ఆకాష్ అంబానీ - శ్లోకా మెహతా పార్టీలో హైలైట్ గా నిలిచినా ఆరాధ్య బచ్చన్ & ఐశ్వర్యా రాయ్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

17 ఏళ్ళ వయసులో ఈ ప్రపంచాన్ని తన అందంతో మాయచేసిన సుందరి ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఆమె అందం రవంతయినా కరగలేదు. ఆమె కాన్ఫిడెన్స్, ఛార్మ్, ఇంటెలిజెన్స్ అనేవి అలాగే ఉన్నాయి. నిజానికి, తను వైన్ లా ఏజ్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింతగా ప్రేక్షకులను మాయచేస్తోంది. ప్రతి సంవత్సరం మిస్ వరల్డ్ కిరీటాన్ని, బ్యూటీ విత్ పర్పస్ ని ఎవరో ఒకరు చేజిక్కించుకుంటూనే ఉన్నారు. అయిదు, వారందరు ఐశ్వర్యకి సాటిరారు.

ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ తన చిరకాల ప్రియురాలితో సెలెబ్రిటీస్ మధ్య ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకున్నాడు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ కరణ్ జోహార్, జాన్ అబ్రహం, కత్రినా కైఫ్, షారుఖ్ ఖాన్ తో పాటు మరికొంత మంది హాజరయ్యారు. క్రికెట్ వరల్డ్ నుంచి జహీర్ ఖాన్ తన వైఫ్ సాగరికతో విచ్చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ వేడుకకు అటెండ్ అయ్యాడు. అయితే, ఈ షో ని మొత్తం స్టోల్ చేసిన సుందరి మరెవరో కాదు ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్.

Aishwarya Rai at Ambanis Party

అంబానీ రెసిడెన్స్ కి తన లిటిల్ ప్రిన్సెస్ ఆరాధ్యతో సహా విచ్చేసింది. బ్లాక్ స్ట్రక్చర్డ్ నెక్ లైన్ తో పాటు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కలిగిన ఉస్మాన్ గవున్ లో సందడి చేసింది. తన లుక్ కి మ్యాచ్ అయ్యే విధంగా వాల్యూమినస్ కరల్స్ ని భుజాల వరకు వచ్చేలా హెయిర్ డూ చేసుకుంది. బోల్డ్ రెడ్ లిప్ షేడ్ తో బహు సుందరంగా కనిపించింది.

17 ఏళ్ళ వయసులో కొన్ని దశాబ్దాల క్రితం మిలియన్ల హృదయాలను కొల్లగొట్టిన సుందరి ఇప్పటికీ తన అందంతో అదేవిధంగా మాయ చేస్తోంది. ముద్దులొలికే ఆరాధ్య తన పింక్ ఫ్రాక్ మరియు ఫ్రిల్స్ హెయిర్ బ్యాండ్ తో ప్రిన్సెస్ అవతార్ తో ఐశ్వర్యతో సమానంగా అందంగా కనిపించింది.

Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party
Aishwarya Rai at Ambanis Party

English summary

Aishwarya Rai at Ambani's Party

The 17-year-old chirpy girl who swept the world of its feet with her bewitching charm, confidence and intelligence hasn't changed a bit till date. In fact, she has aged like fine wine! Each year, there would be someone who would be crowned the Miss World, Beauty With Purpose, but we know for a fact that none of them would be Aishwarya Rai.