For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీలాంబరిగా మారిన బుట్టబొమ్మ అందాలను చూస్తే చూపు తిప్పుకోలేరు...

|

టాలీవుడ్ లో ఒక లైలా కోసం అంటూ నాగ చైతన్యతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే బుట్టబొమ్మగా బాగా పాపులర్ అయ్యింది. అంతకుముందే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాథం, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత.. 'కాస్త గ్యాప్ కావాలి'అంటూ అందరినీ అలరించింది..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతోనూ ఈ అందాల ముద్దు గుమ్మ మంచి అవకాశాన్నే దక్కించుకుంది. మహర్షితో మరోసారి బ్లాక్ బస్టర్ హింగ్ సొంతం చేసుకున్న ఈ అందాల భామ ఇటీవల అఖిల్ తో 'బ్యాచ్ లర్' హిట్ కొట్టి మాంచి ఊపులో ఉంది.

ఇదిలా ఉండగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాధే శ్యామ్'లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ తో కలిసి 'నీలాంబరి.. నీలాంబరి..అయ్యోరింటి సుందరి''అనే పాటలోనూ అలరించింది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ పొడుగు కాళ్ల సుందరి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తన ఫ్యాషన్ డ్రస్సులతో అందరినీ అలరిస్తోంది. అందులో ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన టాప్ ఫ్యాషన్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి...

టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ పాపులర్ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేయండి...

ట్రెండీ ఫ్యాషన్..

ట్రెండీ ఫ్యాషన్..

బుట్టబొమ్మ అందానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అందుకే పూజా హెగ్డేకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలానే ఉంది. ఎందుకంటే తను వివిధ రకాల ట్రెండ్స్ తో కూడిన ఫ్యాషన్ డ్రస్సులను ఎక్కువగా ధరిస్తారు. కాలేజీ అమ్మాయిలకు బాగా నచ్చే ఫ్యాషన్ డ్రస్సులలో స్కర్ట్స్ కూడా ఒకటి. వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో ధరించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. పూజా హెగ్డే కూడా ఇదే ఫాలో అయ్యింది.

మెరిసిపోతున్న సొగసరి..

మెరిసిపోతున్న సొగసరి..

వరుస ఆఫర్లతో బిజీగా గడిపేస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందరి గ్లామర్ షో మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియా వేదికగా తను చేస్తున్న ఫొటో షూట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల తను ట్రెడిషనల్ డ్రస్సులు ధరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇవి ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి.

Diwali Couple Fashion:దీపావళి వేళ స్టైలీష్ లుక్ కోసం ఆలియా, రణబీర్ కపుల్ ఔట్ ఫిట్స్ పై ఓ లుక్కేయండి...

స్లిమ్ అవుట్ ఫిట్..

స్లిమ్ అవుట్ ఫిట్..

‘నీలాంబరి' ధరించిన ఈ స్లిమ్ అవుట్ ఫిట్ ని చూస్తే అస్సలు చూపు తిప్పుకోలేరు. డార్క్ బ్లూ డిజైన్ లో రూపొందించిన ఈ తరహా డ్రస్సులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ధరించి ఫ్యాషనబుల్ గా మెరిసిపోవడం అంత కష్టమేమీ కాదు. పూజా హెగ్డేలా మ్యాచింగ్ ఫుట్ వేర్ తో పాటు డ్రస్సుకు తగ్గట్టు మంచి మేకప్, హెయిర్ స్టైల్ వేసుకుంటే మీరు కూడా నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.

కూల్ లుక్స్..

కూల్ లుక్స్..

అసలే ఇప్పుడు చలికాలం స్టార్టయ్యింది.. రాత్రిపూట అయితే మరీ చల్లగా ఉంటోంది. ఇలాంటి సమయంలో మనకు వెచ్చని వాతావరణం కావాలనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ పూజా ధరించిన డ్రస్సు చక్కగా సరిపోతుంది. ఇది మీ బాడీకి చలి నుండి రక్షణ కూడా ఇస్తుంది. ప్లెయిన్ బ్లాక్ టాప్ కు మ్యాచింగ్ జాకెట్ జత చేసి పూజా ఎంత కూల్ లుక్స్ గా కనిపిస్తోందో కదా.

ఎంతో ధైర్యం కావాలి..

ఎంతో ధైర్యం కావాలి..

ప్రకాశవంతమైన రంగులను ధరించడం కూడా ఒక ఆర్ట్. అయితే ఎన్ని రంగుల డ్రస్సులు ధరించినా.. తెలుపుకు ఉండే ప్రత్యేకతే వేరు. అందుకే పూర్తిగా వైట్ మిక్స్ డ్ కలర్ అవుట్ ఫిట్ ధరించాలంటే అందుకు ఎంతో ధైర్యం కావలి. ఎందుకంటే వైట్ షేడ్స్ అందరికీ సెట్ కాకపోవచ్చు. అయితే పూజా ధరించిన ఈ మిక్స్ డ్ వైట్ అవుట్ ఫిట్ ని చూసిన తర్వాత ఎవరైనా ఇందులోనూ ఇంత అందంగా మెరిసిపోవచ్చా అని ఆశ్చర్యపోతారు.

English summary

Radhe Shyam Heroin Pooja Hegde Looks Stunning in Her Latest Fashion Photos

Here are the Radhe Shyam heroin pooja hegde looks stunning in her latest fashion photos. Take a look
Story first published: Saturday, November 6, 2021, 13:46 [IST]