For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా?కారణాలు, నివారణ, ఫర్ఫెక్ట్ టిప్స్!!

|

కళ్ల క్రింద చర్మం చాలా పల్చగా, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి, కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన భాద్యత. కళ్లకు సంబంధించిన ఒక సాధారణ సమస్య కళ్లు వాపు. ఇది కళ్లు వాపు కంటి చుట్టూ ఉన్న చర్మం వాపు వల్ల కళ్ల క్రింది ఉబ్బెత్తుగా కనబడుతుంది.

ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బెత్తుగా ఉంటున్నాయా? కళ్ల క్రింద క్యారీ బ్యాగ్స్ లా ఇబ్బంది పెడుతున్నాయా? కళ్ల ఉబ్బెత్తును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టీ, దీనికి కూడా పరిష్కారం ఉంది.

కారణాలు:
 

కారణాలు:

అసలు ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బెత్తుగా ఎందుకు కనబడుతాయి? కళ్ల ఉబ్బెత్తుగా ఉండటానికి కారణం నిద్రలేమి, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి, ఎక్కువగా ఏడవవడం, డీహైడ్రేషన్. కళ్ల ఉబ్బెత్తుగా ఉండటానికి కారణం ఏదైనా కావచ్చు, ఈ సమస్యను కఠినంగా పరిష్కరించగలగాలి. లేదంటా మీ మొత్తం ముఖ అందాన్ని పాడు చేయడమే కాదు, రోజంతా మీరు డల్ మరియు అలసటగా కనబడేలా చేస్తుంది. ఈ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని మీరు తెలుసుకుని ఉండాలి. మరి మాకు తెలిసిన ఫర్ఫెక్ట్ టిప్స్ మీకోసం ..

నివారణ:

నివారణ:

రాత్రి నిద్రించడానికి ముందు తగినన్ని నీళ్లు తాగాలి:శరీరంలో నీటి శాతం తగ్గింతే కంటి క్రింద వాపు లేదా ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి, నిద్రించడానికి ముందు తగినన్ని నీళ్లు తాగాలి. కేవలం రాత్రి మాత్రమే కాదు, రోజంతా కూడా నీళ్ళు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.

ఆల్కహాల్ మరియు జంక్ ఫుడ్ నివారించాలి

ఆల్కహాల్ మరియు జంక్ ఫుడ్ నివారించాలి

నిద్రించడానికి ముందు టీ వీ చూస్తూ పాప్ కార్న్ మరియు చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల వీటిలో అధిక సోడియం (ఉప్పు)కంటెంట్ వల్ల కళ్ల క్రింద ఉబ్బెత్తుగా ఉంటుది. ఇక ఆల్కహాల్ డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది , దాంతో కళ్లు ఉబ్బుతాయి.

అలర్జీలకు కారణమయ్యే వాటిని తొలగించండి:
 

అలర్జీలకు కారణమయ్యే వాటిని తొలగించండి:

అలర్జీలకు గురిచేసే వాటికి దూరంగా ఉండండి. ఇంట్లో దుమ్మూ దూళీ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా నిద్రించే పడకలు లేదా బెడ్స్ లేదా మ్యాట్స్ క్లీన్ గా ఫ్రెష్ గా ఉండేట్లు చూసుకోండి. అలర్జీల వల్ల కళ్లకు చీకాకు తత్పలితంగా కళ్లక్రింది ఉబ్బెత్తుగా మారుతుంది.

ఒత్తిడి తగ్గించుకోండి:

ఒత్తిడి తగ్గించుకోండి:

ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్ బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్ళు ఉబ్బినట్లుగా ఉంటుంది.

ఫ్రోజోన్ స్పూన్:

ఫ్రోజోన్ స్పూన్:

స్పూన్ ను ఫ్రీజర్లో కొద్ది సమయం ఉంచి, తర్వాత బయటికి తీసి చల్లగా ఉన్న స్పూన్ను ఉబ్బిన కళ్ల మీద కొన్ని నిముషాలు సున్నితంగా మసాజ్ చేయడం లేదా ఉంచడం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త నాళాలను నిర్బంధించడం ద్వారా పఫ్నెస్ తగ్గించడానికి సహాయపడుతుంది.

చిట్కాలు:

చిట్కాలు:

ప్రకృతి పరంగా లభించే సహజసిద్ద పదార్థాలు కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి. ఇవి సురక్షితమైనవి, సాధ్యమైనంత వరకు త్వరగా కళ్లు ఉబ్బును తగ్గిస్తాయి.అవి:

కీరదోసకాయ:

కీరదోసకాయ:

చర్మంను సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కంటిచూట్టూ చర్మం వాపును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా కీరదోసకాయను సైస్ గా కట్ చేసి 3-4తీసుకుని, వాటని వాపు ఉన్న ప్రదేశంలో సున్నితంగా అప్లై చేసి మర్ధన చేయాలి. స్లైస్ వెచ్చగా మారే వరకు మసాజ్ చేయాలి. ఇలా రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాలు:

పాలు:

పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మం శుభ్రపరిస్తుంది, కళ్లను స్మూత్ గా మార్చుతుంది. దాంతో పఫీనెస్ తగ్గుతుంది. అంతే కాదు కళ్ల చుట్టూ ఉన్న సన్నని చారలు మరియు ముడుతలను నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా కొద్దిగా పాలు తీసుకుని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో ఉంచాలి. ఒకటి రెండు గంటల తర్వాత ఐస్ ట్రే బయటికి తీసి మిల్క్ ఐస్ క్యూబ్స్ ను తీసి, కాటన్ క్లాత్ లో చుట్టి, కళ్లు ఉబ్బు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తూ మర్ధన చేయాలి. ఈ రెమెడీని ప్రతి రోజూ రిపీట్ చేయాలి. మంచి ఫలితం పొందుతారు.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

గుడ్డులో ఉన్న స్కిన్ టైటనింగ్ లక్షణాలు కళ్ల క్రింద ఉబ్బును తగ్గిస్తుంది. ఇంకా ముఖంలో ముడుతలను నివారిస్తుంది. ఒక గుడ్డులో తెల్లటి సొన వేరుచేసి, స్పూన్ తో బాగా గిలకొట్టాలి. స్మూత్ గా అయిన తర్వాత కళ్లక్రింద అప్లై చేసి మసాజ్ చేయాలి. 5 నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజు విడిచి రోజు రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పొటాటో:

పొటాటో:

బంగాళదుంపలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయిజ ఇది కంటి క్రింద ఉబ్బు తగ్గిస్తుంది. అదనంగా ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి, రసం తీసి అందులో కాటన్ క్లాత్ లేదా పత్తి ని డిప్ చేసి కళ్ల మీద ఉంచాలి. 15 నిముషాల తర్వాత కాటన్ తొలగించి నీళ్ళతో కళ్లను సున్నితంగా కడగాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

రోజ్ వాటర్లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్లక్రింద చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. దాంతో ఉబ్బు క్రమంగా తగ్గుతుంది.

అందుకు కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని, ఐస్ ట్రేలో నింపాలి. రోజ్ ఐస్ క్యూబ్స్ తయారయ్యాక, వాటిని తీసుకుని కళ్లు ఉబ్బుగా ఉన్న ప్రదేశంలో 5 అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ వారం రోజులు చేస్తుంటే తప్పకుండా మార్పు మీరు గమనిస్తారు. ఇకెందుకు ఆలస్యం ఈ సింపుల్ టిప్స్ తో మీ సమస్యను పరిష్కరించుకోండి. అందంగా మెరిసిపోండి.

English summary

How to avoid puffy eyes in the morning, Causes, Prevention, Tips

Puffy eyes can be caused by lack of sleep, excessive consumption of alcohol, stress, crying, dehydration etc. No matter the cause, puffy eyes can be a tricky issue to deal with. Puffy eyes can compromise your entire look and make you seem dull and tired and you might not know how exactly to tackle this issue. Well, we're here to help you with that.
Story first published: Monday, September 23, 2019, 15:24 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more