Just In
- 8 hrs ago
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- 9 hrs ago
పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!
- 9 hrs ago
Winter Tips: ఈ 5 ప్రభావవంతమైన చిట్కాలతో ఈ శీతాకాలంలో మీ పొడి చర్మాన్ని తేమగా చేయండి..
- 11 hrs ago
Winter Tips: మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి స్నానం చేసేటప్పుడు ఆయుర్వేదంలో ఈ చిట్కాలను అనుసరించండి!
Don't Miss
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Movies
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొటిమలు, మచ్చలు, స్కిన్ ట్యాన్, స్కార్స్ అన్నింటికి ఒకటే పరిష్కారం బంగాళదుంప: ఎలా వాడాలో చూడండి
బంగాళాదుంపలు వంటలు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ పొటాటో లేనిది వంట వండరు. అంత ఫేమస్. పొటాటోను మ్యాష్ చేసి, ఉడికించి, కాల్చి, రోస్ట్ చేసి వివిధ రకాల వంటలను వండుతారు. బంగాళాదుంపలలో ఖనిజాలు, విటమిన్లు మరియు డైటరీ యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి.
అంతే కాదు బంగాళాదుంపలు ఆరోగ్యానికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా చర్మం క్లియర్ గా మెరుస్తు ఉండటానికి సహాయపడతాయి. బంగాళాదుంపలతో తయారు చేసిన బేస్ ప్యాక్‌లు చర్మ రంధ్రాలను మరియు మచ్చలను కనబడనివ్వకుండా చేయడానికి, మొటిమలను శాస్వతంగా నివారించడానికి సహాయపడతాయి.

బంగాళాదుంప-టమోటో ఫేస్ ప్యాక్ ప్యాక్
బంగాళాదుంపలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని హానికరమైన అంశాలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇది సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. బంగాళాదుంపలోని ఆమ్లత్వం చర్మంలో రంధ్రాలను తెరిచి ఉంచి ఉంచి శుభ్రపరచడానికి మరియు క్లియర్ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది.
కావల్సినవి
. చెంచా బంగాళాదుంప పేస్ట్ లేదా రసం
. ఒక చెంచా తేనె
. చెంచా టమోటా పేస్ట్ లేదా రసం
విధానం:
. ఒక గిన్నెలో బంగాళాదుంపలు మరియు టమోటా పేస్ట్ ల రసం కలపండి.
. ఈ మిశ్రమానికి తేనె జోడించి పేస్ట్ తయారు చేసుకోండి.
. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద సమానంగా రాయండి.
. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
. తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
. మొటిమలు కనిపించకుండా మాయమయ్యే వరకు మీరు రోజుకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.

ముఖంలో మచ్చలను వదిలించుకోవడానికి
బంగాళాదుంపలతో పాటు ముల్తానీ మిట్టి, చర్మం రంగు మెరుగుపరుస్తుంది మరియు చర్మం రంగు పాలిపోవడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ముల్తానీ మిట్టి మరియు బంగాళాదుంప మిశ్రమం క్రమంగా మొటిమలు, సన్ టానింగ్ ను నివారిస్తుంది మరియు ముఖంలో కణితులను తొలగించడానికి సహాయపడుతుంది. అయితే వీటిని అతిగా వాడటం మానుకోవాలి. లేకపోతే చర్మం ఎక్కువ డ్రైగా మారుతుంది.
కావలసినవి
. ఒక బంగాళాదుంప
. ఒక చెంచా ముల్తానీ మిట్టి
విధానం
. పచ్చి బంగాళాదుంపలు తీసుకొని తురిమి దాన్నుండి రసం తియ్యండి.
. ఈ సారానికి, ముల్తానీ మిట్టి ఒక చెంచా జోడించండి.
. రెండింటినీ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి.
. ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాయండి.
. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
. తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ వాడకండి.

ముఖంలో మచ్చలను తొలగించడానికి
స్ట్రాబెర్రీ పండ్లలో ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పూర్తిగా శుభ్రపరిచి, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ప్రత్యేకతంగా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను బంగాళాదుంపలతో కలిపి ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న సున్నితమైన సన్నని గీతలు తగ్గుతాయి, మచ్చలు తొలగిపోతాయి మరియు మొటిమలతో ఏర్పడ్డ మచ్చలను తగ్గిస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
కావలసినవి
. తరిగిన బంగాళాదుంప
. సగం చెంచా తేనె
. 2 స్ట్రాబెర్రీలు
విధానం
. తరిగిన బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు మరియు తేనె కలపండి.
. ఈ పేస్ట్‌ను ముఖం మరియు మెడపై రాయండి.
. మీ ముఖం 20 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి.
. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
. వారానికి రెండు లేదా మూడు సార్లు వాడటం మంచి పరిష్కారం.

చర్మంలో ట్యానింగ్ తగ్గించడానికి, మొటిమలు మరియు మచ్చలను నివారించడానికి
పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా అందంకు సంబంధించిన చిట్కాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రత్యేకమైన పసుపుతో బంగాళాదుంపలను ఉపయోగించడం వల్ల సూర్యరశ్మి వలన చర్మానికి నష్టం తగ్గుతుంది, చర్మ రంధ్రాలు తెరవబడతాయి, బ్యాక్టీరియా మరియు సూక్ష్మక్రిములు తొలగింపబడుతాయి. మొటిమలు మరియు మచ్చలు మాయమై చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
కావలసినవి
. సగం బంగాళాదుంప సన్నగా తురిమినది
. సగం చెంచా కాస్మోటిక్ పసుపు
విధానం
. బంగాళాదుంప తురుములో ఒక చిటికెడు కాస్మోటిక్ పసుపు జోడించాలి
. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడపై రాయండి.
. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద 15 నిమిషాలు ఉంచండి.
. తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
. ఉత్తమ పరిష్కారాల కోసం ఈ మిశ్రమాన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు వాడండి.

మొటిమలు, నల్ల మచ్చలు మరియు మొటిమలతో వచ్చే మచ్చలను తగ్గించడానికి
దోసకాయ సన్ టాన్ నివారించడంలో, చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు చర్మం సున్నితంగా చేయడానికి ఒక అద్భుతమైన నివారణ. దోసకాయతో పాటు బంగాళాదుంప మరియు నిమ్మరసం చర్మంలోని రంధ్రాలను తెరిచి, అదనపు నూనెను తీసివేసి చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడతాయి.చర్మంలో కణితులు, మచ్చలు మరియు మొటిమలను తగ్గిస్తుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల పసుపు చర్మం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
కావలసినవి
. 2 స్పూన్ బంగాళాదుంప రసం
. 1 స్పూన్ నిమ్మరసం
. 2 స్పూన్ దోసకాయ రసం
. ఒక చిటికెడు పసుపు
విధానం
. పైన సూచించిన అన్ని పదార్థాలను పసుపుతో కలిపి పేస్ట్‌గా చేసుకోండి.
. ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాయండి.
. ఈ పేస్ట్ మీ ముఖం మీద పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండండి.
. మీ ముఖంపై ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
. మంచి పరిష్కారం పొందడానికి వారానికి రెండుసార్లు దీన్ని అనుసరించండి.
. నీటితో కలిపిన నిమ్మరసం వాడటం మర్చిపోవద్దు. నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి పూయడం వల్ల చర్మానికి చికాకు కలుగుతుంది.

చర్మ పునరుజ్జీవనం మరియు మొటిమల నివారణ కోసం
బంగాళాదుంపలలోని యాంటీఆక్సిడెంట్ మరియు బీటా కెరోటిన్ కారణంగా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంగాళాదుంప పేస్ట్ లో బాదం నూనె మరియు తేనె జోడించడం వల్ల చర్మంలో చైతన్యం నింపుతుంది. చర్మం దద్దుర్లు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది, ధూళిని తొలగిస్తుంది మరియు చర్మంపై కనిపించే సన్నని గీతలు కనబడనివ్వకుండా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల మచ్చలు లేని చర్మం మొటిమలు, స్కార్స్ మరియు స్కిన్ పాచెస్ లేకుండా చేస్తుంది.
కావలసినవి
. ఒక చిన్న బంగాళాదుంప
. ఒక చెంచా బాదం నూనె
. ఒక చెంచా తేనె
విధానం
. తురిమిన బంగాళాదుంపలో కొద్దిగా బాదం నూనె మరియు తేనె కలపండి.
. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాయండి.
. అరగంట తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి.
. మచ్చలేని చర్మం పొందడానికి, మీరు వారానికి రెండుసార్లు ఈ రెసిపీని అనుసరించవచ్చు.