For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐష్ లేదా కంగనా : మీకు ఎవరి హెయిర్ స్టైల్ దిమ్మ తిరిగేలా చేసింది ?

|

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్లో భాగంగా రెడ్ కార్పెట్ పై “రమీ కడి” ఆఫ్-షౌల్డర్ గౌన్ ధరించగా, కంగనా నల్లటి సవ్యసాచి చీరలో కెమరా కంటికి దర్శనమిచ్చారు.

ఈ ఇద్దరిలో, కేన్స్ అంటేనే ఆ హీరోయిన్ అన్నట్లు ఉండేది ఒకరైతే, మరొకరు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మొదటి అడుగు వేసిన సెలెబ్రిటీ. ఈ ఇద్దరూ, ఇంటర్నెట్ ట్రాఫిక్ ని హైజాక్ చేసి, అందరూ తమ వైపే చూసేలా చేయాలని భావించడం సబబేనా? అని అనిపించేలా హొయలొలకపోశారు. ఈ ఇద్దరు మరెవరో కాదు, ఒకరు కంగానా రనౌత్ అయితే మరొకరు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఫ్యాషన్ విమర్శకులు మరియు వారి అభిమానులు వీరి కాళ్ళకు సైతం నమస్కరించేలా ఈ కేన్స్ లో హడావుడి చేశారు మరి.

Ash Or Kangana: Whose Hairstyle Made You Go Gaga At Cannes 2018?

వారి అలంకరణల నుండి దుస్తులవరకు ప్రతి ఒక్క అంశంలోనూ ఎంతో జాగ్రత్తను కనపరచిన ఈ ఇద్దరు అందగత్తెలు, కేశాలంకరణలోనూ తమ ప్రత్యేక శైలిని వీడలేదు. ఈ సారి కేన్స్ ఫెస్టివల్లో వీరి కేశాలంకరణ మీదనే ఎక్కువ చర్చ జరిగింది అంటే, అతిశయోక్తి కాదు. వీరి వ్యక్తిత్వం ప్రతిబిoబించేలా, ఒకరిని ఒకరు తలదన్నేలా భిన్నమైన ప్రేరణతో కూడిన అలంకరణతో అందరికీ ఒక క్లాసిక్ టచ్ ఇచ్చారు. ఐశ్వర్యా, కంగనా కేశాలంకరణను డీకోడ్ చేసి, అప్పుడు డిసైడ్ చేద్దాం ఎవరి హెయిర్ స్టైల్ గొప్పదో.

Ash Or Kangana: Whose Hairstyle Made You Go Gaga At Cannes 2018?

1. కంగానా యొక్క వింటేజ్ కేశాలంకరణ

కంగానా రనౌత్, ఆమె తన కేన్స్ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన నల్లటి సవ్యసాచి చీరలో ప్రారంభించింది. మరియు ఆమె 50 మరియు 60 దశకాలలోఉన్న ఒకప్పటి బోఫంట్ కేశాలంకరణతో ఆమె సొగసైన రూపాన్ని ప్రదర్శించింది. ఆమె హెడ్లైన్స్-మేకింగ్ , జాన్ F. కెన్నెడీ యొక్క అందమైన భార్య, జాక్వెలిన్ కెన్నెడీ యొక్క శైలిని స్పురించేలా చాటుకుంది. ఈ వింటేజ్ లుక్ వెనుక ఆమె డిజైనర్ మరియు స్టైలిస్ట్ అయిన అమీ పటేల్ మరియు సంజయ్ కుమార్ దోహాలియా ఉన్నారు. ఆమె మేకప్ ఆర్టిస్ట్ బ్రెండన్ డీజీ కూడా ఎంతో మంది అమ్మాయిలు కోరుకుంటున్న ఈరూపాన్ని సాధించటానికి సహాయపడింది.

Ash Or Kangana: Whose Hairstyle Made You Go Gaga At Cannes 2018?

2. ఐశ్వర్య ఓరియంటల్ కేశాలంకరణ

ఐశ్వర్యరాయ్ బచ్చన్ యొక్క కేశాలంకరణ అబ్స్ట్రాక్ ఆర్ట్ (నైరూప్య కళ) ను పోలి ఉండేలా జాగ్రత్తను తీసుకుంది. “రమి కడి” ఆఫ్ షౌల్డర్ గౌన్లో, బన్ కేశాలంకరణతో ఇంటర్నెట్ ప్రపంచాన్నే షేక్ చేసేలా తయారయింది. 'కేన్స్ రాణి', ఐశ్వర్య యొక్క నూతనమైన కేశాలంకరణ వెనుక వల్ గార్లాండ్ మరియు స్టీఫెన్ లాన్జియన్ల వంటి వారున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఎంత నైపుణ్యాన్ని ఆ జుట్టులో పొందుపరిచారో. ఆమె చక్కగా చిత్రీకరించిన బన్నులో రేజర్ షార్ప్ వలె ఉన్న పదునైన తంతువులతో కూడి అబ్స్ట్రాక్ పెయింటింగ్ తలపించేలా రూపుదిద్దబడింది . మాస్టర్ పీస్ అంటే ఇదేనేమో మరి అని అనిపించేలా.

కావున ఈ ఇద్దరి కేశాలంకరణలలో ఎవరిది గొప్ప అని చెప్పడం మాకైతే కష్టమైన చర్యే? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.

English summary

Ash Or Kangana: Whose Hairstyle Made You Go Gaga At Cannes 2018?

Was it the debutant Kangana or the veteran Aishwarya, whose hairstyle made more impression,Aishwarya and Kangana let their hairs do the talking at Cannes 2018. While the debutant Kangana sported a vintage look channelling Jacqueline Kennedy's hairstyle, Aishwarya on the other hand sported an oriental-style neatly tied bun. Their respective hairdos were classic for a reason but had very different inspirations.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more