For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Men Skin Care: ఆయిలీ స్కిన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి అయితే..

మగాళ్లు.. మీరు జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో అందంగా కనిపించవచ్చు.

|

Men Skin Care: చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. చర్మం పొడిబారిపోవడం, గరుకుగా మారడం, అందవిహీనంగా మారడం లాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయి. చర్మం జిడ్డుగా, ఆయిలీగా మారి కాంతి కోల్పోతుంది.

Oily skin care routine for men this winter in Telugu

ఆడవారిలో అయినా, మగవారిలో అయినా ఈ చర్మ సమస్యలు కామన్‌గా కనిపిస్తాయి. జిడ్డు చర్మం వల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్, మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. చలికాలంలో ఆయిలీ స్కిన్ వాళ్లు మరింత ఎక్కువగానే ఇబ్బంది పడుతుంటారు.

మగాళ్లు.. మీరు జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో అందంగా కనిపించవచ్చు.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

చాలా మంది పురుషులు ఎలాంటి చర్మ సంబంధిత ఉత్పత్తులు వాడరు. ఆ వాడకుండా ఉండటాన్ని ఏదో గొప్పగా భావిస్తారు. మంచి కాంతివంతంగా ఉన్న ముఖం వారిని, జిడ్డు ముఖం, ముఖంపై మొటిమలు ఉన్న వారిని చూస్తే ఒకేరకమైన భావన కలుగుతుందా. లేదు కదా. చక్కగా కనిపించే వారి పట్ల మనకు తెలియకుండా ఆకర్షణ కలుగుతుంది. కాబట్టి చర్మ సంరక్షణ ఆడవారికైనా, మగవారికైనా ముఖ్యమే.

ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా జిడ్డు లేకుండా తయారవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న పురుషులు నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.

ఎక్స్‌ఫోలియేటింగ్

ఎక్స్‌ఫోలియేటింగ్

బయటకు వెళ్లే చర్మంపై చెమట వస్తుంది. దానిపై దుమ్ము, ధూళి పడితే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇందుకోసం చలికాలంలో తప్పనిసరిగా వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. చాలా మంది పురుషులు చలికాలంలో ఎక్స్‌ఫోలియేటింగ్ చేయడం అనవసరం అనుకుంటారు. చలికాలం వంటి వాతావరణం చర్మాన్ని మరింత జిడ్డుగా మారుస్తుంది. బ్లాక్ హెడ్స్, ధూళి, డల్‌నెస్‌ను వదిలించుకోవడానికి ఎక్స్‌ఫోలియేషన్ చాలా ముఖ్యం. కాబట్టి క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేటింగ్ చేసుకోవాలి.

సరైన ఉత్పత్తులను ఎంచుకోవాలి

సరైన ఉత్పత్తులను ఎంచుకోవాలి

వాతావరణం మార్పులు వస్తే చర్మ ఉత్పత్తులను కూడా మార్చాల్సి ఉంటుంది. చలికాలంలో జిడ్డుగల చర్మాన్ని పరిష్కరించుకోవడానికి చర్మ సంరక్షణ ఉత్పత్తులను కూడా మార్చుకోవాలి. చలికాలంలో మొటిమలు వచ్చే అవకాశం ఉన్నట్లైతే, దానిని సులభంగా ఎదుర్కోగల ఉత్పత్తులు మీకు అవసరం. అదే విధంగా, నూనెను నియంత్రించడానికి మాయిశ్చరైజర్, నల్లమచ్చల కోసం స్క్రబ్ మొదలైనవాటిని ఎంచుకోవచ్చు.

వేడి నీరు

వేడి నీరు

చలికాలంలో వేడి వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది వేడి నీటితో తలస్నానం చేస్తుంటారు. ఇది వేడి నీటిని డైరెక్ట్‌గా చర్మంపై పోసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వేడి నీరు చర్మం తేమను తొలగిస్తుంది. తేమ పోవడం వల్ల నూనె ఉత్పత్తి పెరుగుతుంది.

English summary

Oily skin care routine for men this winter in Telugu

read on to know Oily skin care routine for men this winter in Telugu
Story first published:Monday, December 12, 2022, 15:37 [IST]
Desktop Bottom Promotion