For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వినూత్నమైన దుస్తులలో అలరించిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్

|

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2019 జర్నీని తన కుమార్తె, ఆరాధ్యతో తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా, ఫ్రెంచ్ రివేరాలో వీరే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటేనే గుర్తొచ్చేలా మారిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జీన్ లూయిస్ సబాజీ రూపొందించిన అద్భుతమైన గౌన్లో మెరిసిపోతూ ఫ్యాషన్ ప్రపంచానికి స్పూర్తిని నింపేలా కనిపించింది. క్రమంగా ఈ దుస్తుల కారణంగా విమర్శకుల నోటికి పనిలేకుండా పోయింది. దోషరహితంగా అద్భుతంగా మలచిన ఈ దుస్తులతో ఐశ్వర్య, తన కేన్స్ ప్రయాణాన్ని ప్రారంభించింది. గత 2018 కేన్స్ ఫెస్టివల్లో ధరించిన వంగ పండు రంగు దుస్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా అప్డేటెడ్ ఎడిషన్ వలె, ఈసారి జాగ్రత్తలు తీసుకుంది ఐశ్వర్య. ఎప్పటికప్పుడు సరికొత్త ఫాషన్ పోకడలను అనుసరిస్తూ ఫాషన్ ప్రియులకు ఆదర్శంగా నిలిచే ఐశ్వర్యా రాయ్, ఈసారి ఎటువంటి దుస్తులను అనుసరిస్తుందోనన్న కుతూహలానికి, ఏమాత్రం తీసిపోనివిధంగా తయారై అబ్బురపరచేలా కనిపించింది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ప్రశంసలను సైతం అందుకుంది.

ఆమె ధరించిన ఈ డెకరేటెడ్ గౌను, బంగారు మరియు ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఎంతో అందంగా మలచబడి ఉంది. అంతేకాకుండా, ఈ దుస్తులలో ప్రకృతి ప్రేరణ ఉట్టిపడేలా కనిపించింది. ప్రధానంగా లీఫ్ కట్ బోడిస్, మరియు షార్ప్ సిల్హౌట్ గౌనుకు నాటకీయ రూపకాన్ని జోడించినట్లుగా కనిపించింది. ఆమె దుస్తులు ఒక వైపు మాత్రమే స్లీవ్ను కలిగి ఉండి, పాము చర్మాన్ని పోలిన ఆకృతితో ఎంతో అద్భుతంగా కన్పించాయి. క్రమంగా దుస్తుల విషయంలో అత్యంత జాగ్రత్తను, నిబద్ధతను ప్రదర్శించినట్లు తెలుస్తుంది.

ఇక మేకప్ విషయానికి వస్తే, స్టైలింగ్ భాద్యతలను స్టైలిస్ట్ ఆస్థా శర్మ చక్కగా నిర్వహించింది. క్రమంగా విలువైన ఆభరణాలతో, ఆమె వస్త్రాలకు సంపూర్ణతను జోడించగలిగింది. వీటిని బౌచెరాన్ అనే ఫ్రాన్స్ ఆధారిత బ్రాండ్ నుండి సేకరించడం జరిగింది. పెదాలకు జోడించిన పింక్ లిప్ షేడ్, మరియు సాధారణ ఐ మేకప్ అనుసరించి తన రూపకాన్ని పూర్తిచేసింది ఐశ్వర్య. జుట్టుకు అదనపు సొగసులు జోడించకుండా, పక్కపాపిట తీసి బుజాల వెనుకకు వదిలివేసింది. క్రమంగా ఒక మహారాణిలా కనిపించింది ఐశ్వర్యా. ఇక ఆరాధ్య విషయానికి వస్తే, పసుపు రంగు దుస్తులలో ముచ్చటగొలిపేలా తల్లికి తగ్గ తనయగా కనిపించింది. ఈ దుస్తులలో కుడివైపు ఉన్న పువ్వు రూపంలోని డిజైన్ దుస్తులకు ప్రత్యేక ఆకర్షణను తీసుకుని వచ్చింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2019 లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ధరించిన దుస్తులు మంచి క్రేజ్ సంతరించుకున్నాయనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆమె వస్త్రధారణ గురించి మీరేమనుకుంటున్నారు ? మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: fashion bollywood
English summary

Aishwarya Rai Bachchan In A Jean Louis Sabaji Gown at Cannes

aishwarya rai bachchanina jean louis sabaji gown at cannes
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more