రమ్యకృష్ణ గ్లామర్ ని చూసి అభిమానులు ఫిదా..!

Posted By:
Subscribe to Boldsky

ట్రెండు మారింది! అందాలు ఆరబోత విషయంలో మొహమాట పడితే అసలుకే ఎసరొస్తుందనే భావనలో పడిపోయిన టాలీవుడ్ హీరోయిన్లు దేనికైనా సై అంటున్నారు. పబ్లిసిటీ కోసం, ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాట పడుతున్నారు. హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోత కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా మేగజైన్లకూ విస్తరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సౌత్‌లో మేగజైన్ల హవా కూడా పెరిగి పోయింది. మాగ్జిమ్, జెఎఫ్ డబ్ల్యు, గలాట్టా లాంటి పాపులర్ మేగజైన్లు హీరోయిన్లకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తూ డీల్స్ సెట్ చేసుకుంటున్నాయి. వారితో హాట్ అండ్ సెక్సీగా ఫోటో షూట్లు చేస్తూ తమ మేగజైన్లకు గ్లామర్ టచ్ ఇస్తున్నాయి. రీసెంట్ గా అదే పనిచేసింది సీనియర్ నటి రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, అప్పట్లో రమ్యకృష్ణని కేవలం గ్లామర్ గానే కాదు ఆహ్వానం లాంటి సినిమాల్లో కూడా రమ్య అందానికి దాసోహం అన్నారు. బాహుబాలిలో శివగామి పాత్రతో యవత్ భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోని లేటు వయస్సులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్యకృష్ణ.

మ్యాగజైన్ కవర్ పేజ్ పై హాట్&సెక్సీ లుక్ తో సెలబ్రెటీలు

ఆ ఒక్క సినిమా చాలు రమ్యకృష్ణకి ఇంకా అన్ని ఇండస్ట్రీలలో తిరుగులేకుండా చెయ్యడానికి. దక్షిణాదిన క్యారక్టర్ అర్టిస్టుల్లో అత్యంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా కూడా రమ్యకృష్ణ ఇప్పుడు నిలిచింది అంటే దీనంటటికి కారణం ఒక్క బాహుబలి సినిమానే అని చెప్పుకోవచ్చు.. హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమయంలో 'నరసింహ' వంటి సినిమాలో రజనీకాంత్ లాంటి హీరోకి దీటైనా పాత్రలో నటించి అప్పట్లోనే అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంది రమ్య.

కేవలం నటన విషయంలోనే కాదు.. గ్లామర్ విషయంలో కూడా రమ్య‌కృష్ణ‌ వన్నె తగ్గలేదు.ఇక లేటెస్ట్ గా ఆమె జే ఎఫ్ డబ్ల్యూ మేగజైన్ ముఖచిత్రంపై మెరిసింది. ఈ మేగజైన్ ముఖచిత్రం పై ఆమె లుక్ ను .. ఇచ్చిన స్టిల్ చూసిన వాళ్లంతా 'వావ్' అంటున్నారు. 46 సంవత్సరాల వయసులోను ఆమె ఇంత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటం రియల్లీ గ్రేట్ అంటున్నారు.

బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్

చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ వంటి సీనియర్ కథానాయకుల సరసన కూడా మళ్లీ కథానాయికగా అలరించేంత గ్లామర్ ఆమె సొంతమని చెప్పుకుంటున్నారు. అలా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. తల్లి పాత్రలు చేస్తున్నా, నయా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా కనిపిస్తోంది రమ్య. ఇటీవలే నాగార్జున సరసన ఒక హీరోయిన్‌గా నటించి.. ఆ సినిమాలోని అరడజను మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్య.. సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది ఈ లుక్‌లో.

English summary

Ramya Krishnan stunning cover photo!

Ramya Krishnan stunning cover photo!,Ramya Krishnan has been a seductress and an amazing actress through out her younger days and even after graduating to elder roles, she proved her mettle as one of the most versatile actors in Indian Cinema, with Baahubali. She acted as Sivagami and acquired International
Subscribe Newsletter