'సినీపరిశ్రమ రారాణి' శ్రీదేవి యొక్క అన్ని మేటి కవర్ పేజీ లుక్స్

Subscribe to Boldsky

శ్రీదేవి బాలీవుడ్ లో అజరామరంగా ఉండే ఒక తార, ఆమె హఠాన్మరణంతో, ఫ్యాషన్ రంగం కూడా తనను తాను స్టైల్ గా ఎలా ఉంచుకోవాలో, స్టైల్ గా ఎలా ఎదగాలో తెలిసిన ఐకాన్ ను కోల్పోయింది.

చాలామంది తమ తరం యొక్క స్టైల్స్ నే పాటించి, తర్వాత కూడా వాటి నుండి ముందుకు సాగరు. కానీ శ్రీదేవి మాత్రం మార్పును తన స్టైల్ స్టేట్ మెంట్లో కూడా స్వాగతించి, ఎలా మారుతున్న తరాలతో పాటు స్టైలిష్ గా మారాలో తెలిసిన వ్యక్తి.

ఆమె ఈ కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాక, తన కూతుళ్ళు ఫ్యాషన్ పరంగా ఆమెకి మార్గదర్శనం చేసారు. తన కెరీర్ మొదటినుండి, ఆమె వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలపై ముఖచిత్రాలుగా కన్పించారు.

ఆమెకి నివాళిగా, మేము ఈ రోజు తన జీవితకాలంలో వచ్చిన మేటి పత్రికల కవర్ పేజీ లుక్స్ ను ఒక చోట పొందుపర్చి అందిస్తున్నాం, చూడండి.

ఫిల్మ్ ఫేర్ (1984)

ఫిల్మ్ ఫేర్ (1984)

భారతదేశంలో ఫిల్మ్ ఫేర్ ఎప్పుడూ మేటిస్థానంలోనే ఉండే పత్రికలలో ఒకటి మరియు 1984 లో శ్రీదేవి అయితే చిత్రపరిశ్రమను ఏలుతున్న రోజులు. ఫిల్మ్ ఫేర్ కవర్ చిత్రాలుగా వచ్చిన ఫోటోలలో ఒకదాంట్లో ఆమె లేస్ టాప్ మరియు పూసల నెక్లెస్ తో అదరగొట్టారు.

ఫిల్మ్ ఫేర్ (1985)

ఫిల్మ్ ఫేర్ (1985)

ఫిల్మ్ ఫేర్ (1985) సంచిక టైటిల్ లో శ్రీదేవిని ‘ సామ్రాఙ్ఞి’గా అభివర్ణించారు మరియు ఈ పదం కూడా ఆమెకు తగినదే. ఆమె నిజంగానే బాలీవుడ్ కు రారాణి మరియు తన మెరుపు, గ్లామర్ తో ఆ రంగాన్ని ఏలారు. కవర్ చిత్రంలో ఆమె క్లాసీ మరియు ఆత్మవిశ్వాసంతో కన్పించారు.

మూవీ మ్యాగజైన్ (1988)

మూవీ మ్యాగజైన్ (1988)

80ల్లో బాలీవుడ్ లో మూవీ మ్యాగజైన్ ప్రముఖ పత్రికలలో ఒకటి మరియు 1988 సంచికలో శ్రీదేవి అందంగా కానీ యాటిట్యూడ్ లుక్ తో కవర్ పేజీపై కన్పించారు. ఆమె ఆరెంజి రంగు తలపాగా తన డ్రస్ కు మ్యాచింగ్ గా ధరించారు మరియు పెద్ద పెద్ద పువ్వుల చెవిదిద్దులను పెట్టుకున్నారు.

షో టైమ్ (1991)

షో టైమ్ (1991)

అప్పట్లో పెద్ద పత్రికైన ఇందులో 1991 సంవత్సరపు సంచికలో, శ్రీదేవి టైటిల్ ‘భారత సినీపరిశ్రమ రారాణి’ గా ప్రచురితమైంది. ఇక ఆమె అద్భుతమైన లుక్ గురించి వేరే చెప్పాలా?

టిన్సెల్ టౌన్ (1991)

టిన్సెల్ టౌన్ (1991)

90ల్లో మరొక టాప్ పత్రిక , టిన్సెల్ టౌన్ శ్రీదేవిని చాలా అందమైన ఒక లుక్ లో చూపించింది. కవర్ లుక్ కోసం ఆమె ఇందులో నీలి రంగు డ్రస్ ను మరియు మ్యాచింగ్ నగలు, బొట్టుబిళ్ళతో కన్పించారు.

మూవీ (1994)

మూవీ (1994)

మూవీ మ్యాగజైన్ 1994 సంచికలో శ్రీదేవి కవర్ చిత్రంలో కన్పించారు. శ్రీదేవి తన బ్యాక్ లెస్ లుక్ లో కళ్ళు తిప్పుకోలేని విధంగా అందంగా మెరిసారు.

ఇండియా టుడే (2012)

ఇండియా టుడే (2012)

2000ల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవితో పాటు ఆమె స్టైల్ స్టేట్ మెంట్ కూడా పరిణతి చెందాయి. ఇండియా టుడే 2012 పత్రిక సంచికలో కవర్ పేజీ లుక్ కోసం, ఆమె హాల్టర్ నెక్ బాడీకాన్ డ్రస్ మరియు హై హీల్స్ లో అబ్బురపరిచారు.

ఎల్’అఫీషియల్ (2013)

ఎల్’అఫీషియల్ (2013)

శ్రీదేవి ఆపాతమధురంగా నిలవటం మొదలుపెట్టాక అది ఒక అంతర్జాతీయ పత్రికలో తన యాటిట్యూడ్ లుక్ తో నిరూపించింది. ఎల్’అఫీషియల్ పత్రికలో ట్రెంచ్ డ్రస్ మరియు మ్యాచింగ్ నగలతో ఆమె చాలా అందంగా కన్పించారు.

వోగ్ ఇండియా (2013)

వోగ్ ఇండియా (2013)

2013 వోగ్ కవర్ సంచిక కోసం, శ్రీదేవి రెండు అద్భుత లుక్స్ లో దర్శనమిచ్చారు. కవర్ పేజీ కోసం ఆమె పౌడర్ పింక్ రఫుల్ డ్రస్ మరియు లోపలి కథనం లుక్ కోసం ఒక ఆలివ్ గ్రీన్ స్లీవ్ లెస్ డ్రస్ లో అలరించారు. ఆమె నిజంగానే యవ్వనంగా కన్పించారు.

వోగ్ ఇండియా (2015)

వోగ్ ఇండియా (2015)

వోగ్ ఇండియాలో మనీష్ మల్హోత్రా బ్రైడల్ 2015 కలెక్షన్ ప్రచురితమైంది. అందులో ఆలియా భట్, శిల్పాశెట్టి, కాజోల్, కరిష్మాకపూర్ మరియు కరీనా కపూర్, శ్రీదేవి వంటి అనేక బాలీవుడ్ తారలు పేస్టెల్ లేత రంగుల్లో తళుక్కుమన్నారు.

హాయ్ ! బ్లిట్జ్ (2016)

హాయ్ ! బ్లిట్జ్ (2016)

హాయ్! బ్లిట్జ్ పత్రిక కొందరు అద్భుతమైన అందం కల బాలీవుడ్ తారల చిత్రాలను ప్రచురించే పత్రిక. దాని 2016 సంచికలో శ్రీదేవి క్లాసీ ఒక భుజం ఉన్న మనీష్ మల్హోత్రా గౌన్ ధరించి కన్పించారు.

వర్వ్ మరియు ఫిల్మ్ ఫేర్ 2017

వర్వ్ మరియు ఫిల్మ్ ఫేర్ 2017

క్లాసిక్ మరియు ఎల్లప్పుడూ అందంగానే ఉండే శ్రీఫేవి 2017లో రెండు వేర్వేరు పత్రికల ముఖచిత్రాలుగా కన్పించారు. రెండూ పేరున్న పత్రికలే, రెండింటిలోనూ ఆమె అద్భుతమైన దుస్తులనే వేసుకున్నారు. వర్వ్ లో ఆమె కాపర్ సెక్విన్ డ్రస్ మరియు క్లాసీ తలకి చెందిన ఆభరణం ధరిస్తే, ఫిల్మ్ ఫేర్ కు అద్భుతమైన భుజాలు లేని నల్ల డ్రస్ వేసుకున్నారు.

ఫిల్మ్ ఫేర్ 2018

ఫిల్మ్ ఫేర్ 2018

ఆమె ఆఖరి పత్రిక కవర్ లుక్ ఫిల్మ్ ఫేర్ 2018 సంచికలో వచ్చింది. ఇందులో ఇతర నటీమణులైన కరీనా కపూర్, సోనం కపూర్, మరియు ఆలియా భట్ తో కలిసి కవర్ పేజీపై కన్పించారు. అందరూ సెక్విన్ దుస్తులు ధరించారు, శ్రీదేవి కూడా సెక్విన్ టుల్లె గౌన్ లో అలరించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    All-Time Best Magazine Coverages Of Sridevi

    All-Time Best Magazine Coverages Of Sridevi, Sridevi got featured in several magazines since 1980s and these are best coverages. Have a look.
    Story first published: Thursday, March 1, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more