స్టైల్ టిప్స్: దుర్గాపూజ ఉత్సవాలను వర్షం పాడుచేయనివ్వకండి

Subscribe to Boldsky

ఈ ఏడాది ప్రతి బెంగాలీ వ్యక్తి చిరాకుపడేది ఈ అలుపన్నదేలేని రుతుపవనాల గురించి. ఎందుకని? ఎందుకంటే వారి దుర్గా పూజ ఉత్సవాలకి వర్షం పడి వారి కొత్త బట్టలను పాడుచేస్తుందేమో అని.

ఇంకా, బెంగాలీ పురాణాలలో దుర్గా అమ్మవారి రాక, వీడ్కోలు గూర్చి చెప్పబడింది. అమ్మవారు వచ్చే వాహనాన్ని బట్టి ఆ నెల వాతావరణం ఆధారపడి ఉంటుందని చెప్పబడింది.

పడవ, ఏనుగు, పల్లకి, గుర్రం మొదలైన వివిధ వాహనాలపై అమ్మవారు వేంచేస్తారు. విచిత్రంగా అన్పించినా ప్రతి వాహనానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది.

దుర్గాపూజ ఉత్సవాలను వర్షం పాడుచేయనివ్వకండి

ఈ సంవత్సరం అమ్మవారు పడవపై వస్తున్నారు. దీని అర్థం పండగ సమయంలో భారీ వర్షం పడవచ్చని.

తాజా వాతావరణ స్థితులు మీరు పరిగణనలోకి తీసుకున్నా, లేదా పురాణకథ ప్రకారం వెళ్ళినా ఈసారి దుర్గాపూజ ఉత్సవాలకి వర్షం బెడద ఉండవచ్చు. ఇంకేదాని కోసం కాకపోయినా మీ స్టైల్ పాడయిపోతుందని ఆలోచించండి.

మేము మీ కోసం వర్షాలను తప్పించుకుంటూ మీ ఫ్యాషన్లతో వెలిగిపోయే చిట్కాలు అందిస్తున్నాం. చదవండి.

 క్యులోట్ లేదా క్యాప్రిలు ధరించండి

క్యులోట్ లేదా క్యాప్రిలు ధరించండి

వెస్ట్రన్ లేదా దేశీ బట్టలు ఏది ధరించినా మూడొంతుల పొడుగు మాత్రమే ఉండేట్టు చూసుకోండి. రెండు రకాలకి, క్యులోట్లు, క్యాప్రిలు లేదా మూడొంతుల లెగ్గిన్లు అద్భుతాలు చేస్తాయి.

వర్షం పడుతున్నప్పుడు, పూర్తి పాదాల వరకూ పొడవున్న ప్యాంట్లు కష్టం. బురదగుంటలు, నీరు నిలిచిపోవటం వంటివి మీ బట్టలకి పెద్ద అపాయాలు. పండల్ ఉత్సవాల ఆనందం పోకుండా మీరు స్టైల్ గా ఉండాలనుకుంటే, మూడొంతుల పొడవున్న ప్యాంట్లనే వేసుకోండి.

మెరిసే రంగులు

మెరిసే రంగులు

వర్షాకాలం, మెరిసే లేత రంగులు అద్భుతమైన కలయిక. పండగ కాబట్టి మంచి మెరిసే లేతరంగుల కలెక్షన్ మీ వద్ద ఉండేలా చూసుకోండి. అవి పండగ సమయానికే కాక, వాతావరణం చల్లగా, నెమ్మదిగా ఉన్న ప్రతిసారీ పనిచేస్తాయి.

ఇంకా, ఒకవేళ పండగ డాన్స్ ఉత్సవాలలో మీరు ఎగిరి, డాన్స్ లలో పాల్గొంటే, బురద మరకలు మీ లేత రంగుల బట్టలపై పడతాయి కూడా.

ఫ్లెయిర్ బట్టల అవతారానికి దూరంగా ఉండండి

ఫ్లెయిర్ బట్టల అవతారానికి దూరంగా ఉండండి

ఫ్లెయిర్స్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, సరే, కానీ ఫ్లెయిరీ కింది దుస్తులైన పొడవాటి స్కర్టులు, పలాజోలు వర్షాకాలపు సమయంలోని దుర్గాపూజకి అస్సలు పనికిరావు. ముందురాత్రి కానీ, ఆరోజు వర్షం పడుతూ ఉన్నా మీకెంతో ఇష్టమైన బట్టలు బురద, నీటితో తడిసి నానిపోయి ఉండాలి అనుకోరు కదా?

మండపాల ఉత్సవానికి చీరలు కూడా వద్దు

మండపాల ఉత్సవానికి చీరలు కూడా వద్దు

దుర్గాపూజకి చీరకన్నా మంచిది ఉండదు. కానీ మీరు విశ్వాసంతో దాన్ని భరించగలిగితేనే. పండగప్పుడు వర్షం వచ్చేటట్లుగా ఉంటే, రోడ్డంతా బురదగుంటలు, నీటితో నిండి ఉండటం ఖాయం.

భారీ లేదా నేత చీరలు ధరించటం వలన, అవి తొందరగా పాడవటమే కాక, మీరు అదుపుతప్పి కిందపడే అవకాశం కూడా ఉంటుంది. ఏ మార్గం మనకి అనుకూలంగా లేనందున మేము మీకు ఇచ్చే సలహా ఏమంటే, ఏదన్నా సౌకర్యవంతమైనది లేదా తేలిక చీరలు మీరు వేసుకుని కూడా సులభంగా తిరగగలిగేవి ధరించండి.

మీరు ఒకేచోట ఉండి ఎక్కువ కదలకుండా ఉండేటట్లయితే, చీర కన్నా గొప్ప స్టైల్ ది ఇంకోటి లేదు.

ఆకర్షణీయమైన గొడుగులను మర్చిపోకండి

ఆకర్షణీయమైన గొడుగులను మర్చిపోకండి

మీ రూపానికి ఇది మ్యాచ్ కాకపోయిన ఒక ఫ్యాషన్ గొడుగును కూడా తీసుకు తిరగండి. ఇది మీ వర్షాకాలపు స్టైల్ ను మరింత ఇనుమడింపచేస్తుంది. వర్షం సమస్యగా మారితే, కొంచెం సాదాగానే దుర్గాపూజ ఉత్సవానికి వెళ్లండి.

ఎవరినీ మీ స్టైల్ గా ఉన్న గొడుగుతో పొడవకుండా చూసుకోండి.

లెదర్ షూ లేదా బ్యాగ్ లు కూడా వద్దు

లెదర్ షూ లేదా బ్యాగ్ లు కూడా వద్దు

లెదర్ నీరుతో చర్య జరిగి, వర్షం మీ షూలను, బ్యాగులను నాశనం చేయవచ్చు. వర్షం పడేటప్పుడు మీరు ఉత్సవానికి వెళ్తే లెదర్ షూలు కానీ బ్యాగులుకానీ ధరించవద్దు. బ్యాగులను గొడుగు కింద కాపాడవచ్చు కానీ షూలు తప్పక పాడయ్యే అవకాశం ఉంది.

పాడవని వస్తువులను వాడుకోండి.గుడ్డ బ్యాగుల వంటివి కూడా తడి చేరగానే నీరు కారుతూ ఉంటాయి. పాలిథీన్ సంబంధ బ్యాగులను వాడండి.

ఫ్లిప్స్ ఫ్లాప్స్ అస్సలు వద్దు

ఫ్లిప్స్ ఫ్లాప్స్ అస్సలు వద్దు

ఫ్లిప్స్ –ఫ్లాప్స్ నీరును, బురదను మీ పాదాల నుంచి చుట్టూ చిందేలా చేసి మీ బట్టలను పాడుచేయవచ్చు. పండగ ఉత్సవాలకి వాటిని వేస్తే మీకెంతో ఇష్టమైన బట్టలను ప్రమాదంలో పడేస్తున్నట్టే.

మొత్తం కప్పివుంచే షూలు వేసుకుంటే బట్టలు బురద చిందుల నుంచి సురక్షితంగా ఉంటాయి. మీ బట్టలపై బురదతో పోల్కా చుక్కలనైతే కోరుకోరని మాకు తెలుసు.

ఈ చిట్కాలు పాటించి వర్షం పడ్డాకూడా మీ పండగను పాడవనివ్వకండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Tips To Style Well In Rainy Durga Puja, Durga Puja 2017, Durga Puja Style Tips 2017, Durga Puja Fashion Tips 2017, Durga Puja Special Saree, Durga Puja Saree Style

    If rain attempts to spoil your Durga Puja, this is how you can save your style during pandal hopping. Have a look.
    Story first published: Tuesday, September 12, 2017, 21:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more