న‌లుపు అందాల‌తో ముగ్ధ‌ప‌ర్చిన నీలిక‌నుల సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్

By: Sujeeth Kumar
Subscribe to Boldsky
Aishwarya Rai Bachchan attended Longines' latest store launch in Sydney

అందాల రాశి, అపురూప మాజీ ప్ర‌పంచ సుంద‌రి అయిన ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ నిన్న సాయంత్రం సిడ్నీలో త‌ళుక్కుమ‌న్నారు. ప్రముఖ వాచ్‌ల బ్రాండ్ అయిన లాంజైన్స్‌కు ఐశ్వ‌ర్య ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. సిడ్నీలో ఆమె కొత్త స్టోర్ ను ప్రారంభించి సంద‌డి చేశారు. అంతేకాదు ఆమె అందాల‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

గౌరి అండ్ నైనికా డిజైన‌ర్ శ్రేణిలో న‌ల్ల‌ని గౌనును ఆమె ధ‌రించారు. సీక్వెన్‌, ర‌ఫెల్డ్ డిజైన్‌లో ఉన్న గౌను ఐశ్వ‌ర్య సెక్సీనెస్‌ను పెంచింది అని చూడ‌గానే చెప్పొచ్చు.

స్ట్రాప్స్ లేని ఈ సీక్వెన్ గౌన్ .. మెడ భాగంలో న‌ల్ల‌ని ఫ్యాబ్రికేటెడ్ గులాబీలు హైలైట్‌గా నిలిచాయి. ఐశ్వ‌ర్యరాయ్ కేవ‌లం లాంజైన్స్ లెద‌ర్ వాచీ త‌ప్ప మ‌రేమీ ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌లేదు. ఆమె ఎప్ప‌టిలాగే ముగ్ధ‌మ‌నోహ‌రంగా క‌నిపించి స్టైల్ ఐకాన్‌గా నిలిచారు.

మీకూ ఐశ్వ‌ర్యరాయ్ అంతే అందంగా క‌నిపించిందా? మీ అభిప్రాయాల‌ను కామెంట్ ద్వారా తెలియ‌జేయ‌గ‌ల‌రు.

Aishwarya Rai Bachchan attended Longines' latest store launch in Sydney
Aishwarya Rai Bachchan attended Longines' latest store launch in Sydney
English summary

Aishwarya Rai Bachchan At Longines Store Launch In Sydney

The gorgeous Aishwarya Rai Bachchan was in Sydney last evening to launch a new store of Longines watches. Ash is the ambassador of the brand and at this store launch event, she totally looked mesmerizing.
Story first published: Monday, February 5, 2018, 16:00 [IST]
Subscribe Newsletter