Just In
- 1 hr ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 9 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
- 10 hrs ago
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- 11 hrs ago
ఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది, ఎంతో శక్తివంతమైనది
Deepika Padukone at cannes 2022:దీపికా ధరించిన వైట్ గోల్డ్ నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు...!
Deepika padukone at Cannes Film Festival 2022:బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రయ్యుమంటూ దూసుకెళ్తోంది.
ఫ్రాన్స్ దేశంలో కేన్స్ నగరంలో 75వ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఇక్కడ ప్రపంచంలోనే వివిధ దేశాలకు చెందిన సెలబ్రెటీలంతా రెడ్ కార్పొట్ పై పరువాల విందు పంచుతూ ఉంటారు. దీని కోసం వెరైటీ డ్రస్సులతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ అతిపెద్ద సినీ వేడుకలో స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రస్సులతో, ఆకట్టుకునే ఆభరణాలతో తళుక్కుమని మెరుస్తుంటారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ అందాల బామ దీపికా బ్లాక్ డ్రస్సులో ఎర్రని పెదాలతో.. వైట్ గోల్డ్ నెక్లెస్ ధరించి అందరి ఫోకస్ తనపై పడేలా చేసింది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో తను ధరించిన డైమండ్ నెక్లెస్ ధర తెలిస్తే మీరు కచ్చితంగా షాకైపోతారు. ఎందుకంటే అది ఏకంగా కోట్ల రూపాయల విలువైనది. ఇంతకీ తను ధరించిన నెక్లెస్ ధరెంత.. అది ఎందుకంత ఖరీదైనదో మీరే చూడండి...
Pooja
Hedge
Cannes
Look
:ప్రపంచ
వేదికపై
స్పెషల్
అట్రాక్షన్
గా
బుట్టబొమ్మ...

కేన్స్ వేడుకలో..
దీపికా కేవలం తన నటనతోనే కాదు.. ఫ్యాషన్ రంగంలోనూ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రస్సులు, వెరైటీ దుస్తులను ధరిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. తాజాగా ఈ పొడుగు కాళ్ల సుందరి కేన్స్ వేదికలో డిజైనర్ వేర్ లో అందరి చూపు తనవైపు పడేలా చేసింది.

ప్రత్యేక ఆకర్షణగా..
2017 సంవత్సరం నుంచి కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోన్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. 2022లో భారతదేశం తరపున జూరీ సభ్యురాలిగా హాజరైంది. అంతేకాదు తన ఫ్యాషన్ డ్రస్సులతోనూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించింది. అయితే తాజాగా తన మెడలో ధరించిన వైట్ గోల్డ్ నెక్లెస్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హాట్ టాపిక్..
అంతేకాదండోయ్.. దీపికా పదుకునే ధరించిన ఈ వైట్ నెక్లెస్ ధర కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్న ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. దీంతో ప్రతి ఒక్కరూ ఆమె ధరించిన వజ్రాలహారం ఎంత ఖరీదైనదో కనుక్కోవడం మొదలెట్టారు.

ఎందుకంత స్పెషల్..
బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా బ్లాక్ కలర్ సూట్ పై వైట్ గోల్డ్ వజ్రాల హారం చాలా చాలా స్పెషల్. ఈ ఆభరణంలో రెండువైలా పులి ముఖాలు ఆకట్టుకునేలా కనిపిస్తాయి. అంతేకాదండోయ్.. ఆ పులుల కళ్లు ఉండే చోట ఖరీదైన పచ్చలను జోడించారట. అందుకే ఇది మరింత స్పెషల్ గా మారిపోయింది.

ధర ఎంతంటే..
అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ వైట్ గోల్డ్ నెక్లెస్ ధర అక్షరాల మూడు కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందట. ఇది చూసిన నెటిజన్లు వామ్మో అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వజ్రాల హారం మొత్తం 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో తయారు చేయబడిందట. ఈ నెక్లెస్ ను ఫ్రాన్సులోని ప్రముఖ బంగారు తయారీ సంస్థ అయిన కార్టయల్ నుండి దీపికా కొనుగోలు చేసిందట.
అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ వైట్ గోల్డ్ నెక్లెస్ ధర అక్షరాల మూడు కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందట. ఇది చూసిన నెటిజన్లు వామ్మో అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వజ్రాల హారం మొత్తం 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో తయారు చేయబడిందట. ఈ నెక్లెస్ ను ఫ్రాన్సులోని ప్రముఖ బంగారు తయారీ సంస్థ అయిన కార్టయల్ నుండి దీపికా కొనుగోలు చేసిందట.ఈ అతిపెద్ద సినీ వేడుకలో స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రస్సులతో, ఆకట్టుకునే ఆభరణాలతో తళుక్కుమని మెరుస్తుంటారు సెలబ్రిటీలు.