For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ముఖం అందంగా..తెల్లగా మెరిసిపోవాలంటే కాఫీ పౌడర్-కొబ్బరినూనె ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

మీ ముఖం అందంగా..తెల్లగా మెరిసిపోవాలంటే కాఫీ పౌడర్-కొబ్బరినూనె ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

|

ప్రతి అమ్మాయి అందంగా కనబడాలని కోరుకుంటుంది. అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించడానికి ట్రై చేస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం ఎన్నో క్రీములు, ఫేస్ ప్యాక్ లు, లోషన్లు వాడినా ఏదో ఒక లోపంతో చీకాకు పడుతుంటారు. అలాంటి వారికి కొన్ని చక్కని సహజ నివారణ పద్దతులున్నాయి.

చర్మ సమస్యలు వివిధ రకాలుంటాయి. వీటిని నయం చేసుకోవడం ఒక సవాలుగా మారుతుంది. రోజూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది. చర్మ సమస్యలను నివారించుకోవడానికి, చర్మం అందంగా, తెల్లగా మార్చుకోవడానికి కాఫీ పౌడర్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ పౌడర్ కేవలం కాఫీ తాగడానికి మాత్రమే కాదు, అనేక చర్మ సమస్యలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కాఫీ పౌడర్ మరియు కొబ్బరి నూనె:

కాఫీ పౌడర్ మరియు కొబ్బరి నూనె:

ముఖం మరియు మెడ వద్ద చర్మం నలుపుగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కాఫీ పౌడర్ కొబ్బరి నూనె. ఈ రెండింటి మిశ్రమం చర్మం లోపలి భాగాలకు చొచ్చుకునిపోయి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం అందాన్ని పాడు చేయడానికి ప్రదాన కారణం డెడ్ స్కిన్ సెల్స్ సమస్యను పరిష్కరించడానికి కాఫీ పౌడర్ మంచి పరిష్కారం. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకుని రెండూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే వదిలి తర్వాత నార్మల్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు.

కాఫీ పౌడర్ మరియు పసుపు :

కాఫీ పౌడర్ మరియు పసుపు :

పసుపులో ఉన్న ప్రయోజనాలు మనందరికి తెలుసు. పర్ఫెక్ట్ యాంటీఆక్సిడెంట్ మరియు చర్మ రంగును క్లియర్ గా మార్చుడంలో చాలా సహాయపడుతుంది. కాఫీ మరియు పసుపు రెండింటిని మిక్స్ చేస్తే ఏం జరుగుతుంది? చర్మం అందంగా మార్చడంలో ఇది బెస్ట్ కాఫీ ఫేస్ ప్యాక్. వీటి రెండింటిలో న్యాచురల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది. అందుకు ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కు ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి మెడకు అప్లై చేయాలి. 20 నిముషల తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి. ఈ మిశ్రమం ముఖం మరియు మెడపై నిర్జీవ చర్మకణాలను తొలగించి చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు.

కాఫీ పౌడర్ మరియు తేనె :

కాఫీ పౌడర్ మరియు తేనె :

కాఫీ పౌడర్ చర్మంను శుభ్రపరచడంలో, చర్మంలోని మలినాలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. అదే సమంయలో చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరం. తేనె చర్మ కణాలను టైట్ టా మార్చుతుంది. చర్మం కాంతివంతం చేస్తుంది. ఇంకా చర్మం స్మూత్ గా మారుతుంది. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు వంద శాతం హెర్బల్ ఫేస్ మాస్క్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. మెత్తగా పేస్ట్ లా తయారయ్యాక శుభ్రమైన ముఖానికి ప్యాక్ వేసుకోండి. 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

కాఫీ పౌడర్ మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్ :

కాఫీ పౌడర్ మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్ :

మీది ఆయిల్ స్కిన్నా అయితే ఈ ప్యాక్ మీకోసమే. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మం కాంతిని పెంచడంలో చాలా ప్రసిద్ది చెందినది. ఇంకా చర్మం సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత కడగాలి. ఈ ప్యాక్ ను వారానికొకసారి అప్లై చేయవచ్చు.

కాఫీ పౌడర్ మరియు పాలు

కాఫీ పౌడర్ మరియు పాలు

ఒక బౌల్లో కాఫీ పౌడర్, పాలు మరియు కొబ్బరి నూనె కలపండి. ఈ మూడింటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పాలు , కాఫీ పౌడర్ మిశ్రం ముఖానికి అప్లై చేసినప్పుడు చర్మంలో ఒక మ్యాజిక్ చేస్తుంది. కాఫీ పౌడర్ పాలను కలపి ముఖానికి అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడగాలి. ఇది చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మంను ఆరోగ్యంగా ఉంచి క్రమంగా చర్మ కాంతిని పెంచుతుంది.

English summary

How to Make coffee and coconut oil face mask for glowing skin

In this article we explain how to prepare coconut oil and coffee face mask for glowing skin. Read on.
Desktop Bottom Promotion