For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bride Skin Care: పెళ్లి సెట్ అయిందా? తక్కువ టైంలో ఇలా అందంగా మారండి

పెళ్లి ఫోటోల్లో అందంగా కనిపించాలని చర్మ సంరక్షణ మొదలు పెడతారు. పెళ్లిలో అందంగా కనిపించాలంటే ఈ సప్లిమెంట్లను తీసుకుంటే సరి.

|

Bride Skin Care: ఇది పెళ్లిళ్ల సీజన్. ముహూర్తాలు సెట్ అయి పెళ్లి కోసం ఎదురుచూస్తుంటారు కొందరు. కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త కోరికలు చాలా వాటి గురించి ఆలోచనలు ఉంటాయి. అంతకంటే ముఖ్యంగా పెళ్లిలో అందంగా కనిపించాలని వధువుకు, వరుడికి ఉంటుంది.

Try these to look gorgeous in your wedding in Telugu

(image: instagram/dishaparmar)

వధువుకు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. మంచి చీర, చీరకు మ్యాచింగ్ అయ్యే నగలు, చేతులకు మెహందీ, కాళ్లకు పారాణి ఇలా చాలా వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటారు అమ్మాయిలు. పెళ్లి సెట్ అయినప్పటి నుండి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఎలా రెడీ కావాలని చాలా ఆలోచిస్తుంటారు.

పెళ్లి ఫోటోల్లో అందంగా కనిపించాలని చర్మ సంరక్షణ మొదలు పెడతారు. రకరకాల క్రీములు వాడతారు. లోషన్లు, సన్‌స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు ఇలా ఏవేవో వాడతారు. అయితే ఈ హడావిడిలో వారి చర్మానికి సరిపోని ఉత్పత్తులు వాడటం వల్ల అవి పడకపోవచ్చు. దాని వల్ల ర్యాషెస్ రావొచ్చు.

పెళ్లిలో అందంగా కనిపించాలంటే ఈ సప్లిమెంట్లను తీసుకుంటే సరి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు చర్మానికి నిగారింపును తీసుకువస్తాయి.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ:

విటమిన్ ఇ.. అందం యొక్క విటమిన్. ఈ విటమిన్ ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకు చాలా ముఖ్యం. ఇది చర్మం మరియు హెయిర్ ఫోలికల్స్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.

ఒమేగా 3, 6, 9

ఒమేగా 3, 6, 9

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వధువులు కోరుకునేది చర్మ సరంక్షణ కాబట్టి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా పని చేస్తాయి. వైద్యుల సలహా మేరకు ఈ సప్లిమెంట్లు తీసుకోవాలి. లేకపోతే ఒమేగా అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. చేపలు, అవిసె గింజలు, ఆలివ్‌లు, వాల్‌నట్‌లు, గుడ్లు, రెడ్ మీట్, సీఫుడ్స్, గుమ్మడికాయ, అవొకాడోల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

మల్టీవిటమిన్లు

మల్టీవిటమిన్లు

జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి మల్టీవిటమిన్లు చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అవాంఛిత మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

విటమిన్ బి

విటమిన్ బి

విటమిన్ బి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల మొటిమలు, నల్లబడటం మొదలైన సమస్యలు దరిచేరవు. సాల్మన్, సార్డినెస్, కాలేయం లేదా ఇతర అవయవాలు, గుడ్లు, పాలు, షెల్ఫిష్, తృణధాన్యాలు, చికెన్, టర్కీ, పెరుగులో విటమిన్ బి ఉంటుంది.

బయోటిన్

బయోటిన్

బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జుట్టు పెరుగుదలను అభివృద్ధి చేయడమే కాకుండా జుట్టు యొక్క మెరుపును కూడా పెంచుతుంది. జుట్టు చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ సప్లిమెంట్లను వారం రోజుల ముందు తీసుకుంటే ఫలితం కనిపించదు. కనీసం ఒక నెల ముందు నుండి వీటిని తీసుకోవడం ప్రారంభించాలి. అలాగే పోషకాహారం తినాలి. దీని వల్ల పెళ్లి నాటికి అందమైన చర్మం, మంచి ఒత్తైన జుట్టు సొంతం అవుతుంది. అబ్బాయిలు కూడా ఈ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

ఇవి కూడా..

ఇవి కూడా..

(image: instagram/dishaparmar)

ఈ సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు రోజూ స్కిన్ కేర్ రొటీన్ పాటించాల్సి ఉంటుంది. అంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ కోసం ఎక్కువగా నీరు తాగాలి. ఇది చలికాలం ప్రతి ఒక్కరికీ చర్మం పొడిబారుతుంది. ముఖం పొడిబారి కాంతి కోల్పోకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే మాయిశ్చరైజర్లు తప్పనిసరిగా వాడాలి. మాయిశ్చరైజర్లు చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తాయి.

ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దు. అందంగా కనిపించాలంటే ఎంత బాగా నిద్రపోతే అంత అందంగా కనిపిస్తారు. కంటి నిండ నిద్రపోయేలా చూసుకోవడం మంచిది.

Read more about: beauty బ్యూటీ
English summary

Try these to look gorgeous in your wedding in Telugu

read on to know Try these to look gorgeous in your wedding in Telugu
Story first published:Wednesday, December 14, 2022, 11:30 [IST]
Desktop Bottom Promotion