For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Glowing Skin: ఆలూతో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోతుంది

ఏ శుభకార్యానికి వెళ్లేటప్పుడు మంచి కాంతివంతమైన చర్మం మీ సొంతం కావాలంటే వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా త్వరగా అందంగా కనిపించవచ్చు. అందుకోసం కావాల్సినవి ఆలూ, పెసలు మాత్రమే.

|

Glowing Skin: అందం.. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన అంశం. అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్ పాటించాల్సిందే. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, తేమగా ఉంచుకోవడం, మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్ లోషన్‌లు రాస్తూ ఉంటేనే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Use potato for glowing skin in Telugu

చర్మ సంరక్షణకు అమ్మాయిలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. చలికాలం వచ్చిందంటే వీరు పడే కష్టం రెట్టింపు అవుతుంది. సాధారణంగానే చలికాలంలో చర్మం కాంతి కోల్పోతుంది. పొడిబారుతుంది. కాంతి కోల్పోయిన ముఖంపై మేకప్ వేసినా అందంగా కనిపించదు.

అయితే వంటింట్లోని కొన్ని పదార్థాలతో మంచి, అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఏ శుభకార్యానికి వెళ్లేటప్పుడు మంచి కాంతివంతమైన చర్మం మీ సొంతం కావాలంటే వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చాలా త్వరగా అందంగా కనిపించవచ్చు. అందుకోసం కావాల్సినవి ఆలూ, పెసలు మాత్రమే.

Use potato for glowing skin in Telugu

ఆలూ, పెసలతో ఫేస్ ప్యాక్ తయారీ:

1. మొదట రెండు టేబుల్ స్పూన్ల పెసలు తీసుకుని మిక్సీలో మెత్తని పౌడర్ లా తయారు చేసుకోవాలి.

2. బంగాళదుంప తీసుకుని దాని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3. ఆలూ ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Use potato for glowing skin in Telugu

4. మెత్తని ఆలూ మిశ్రమాన్ని వడకట్టి నీటిని వేరు చేసుకోవాలి.

5. చిన్న గిన్నె తీసుకుని అందులో పెసల పొడి, ఆలూ వాటర్, కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

6. అందులో సగం టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.

7. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.

Use potato for glowing skin in Telugu

8. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

9. ముఖం కడుక్కునే సమయంలో వేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకుంటూ ఉండాలి.

10. ఆలూ ఫేస్ ప్యాక్ తో చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. అలాగే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి పూర్తిగా తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది.

ఏదైనా శుభకార్యానికి వెళ్లే ముందు సులభంగా ఆలూ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

English summary

Use potato for glowing skin in Telugu

read on to know Use potato for glowing skin in Telugu
Story first published:Tuesday, December 13, 2022, 14:00 [IST]
Desktop Bottom Promotion