For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెంటిల్మెన్! మీకు మొటిమలు ఎక్కువగా ఉన్నాయా? అందుకే ఇది ...

|

వివిధ చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ స్కిన్ మెరుగ్గా కనిపించడానికి మీరు ప్రయత్నించని ఉత్పత్తులంటూ లేవా? ప్రతిదీ ట్రై చేసి విసిగిపోయారా? మీరు అందంగా కనిపించాలనుకుంటే, అందాన్ని నాశనం చేసే చర్మ సమస్యలకు అసలైన కారణాలను మీరు ముందుగా తెలుసుకోవాలి. కేవలం అందంగా అలంకరించుకోవడం వల్ల ఒక వ్యక్తిని అందంగా చేయదు. నటులు మరియు నటీమణులు అందంగా కనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం వారు తీసుకునే ఆహారం.

అవును, చర్మ సమస్యలకు సాధారణ కారణాలలో ఒకటి అనారోగ్యకరమైన ఆహారం. ఇలాంటి ఆహారం వల్ల కావిటీస్, మొటిమలు, పొడి చర్మం, లేత చర్మం మరియు ముదురు పెదవులు వస్తాయి. ఆహారం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Skin Problems Caused By Vitamin Deficiency And Unhealthy Diet

అందువల్ల, మీరు ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మాన్ని కోరుకుంటే, శరీరానికి ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేయడం మరియు పాత చర్మకణాలకు బదులుగా కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేయడం చాలా ముఖ్యం. దీనికి వేర్వేరు విటమిన్లు అవసరం. మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారంతో ఆ విటమిన్లను పొందవచ్చు. ఇప్పుడు మనం చర్మ సమస్యలను ఎలా నివారించాలో పరిశీలిద్దాం.

మొటిమలు

మొటిమలు

చాలా మంది బాధపడే చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులు 16-22 సంవత్సరాల పిల్లలలో మొటిమలు ఎక్కువగా కనబడటానికి కారణమని నమ్ముతారు. అయితే, అదనపు ఆయిల్ గ్రంథులు మరియు స్పైసి ఫుడ్స్ కూడా మొటిమలకు కారణమవుతాయి. మొటిమలను తగ్గించడానికి అల్లం, పసుపు మరియు ఆలివ్ నూనెను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి.

కళ్ళ క్రింద నల్లటి వలయాలు మరియు వృద్ధాప్య చాయలు

కళ్ళ క్రింద నల్లటి వలయాలు మరియు వృద్ధాప్య చాయలు

మీరు ఎక్కువ చక్కెర మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు తింటే ఏమి జరుగుతుందో తెలుసా? దీనివల్ల కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, ముఖం మీద ముడతలు వస్తాయి. బ్రెడ్, చక్కెర, బియ్యం మరియు గోధుమ పిండి చర్మం యొక్క దీర్ఘాయువును వేగంగా నాశనం చేసే ఆహారాలు.

దీనిలోని చక్కెర చర్మం యొక్క కొల్లాజెన్‌ను నాశనం చేస్తుంది మరియు ముడుతలకు కారణమవుతుంది. కాబట్టి మీరు నల్లని వలయాలకు మరియు ముడుతలకు దూరంగా ఉండాలని అనుకుంటే, చక్కెరను తినకుండా నివారించండి మరియు కార్బోహైడ్రేట్ ఆహారాలను పెద్ద పరిమాణంలో తినకండి.

తెల్లని మచ్చలు మరియు సోరియాసిస్

తెల్లని మచ్చలు మరియు సోరియాసిస్

ముఖం మీద తెల్లటి పాచెస్ మరియు సోరియాసిస్ కాలేయ సమస్యలకు కారణం. కాలేయం శరీరం నుండి ధూళి మరియు విషాన్ని విడుదల చేస్తుంది. కానీ అందులో తగినంత నీరు ఉండాలి. అలా అయితే, కాలేయం సరిగా పనిచేస్తుంది మరియు రక్తంలో వ్యర్థాలను తొలగించగలదు.

శరీరంలో తగినంత హైడ్రేషన్ లేకపోతే, కాలేయం యొక్క ప్రక్షాళన చర్య బలహీనపడుతుంది మరియు ఇది ముఖం మీద తెల్లని మచ్చలను కలిగిస్తుంది. కాబట్టి చర్మం ఆరోగ్యంగా, అందంగా, శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటే, రోజూ 3 లీటర్ల నీరు త్రాగాలి.

నల్లని పెదవులు

నల్లని పెదవులు

సాధారణంగా ధూమపానం చేసేవారికి పెదవులు ముదురు రంగు(నల్లగా)లో ఉంటాయి. సిగరెట్లు క్యాన్సర్‌కు కారణమే కాక శరీరంలోని అన్ని అవయవాలను కూడా దెబ్బతీస్తాయి. మీరు రోజూ పొగత్రాగితే, అది నెమ్మదిగా అవయవాలను దెబ్బతీస్తుంది మరియు చివరికి అవయవాల పనితీరును ఆపివేస్తుంది.

సిగరెట్ వ్యసనం పెదాలు మాత్రమే కాదు చిగుళ్ళు కూడా..నాశనం చేస్తాయి. అలాగే, పెదవులపై తగినంత హైడ్రేషన్ లేకపోవడం వల్ల పెదవులు ముదురు రంగు(నలుపు)లోకి వస్తాయి. దీన్ని నివారించడానికి రోజూ ముఖం మరియు చేతులకు మాయిశ్చరైజర్ రాయండి. పెదవులపై పెదవి ఔషధతైలం(లిప్ బామ్) రాయండి. సిగరెట్ అలవాటు మానేయండి.

చిట్కాలు # 1

చిట్కాలు # 1

ఎవరైనా సరే రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. దీనివల్ల చర్మం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి.

చిట్కాలు # 2

చిట్కాలు # 2

మీ చర్మాన్ని మృదువుగా మరియు అందంగా ఉంచడానికి, టమోటాలు, నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, గూస్బెర్రీ మరియు నారింజ వంటి సిట్రస్ పండ్లు మరియు కూరగాయలను తినండి. అన్ని రకాల సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంపై దాడి చేసే ప్రీ-రాడికల్స్‌తో పోరాడే సామర్థ్యాన్ని శరీరానికి ఇస్తుంది.

చిట్కాలు # 3

చిట్కాలు # 3

వేయించిన మరియు కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించండి ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు చర్మాన్ని దెబ్బతీస్తుంది.

చిట్కాలు # 4

చిట్కాలు # 4

ఆకుకూరలు- కూరగాయలను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. వంకాయ, గుమ్మడికాయ, బచ్చలికూర, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి అనేక రంగు కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

English summary

Skin Problems Caused By Vitamin Deficiency And Unhealthy Diet

Common problems of the face and skin such as dark circles, pimples and wrinkles may be due to your unhealthy diet. Learn how a bad diet affects your skin.
Story first published: Tuesday, October 29, 2019, 17:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more