Just In
- 19 min ago
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దు
- 1 hr ago
యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఎసిడిటి సమస్యను నివారించడానికి ఈ ఆహారం చాలా ఉత్తమం
- 6 hrs ago
Today Rasi Palan 18 January 2023:ఓ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే,భాగస్వామితో విభేదాలు తీవ్రంగా ఉంటాయి
- 14 hrs ago
ఈ సమస్యలే...భార్య భర్తల మధ్య విడాకులకు అసలు కారణం
Bubble Bath: బబుల్ బాత్ అంటే ఏంటి? దీని వల్ల ప్రయోజనాలు ఏంటంటే..
Bubble Bath: కొందరికి చెరువుల్లో, నదుల్లో స్నానం చేయడం అంటే ఇష్టం. మరికొందరికి షవర్ బాత్ చేయడం, ఇంకొంత మందికి టబ్ బాత్ అంటే మక్కువ ఉంటుంది. టబ్ బాత్ లోనూ ఫోమ్ తో నిండిన టబ్ లో సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయడమంటే మరింత ఇష్టం ఉంటుంది. దీన్నే బబుల్ బాత్ అంటారు.
ధనికులు ఇంట్లోనే ఇలాంటి సౌకర్యం కల్పించుకుంటే.. కొంత మంది మాత్రం స్పా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇక లగ్జరీ హోటళ్లు, హాలీడే స్పాలు, రిసార్ట్ లలో జనాల్ని ఆకర్షించేందుకు ఇలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీని వల్ల ఒత్తిడి దూరం అవుతుందంటూ చెబుతున్నారు. అయితే రోజంతా ఆఫీసులో కష్టపడి పని చేయడం, తీవ్ర ఒత్తిడికి గురవ్వడం చాలా మామూలు విషయం. అయితే దాన్నుంచి బయటకు రావడానికి ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తుంటారు. రాగానే స్నానం చేయడం, ఆ తర్వాత వేడి వేడి కాఫీ తాగడం వంటివి చేస్తుంటారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే సమస్యలే!
ఒకవేళ బాత్ టబ్ లేకపోయినా మామూలుగా స్నానం చేసే నీటిలో ఈ ఆయిల్స్ కలుపుకోవడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అయితే స్నానానికి వాడే ఆయిల్స్ ను ఎంపిక చేసుకునే ముందు వాటి నాణ్యతను కూడా చూసి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవేవీ వద్దనుకుంటే కాస్త గోరు వెచ్చని నీటితో స్నానం చేసినా చాలా ఫలింత ఉంటుంది. తక్కున నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను మాత్రం అస్సలే వాడకూడదు. బబుల్ బాత్ చేసిన తర్వాత జననేంద్రియాల వద్ద ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిన లక్షణాలు కనిపించినా చర్మంపై ఏవైనా తేడాలు గమనించినా వెంటనే వైద్యుల్ని తప్పక సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకొని బబుల్ బాత్ చేస్తే మీ అంతు సఖపడే వాళ్లు లోకంలో ఎవ్వరూ లేరనే పీల్ వస్తుంది. ఓసారి చేసి చూడండి