For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాజూకు అమ్మాయిలకు హాట్ లుక్ తీసుకొచ్చే శారీ స్టైల్స్ ఏంటి ?

By Nutheti
|

భారతీయ సంప్రదాయ దుస్తుల్లో చీర చాలా ఫేమస్. చీరకట్టడం వల్ల భారతీయ సంప్రదాయతే కాదు.. వాళ్ల అందం కూడా రెట్టింపవుతుంది. అమ్మాయిలను మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపించే మజా చీరకట్టులోనే ఉంది. అయితే సరైన పద్ధతిలో చీరకడితేనే.. అందరి దృష్టిని ఆకర్షించవచ్చు.

READ MORE: మహిళ మీద మగవారికి ఆకర్షణ కలిగించే రెడ్ శారీలు..!

చీరలోని అందం తెలుసుకో.. అన్నాడో కవి. నిజమే కదా.. చీరకట్టులో అమ్మాయి అందం వర్ణణాతీతం. ఏ పార్ట్ కి ఆ పార్ట్ ఎట్రాక్టివ్ గా కనిపిస్తూ.. అతివల అందాన్ని వర్ణించే గొప్పే ట్రెడిషన్ వేర్ శారీ. ఆడపిల్లను ఆకర్షణీయంగా మార్చేసే మ్యాజిక్ చీరలోనే ఉందంటే అతిశయోక్తి లేదు.

READ MORE: బ్యాక్ లెస్ బ్లౌజ్ తో మతిపోగుడుతున్న సెలబ్రెటీలు

సంప్రదాయత మేళవించిన చీర అతివలను ఇట్టే ఆకర్షిస్తుంది. కొంతమంది మోడ్రన్ కల్చర్ పై మోజు పెంచుకున్నా.. ట్రెడిషనల్ వేర్ పై ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కనీసం పార్టీలు, ఫంక్షన్లు, పండగల సమయంలోనైనా.. చీరకట్టి మురిసిపోతుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలకు చీర కట్టడం ఇష్టమే అయినా.. ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో తెలిస్తే అందరి చూపుని ఆకర్షించవచ్చు. అయితే సన్నగా ఉన్నవాళ్లు చీరకట్టాలంటే మొహమాట పడుతూ ఉంటారు. మరింత సన్నగా కనిపిస్తామని ఫీలవుతుంటారు. అయితే సన్నగా ఉన్నవాళ్లు శారీలో సెక్సీ లుక్ సొంతం చేసుకోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

శరీరాకృతిని బట్టి చీరను ఎంచుకోవాలి. లావుగా ఉన్న వాళ్లు, సన్నగా ఉన్నవాళ్లు, పొట్టిగా ఉన్న వాళ్లు, పొడవుగా ఉన్నవాళ్లు ఎలాంటి వాళ్లకు ఎలాంటి చీరలు నప్పుతాయో తెలుసుకోవాలి. చీరకట్టడంలోనూ.. కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తే నాజూగ్గా ఉండేవాళ్లు కూడా చాలా కలర్ ఫుల్ గా కనిపించవచ్చు. సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు.. ఏ స్టైల్లో కడితే.. ఎట్రాక్టివ్ గా కనిపిస్తారో తెలుసుకుంటే బెటర్.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా..నాజూగ్గా ఉన్న అమ్మాయిలు కాటన్, సిల్క్, టిష్యూ, ఆర్గంజ్ లేదా ఫ్లఫ్ఫీ శారీస్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. స్లిమ్ బ్యూటీస్ శరీరానికి ఈ చీరలు మరింత వన్నె తీసుకొస్తాయి.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

మీ శరీరాకృతికి షీర్, చిఫాన్, జార్జెట్, లేస్, నెట్ శారీస్ చాలా బాగా నప్పుతాయి. ఎందుకంటే.. ఇవి మీ పర్సనాలిటీకి తగిన అందాన్ని, మరింత అటెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. నాజూకు అందానికి నయా లుక్ తీసుకొస్తాయి.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

చాలా సింపుల్ గా, అందంగా కనిపించాలనుకున్నప్పుడు ప్రింటెడ్ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నవి అయితే.. చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

బ్లౌజ్ విషయానికి వస్తే.. సన్నగా ఉన్న అమ్మాయిలకు బ్యాక్ లెస్ చాలా బాగా ఉంటుంది. కేవలం నాడ్స్ నెక్ అయితే మరింత సెక్సీగా కనిపిస్తారు. అలాగే ట్యూబ్ బ్లౌజెస్, స్లీవ్ లెస్ బ్లౌజెస్ మరింత అయితే కొత్త సోయగం తీసుకొస్తాయి.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నని చేతులు కలిగిన వాళ్లకు పఫ్ హ్యాండ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అయితే చేతులు మరీ అంత నాజూగ్గా లేకపోతే పఫ్ బ్లౌజులు సెలెక్ట్ చేసుకోకపోవడమే బెటర్.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

హెవీ సిల్క్, కాంజీవరం చీరలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే.. ఇవి మిమ్మల్ని మరింత సన్నగా కనపడేలా చేస్తాయి.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

లైట్ కలర్ శారీస్ పై పెద్ద పెద్ద ప్రింట్స్ లేదా హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న చీరలు కట్టుకుంటే స్లిమ్ గా ఉన్న వాళ్లు చాలా అందంగా కనిపిస్తారు. కాబట్టి

ఒకసారి ట్రై చేసి చూడండి.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా పొట్టిగా ఉంటే.. చిన్న బార్డర్ ఉన్న చీరలనే సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు పొడవుగా కనిపిస్తారు.

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

సన్నగా ఉన్నవాళ్లు ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి ?

పెద్దగా, హెవీగా ఉండే బార్డర్ శారీస్ సన్నగా, పొడవుగా ఉన్నవాళ్లకు బాగా సెట్ అవుతాయి. అలాగే పెద్ద ప్రింట్స్ ఉన్న శారీస్ మీకు స్పెషల్ ఎట్రాక్షన్ ను తీసుకొస్తాయి.

English summary

How to choose a sari if you are thin: Saree tips for slim girls: Which saree suits a slim women

The sari is a traditional Indian outfit that adds grace and beauty to any Indian woman. If chosen and draped correctly, this costume can definitely hide all your imperfections and highlight your best features.
Desktop Bottom Promotion