాన్ని రక్షిస్తుంది.

 టీ బ్యాగ్

టీ బ్యాగ్

కోల్డ్ టీ బ్యాగులు కనుబొమ్మలను సడలించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. థ్రెడింగ్ తరువాత, ఎరుపు మరియు వాపు తగ్గించుకోవడానికి ప్రభావిత చర్మంపై టీ బ్యాగ్ అప్లై చేయండి.

అదనంగా, సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోవాలి:

అదనంగా, సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోవాలి:

  • థ్రెడింగ్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లవద్దు.
  • థ్రెడింగ్ తర్వాత ఫేషియల్స్ లేదా బ్లీచ్ చేయించుకోకండి.
  • వేడి వాతావరణంలో ఉండకండి లేదా ముఖానికి ఆవిరి పట్టడం చేయొద్దు.

English summary

Home remedies to reduce inflammation after threading

Looking for home remedies to treat your sensitive skin after threading? Here are some tips that would certainly work for you in relieving the pain and soothing the skin.
Story first published:Wednesday, September 25, 2019, 12:38 [IST]
Desktop Bottom Promotion