Just In
- 1 hr ago
Today Rasi Phalalu: మిథున రాశి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే మోసపోతారు..
- 13 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 13 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 15 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
Don't Miss
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Anupama Parameshwaran: అనుపమ.. సొగసు చూడతరమా..
Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పుడో ఇప్పుడో సినిమాలు చూసే వారికి కూడా అనుపమ గురించి తెలిసే ఉంటుంది. నిన్న, మొన్నటి వరకు బిజి బిజీగా ఉన్న అనుపమ.. ప్రస్తుతం డల్ అయిపోయింది. సినిమా అవకాశాలు లేక డీలా పడిపోయింది ఈ మలబార్ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఈ సుందరి.
ప్రేమమ్ సినిమాతో తెరకు పరిచయం అయిన ఈ భామ. అదే చిత్రం రీమేక్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ ఒక్క సినిమా తర్వాత అనుపమకు చాలా అవకాశాలే వచ్చాయి. అందివచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకుంటూ ఎదుగుతూ వచ్చింది అనుపమ పరమేశ్వరన్. అలాగే తన స్టైల్ నూ మారుస్తూ వచ్చింది ఈ వయ్యారి.
మొదట్లో తన స్టైల్ స్టేట్మెంట్.. ఇప్పుడు తన ఫ్యాషన్ ఎలా మారింది.. అనుపమ సొగసు ఎలా మెరుపెక్కింది.. తన ట్రాన్స్ ఫర్మేషన్ పై ఓ లుక్ వేద్దాం.

1. లేలేత అందాల అనుపమ
2015లో ప్రేమమ్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ. ఈ పిక్ 2016 లో సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ మలబార్ భామ. లేలేత అందాలతో కుర్రకారును రెచ్చగొట్టింది.

2. వైట్ టీస్ లో చమక్కు
2016లో అఆ, ప్రేమమ్ తెలుగు రీమేక్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ సుందరి. ఈ పిక్ లో వైట్ టీషర్ట్ వేసుకుని సొగసును చూపిస్తోంది.

3. ఏమా.. సౌందర్యం
శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలు చేసింది 2017వ సంవత్సరంలో అనుపమ. ఈ చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే సంవత్సరం TASC స్టార్ నైట్ లో పాల్గొని మెరిసిపోయింది ఈ అప్సరస.

4. అప్సరస అనుపమ
2017 నాటి చిత్రం ఇది. బెర్రీ బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో అనుపమ అందాలు అదిరిపోయాయి. స్టైలిష్ స్టార్ లా మెరిసిపోతోంది.

5. మెరుపెక్కిన అందం
ఎరుపు, తెలుపు కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్బ్ గా ఉంటుంది. అదే కాంబినేషన్ లో వచ్చిన ఫుల్ ఫ్రాక్ లో అనుపమ సౌందర్యం చూసేందుకు రెండు కళ్లూ చాలవు. 2017 నవంబర్ నాటిది ఈ చిత్రం.

6. ముంతాజ్ లుక్స్
క్రీమీ వైట్ సారీ విత్ గోల్డ్ కలర్ బ్లౌజ్ పైకి పెద్ద సైజు చెవి పోగుతో అదరహో అనిపిస్తోంది అనుపమ. 2018 నాటి ఈ చిత్రంలో అనుపమ సౌందర్యవతిలా కనిపిస్తోంది కదూ.

7. మలయాళ సౌందర్యం
ఫెస్టివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కదూ ఈ పిక్ లో. క్రీమ్ కలర్ సారీ విత్ గోల్డ్ బార్డర్ పైకి బ్లాక్ బ్లౌజ్ లో క్రేజీగా కనిపిస్తోంది అనుపమ. 2018 ఏప్రిల్ లో తీసిని ఈ ఫోటోలో అనుపమ అందాల ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంది.

8. ట్రెండీ ట్రెడిషనల్
ట్రెడిషన్, వెస్టర్న్ కలబోతగా ఉన్న ఈ డ్రెస్ లో అనుపమ అందం రెట్టింపు అయిందనే చెప్పాలి. 2018 ఏప్రిల్ లోని ఈ క్లిక్ లో ఒకవైపు బ్లాక్ విత్ స్లీవ్ లెస్, మరోవైపు ఫుల్ హ్యాండ్స్ బనారస్ ప్రింటెడ్ గౌన్ లో అనుపమ అదిరిపోయింది.

9. క్రేజీ లుక్స్ ఆఫ్ అనుపమ
2018 లో వచ్చి 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రం ప్రమోషన్స్ లో ఈ చిత్రం క్లిక్ మనిపించారు. ఇందులో క్రేజీ లుక్ లో అనుపమ కుర్రకారును కట్టిపడేసింది.

10. బ్లాక్ అండ్ వైట్ అందాల హరివిల్లు
బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ విత్ క్రేజీ ఫోజ్ లో అనుపమ ప్రెట్టీగా కనిపిస్తోంది. 2019 నాటిది ఈ పిక్. బ్లాక్ కలర్ టీస్ పై లవ్ అనే పదాలతో చెప్పకనే చెప్పేస్తుంది ఐయామ్ లవ్లీ అనుపమ అని.

11. చీరకే అందం తెచ్చిన అనూ
చీరకే అందం తెచ్చేలా ఉంటుంది అనుపమ చీర కట్టు. 2019 ఏప్రిల్ నాటి ఈ పిక్ లో గోల్డ్ కలర్ సారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ లో గ్రీన్ లీవ్స్ బ్యాగ్రౌండ్ లో అనూ అదిరిపోయింది.

12. అనుపమ స్టైల్ స్టేట్మెంట్
ఈ లుక్ లో అనుపమ సొగసు గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు.

13. లెమన్ ఎల్లో పరువాలు
లెమన్ ఎల్లో సారీ అనుపమ అందాలు మత్తెక్కిస్తున్నాయి. అదే కలర్ బ్లౌజ్ తో ఈ కాంబినేషన్ కుర్రకారుకు కిక్కెక్కిస్తుంది.

14. సొగసు చూడతరమా..
క్రీమ్ కలర్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ కు రెడ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఈ కాంబినేషన్ లో అనుపమ సొగసు మామూలుగా ఉండదు మరి.