For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వోట్మీల్ మరియు పెరుగు: ముఖంలో మెటిమలు, ముడుతలు, నలుపు తగ్గిస్తాయి మరియు ముఖం కాంతివంతంగా మారుతుంది

వోట్మీల్ మరియు పెరుగు: ముఖంలో మెటిమలు, ముడుతలు, నలుపు తగ్గిస్తాయి మరియు ముఖం కాంతివంతంగా మారుతుంది

|

అందం సంరక్షణ ఎల్లప్పుడూ సవాలుగా ఉండే పరిస్థితి అని మనందరికీ తెలిసిందే. తరచుగా పార్టీకి వెళ్లడం లేదా పెళ్లికి వెళ్లడం అంటే అందుకు తగ్గట్లు అలకంరించుకోవడ అంటే ఒక సవాలే మరి.అయితే అందుకు అందమైన చర్మం ఉంటే అందం మరింత ఇనుమడిస్తుంది. మీ చర్మం పొడిబారడం, జిడ్డు చర్మం మరియు మొటిమలు వంటి చర్మ సమస్యలుంటే కనుక అలంకరణ సవాలుగా మారుతుంది. కాబట్టి, దీనిని పరిష్కరించడానికి మీరు ఏమి చేయబోతున్నాం?

పెరుగులో అన్ని బ్యూటీ సొల్యూషన్స్ ఉన్నాయి. పెరుగులో ఓట్స్ కలిపినప్పుడు దాని నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందం సంరక్షణలో ఏదైనా పెద్ద సమస్యను త్వరగా పరిష్కరించడానికి పెరుగు మరియు కొద్దిగా వోట్మీల్ గొప్పగా ఉపయోగపడుతాయి. మీ ముఖానికి ఈ రెండింటి మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల చర్మపు చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి మరియు ఇది అందానికి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం.

oats and curd facepack for skin care,

తయారు చేయు విధానం
ఒక టీస్పూన్ ఓట్ మీల్ తీసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు వేసి పేస్ట్ రూపంలో కలపాలి. మీరు దీనికి కొంచెం తేనెను కూడా కలపవచ్చు. తర్వాత ముఖానికి మెడకు అప్లై చేసి అరగంట సేపు పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. సరిగ్గా ఒక నెలలోపు మీ ముఖం అందంగా మారడాన్ని గుర్తించి మీరు ఆశ్చర్యపోవచ్చు.

ప్రకాశంతమైన ముఖానికి

ప్రకాశంతమైన ముఖానికి

ప్రతి ఒక్కరికీ రంగు డిఫాల్ట్. ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని కాంతివంతం చేయడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఇది ముఖం యొక్క చర్మ రంగును పెంచుతుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని మరియు బలాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ కాంతి లేకపోవడం, వివిధ రకాల చర్మ సమస్యలను నివారణకు ఈ ఫేస్‌ప్యాక్ చికిత్సగా పనిచేస్తుంది మరియు చర్మంలో పూర్తి కాంతిని నింపుతుంది మరియు ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

సన్ ట్యాన్ నివారిస్తుంది

సన్ ట్యాన్ నివారిస్తుంది

సన్ ట్యాన్ నుండి చర్మంను కాపాడటానికి ఈ ఫ్యాక్ గొప్పగా పనిచేస్తుంది. ముఖంలో ట్యాన్ వల్ల ఏర్పడ్డ నలుపు రంగును తొలగించి చర్మం కాంతివంతంగా మెరుస్తూ న్యాచురల్ రంగుతో కనబడేలా చేయడానికి ఈ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. సన్ ట్యాన్ వల్ల నల్లగా మారిన చర్మం నుండి ఉపశమనం పొందటానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి అనడంలో సందేహం లేదు. అందువల్ల, పెరుగు వోట్మీల్ ఫేస్ప్యాక్ మీ చర్మంపై మంచి సన్స్క్రీన్ యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ప్యాక్ వేసుకోవడం వల్ల సన్ ట్యాన్ తో పాటు చర్మానీకి చీకాకు కలిగించే మరే ఇతర చర్మ సమస్యలైనా తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ మళ్లీ రావు

బ్లాక్ హెడ్స్ మళ్లీ రావు

చర్మంలో బ్లాక్ హెడ్స్ వంటివి చిరాకు పెట్టడం మాత్రమే కాదు, మనలోని విశ్వాసాన్ని తగ్గించడానికి కారణం అవుతుంది. ఇది తరచుగా ధూళి మరియు జిడ్డు గల చర్మానికి దారితీస్తుంది.ఈ కారణం చేత ఇది చర్మంలో బ్లాక్‌హెడ్స్‌ను కూడా పెంచుతుంది. కానీ ఈ ఫేస్‌ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల బ్లాక్‌హెడ్స్ అనే శత్రువును మీ చర్మం నుండి తొలగించవచ్చు. చర్మంలో ఇతర చికాకులను నివారించడానికి కూడా ఈ ప్యాక్ గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మనం ఈ ప్యాక్ ను చర్మ సంరక్షణలో భాగంగా వాడవచ్చు.

ముఖాన్ని శుభ్రపరుస్తుంది

ముఖాన్ని శుభ్రపరుస్తుంది

ముఖంలో ధూళి దాగి ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ పెరుగు ధూళిని తొలగించడంలో చాలా సహాయపడుతుంది. మీ ముఖాన్ని శుభ్రపరచడం వల్ల చర్మపు చికాకులను తొలగించవచ్చు. పెరుగు మరియు వోట్స్ గొప్పగా ప్రక్షాళన చేసే పదార్థాలు. అందం విషయంలో ఎటువంటి సందేహం లేకుండా వీటిని ఉపయోగించవచ్చు.

వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి

వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి

మన చర్మం తరచుగా అకాల వృద్ధాప్యం లక్షణాల చూపెడుతాయి. చిన్న వయస్సులో మన చర్మానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మంలో వృద్ధాప్య లక్షణాలు తిష్టవేస్తాయి. కాబట్టి ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అకాల వృద్ధాప్యం కారణంగా మీ చర్మంలో వివిధ రకాల సమస్యలు ఉన్నప్పుడు మీరు కొద్దిగా పెరుగు మరియు వోట్మీల్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించవచ్చు. అకాల వృద్ధాప్యాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

మెడపై ముడతలు

మెడపై ముడతలు

మెడ మరియు ముఖం మీద ముడతలు చిన్న విషయం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి మీరు ఇప్పుడు వోట్మీల్ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు మసాజ్ చేయడం వల్ల ముఖంపై ముడతలు మరియు మెడపై ముడుతలతో పాటు నలుపు తొలగించడానికి మరియు అకాల వృద్ధాప్యం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి మనం వీటిని సందేహం లేకుండా ఉపయోగించవచ్చు. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

English summary

oats and curd facepack for skin care

We have listed some of the beauty benefits of oats and curd facapack, check it out.
Story first published:Monday, October 21, 2019, 15:51 [IST]
Desktop Bottom Promotion