For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లిమ్ గా కనిపించడానికి అద్భుతమైన ఐడియాస్

By Swathi
|

నాజూకు అందాన్ని కోరుకోని వారుండరు. నాజూగ్గా మెరిసిపోయే అమ్మాయిని ఇష్టపడని వారూ ఉండరు. స్లిమ్ లుక్ కోసం అందరూ తహతహలాడుతుంటారు. దానికోసం డైటింగ్, ఎక్సర్ సైజ్ లు ఫాలో అవుతుంటారు. కానీ.. లావు తగ్గకపోవడంతో చాలా హైరానా పడుతుంటారు. ఇలాంటప్పుడు డ్రెస్సింగ్ లో కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.

READ MORE: బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?

నాజూగ్గా.. సన్నజాజి తీగలా మెరిసిపోవడానికి.. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే.. మీకే తెలియని స్లిమ్ నెస్ మీలో కనిపిస్తుంది. కొంతమంది లైఫ్ స్టైల్ కారణంగానో.. వారసత్వం కారణంగానో.. లావు శరీరంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు లావుగా ఉన్నామన్న ఫీలింగ్ పక్కనపెట్టి.. సన్నగా కనిపించడానికి డ్రెస్సింగ్ ఎలాంటి పొరపాట్లకు గుడ్ బై చెప్పాలి.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి.. అనేది ఈ ఆర్టికల్ చదివితే మీకే అర్థమవుతుంది.

slim look

ఒకే రంగు
ఫుల్ లెంగ్త్ డ్రెస్సులు వేసుకుంటే.. సన్నగా.. నాజూగ్గా కనిపిస్తారు. పొడవుగా ఉండే దుస్తులతో పాటు రంగు కూడా పై నుంచి కింది వరకు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఎలాంటి కాంబినేషన్ లేకుండా.. అంతా ఒకే కలర్ డ్రెస్ వేసుకోవడం ఎలాగూ ఫ్యాషనే కాబట్టి.. ఈ ట్రిక్ ప్లే చేయండి.

READ MORE: రెండే రెండు వారాల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే బెస్ట్ టిప్స్

accesories

యాక్సెసరీస్
దుస్తుల విషయంలోనే కాదు.. యాక్సెసరీస్ కూడా మీ పర్సనాలిటీ లుక్ లో కీలకం. పొడవాటి చెయిన్స్ వేసుకోవడం వల్ల మెడ సన్నగా కనిపిస్తుంది. మేకప్ తో మీ ముఖాన్ని హైలైట్ చేస్తే.. ఎదుటివాళ్ల చూపు మీ పర్సనాలిటీపై పడకుండా జాగ్రత్తపడవచ్చు. పోనీటైల్ అయితే మరింత స్లిమ్ లుక్ తీసుకొస్తుంది. అలాగే హీల్స్ అయితే.. సన్నగా కనబడేలా చేస్తాయి.

v neck

టాప్
మొహం తర్వాత ఎదుటివాళ్లను ఆకర్షించేది భుజాలు, చేతులు, నడుము. కాబట్టి ఈ ప్రాంతాల్లో సన్నగా కనపడేలా.. జాగ్రత్తపడాలి. వీ లేదా డీప్ నెక్ ఉన్న డ్రెస్ వేసుకోవడం వల్ల సన్నజాజిలా మెరిసిపోవచ్చు. కాటన్ డ్రెస్సులు, ఆర్గంజీ వంటి డ్రెస్సులకు దూరంగా ఉండాలి. జీన్స్ వేసుకున్నప్పుడు షర్ట్ ని ఇన్ షర్ట్ చేస్తే.. స్లిమ్ లుక్ వస్తుంది.

long legnth

లాంగ్ స్కర్ట్స్
లావుగా ఉన్నవాళ్లు లాంగ్ లెంగ్త్ దుస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బాటమ్స్ పొడవుగా ఉంటే.. మీ లుక్ లో చాలా మార్పులు వస్తాయి. అలాగే బూట్ కట్ జీన్స్ లో కూడా స్లిమ్ లుక్ కనిపిస్తుంది. పెన్సిల్ కట్ ఇష్టపడే వాళ్లు అయితే.. మోకాలి భాగానికి కింద వరకూ ఉండేలా చూసుకుంటే.. సన్నగా కనిపిస్తారు.

English summary

How to Dress to Make Yourself Look Slim

How to Dress to Make Yourself Look Slim. Plenty of people feel self-conscious about their weight, and many may even feel insecure about how heavy they think they look. With a few simple fashion tricks, however, you can help yourself look a little skinnier.
Story first published: Wednesday, January 6, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion