అంబానీ డిన్నర్లో ఐశ్వర్య సందడి.. ఈ గౌన్ ధర ఊహించగలరా ?

Subscribe to Boldsky
Aishs Expensive Gown Needs Decoding, Can You Guess The Price?

బాలీవుడ్ మహారాణిగా పేరున్న ఐశ్వర్యా రాయ్, అంబానీ అందించిన డిన్నర్ పార్టీలో, అలెక్సిస్ మబిల్లె బంగారు గౌన్ లో తళుక్కుమంది. క్రమంగా మీడియా కంట్లో పడిoది. తద్వారా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు కొట్టింది. బంగారమే బంగారం ధరించిందా అన్న అనుభూతి కలగక మానదు.

ఐశ్వర్యా రాయ్ 45 ఏళ్ళ వయసులో 6 సంవత్సరాల పాపకు తల్లైనా, చెక్కు చెదరని అందం ఐష్ సొంతం. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ బంగారు అలెక్సిస్ మబిల్లె దుస్తులలో, ప్రపంచ సుందరి అనే పేరు ఈవిడ కోసమే పుట్టిందనిపించేలా, మరే అందం సాటి రారనిపించేలా కనిపించింది. ఐశ్వర్యారాయ్ అభిమానులైతే షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Aishs Expensive Gown Needs Decoding, Can You Guess The Price?

ఐష్ ఒక తరగని అందాల గని, గతేడాది కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా మైఖేల్ సింటూ డిజైన్ చేసిన ఐసీ బ్లూ రంగు గౌన్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ గుర్తుతెచ్చుకోండి. కొద్ది కాలం టాక్ ఆఫ్ ఇండస్ట్రీ ఐశ్వర్యానే అప్పట్లో.

ఇప్పుడు ధరించిన ఈ స్టేట్మెంట్ టుక్సేడో గౌన్, జనాలను మిన్నకుండేలా చేయడమే కాదు, తన పూర్వ వైభవాన్ని కనపరిచేలా చేసింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆఫ్ – షౌల్డర్ దుస్తులలో, ఆకర్షణీయమైన ఆకృతి మరియు స్టైల్ తో అందరి దృష్టిని తనవైపు మరల్చేలా చేయగలిగింది.

ముఖ్యంగా దుస్తుల రంగు, మలచిన విధానం, కట్స్, డిజైన్, దుస్తులకు సరిపోయే బెల్ట్ ఇలా చెప్పుకుంటే పొతే అనేకం ఉన్నాయి. ఒకరకమైన బాల్ రూమ్ డాన్స్ వేర్ లుక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అతిశయమే అచ్చెరువందే ఐశ్వర్యా ఒక అతిశయo అంటూ అభిమానులు ఫోటో కింద కామెంట్లతో నింపేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు, అభిమానుల మనస్సులో ఎంతగా తన స్థానాన్ని పదిలపరచుకుందో.

ఈ అందమైన దుస్తుల ఖరీదు ఊహించగలరా ? అక్షరాలా 3,73,905 రూపాయలు. మీరు విన్నది నిజమే . ఐశ్వర్యారాయ్ విలాసవంతమైన, లక్జరీ దుస్తులకు అత్యంత ప్రాదాన్యతనిస్తుంది. ఇక ఈ దుస్తుల విషయానికి వస్తే, ధరకు తగిన న్యాయం చేశాయనే చెప్పవచ్చు.

ధరించిన దుస్తులే కాకుండా, చేతిలో ఉన్న క్రిస్టియన్ లోబౌటిన్ సీక్వైండ్ క్లచ్ బాగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

మేకప్ పరంగా డ్యూవీ లుక్ మేకప్ తో, సహజ సిద్దమైన పింక్ లిప్ షేడ్ , ఐలైనర్ జోడించడం ద్వారా ప్రకాశవంతముగా కనిపించింది. మరియు పొడవైన ఉంగరాల జుట్టు ఆ దుస్తులకు సరికొత్త అందాన్ని జోడిoచాయని చెప్పవచ్చు.

ఏది ఏమైనా ఐష్ అంటేనే వెలకట్టలేని అందం? ఇక వెల గురించి ఆలోచించడం అవసరమా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    అంబానీ డిన్నర్లో ఐశ్వర్య సందడి.. ఈ గౌన్ ధర ఊహించగలరా

    Queen of Bollywood, Aishawarya Rai glittered in gold in an Alexis Mabille gown. The occasion was Ambani's dinner party and her blingy look got our eyes popping out of our heads. Her metallic ensemble was definitely worth its weight in gold!
    Story first published: Saturday, April 28, 2018, 16:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more