ప్రత్యర్ధులకు స్టైలిష్ లుక్ తో సమాధానం ఇచ్చిన కరీనా

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

నీలం రంగు స్టేట్మెంట్ పాంట్ సూట్ ధరించిన కరీనా కపూర్, ఇప్పటికీ బాలీవుడ్ దిగ్గజ తారల్లో, యువతకు ఫాషన్ ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

అందరూ ముద్దుగా బెబో అని పిలిచే కరీనా, తన రాబోయే చిత్రం “వీరే దీ వెడ్డింగ్” ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబాయిలో జరిగిన ఒక ఈవెంట్లో హాజరయింది. రాయల్ బ్లూ రంగు దుస్తులలో, కాంప్లిమెంట్ జాకెట్ ధరించి కార్ నుండి బయట అడుగుపెట్టిన బెబో చూపరులను కళ్ళు తిప్పుకోలేని విధంగా మంత్రముగ్ధులను చేసింది. బ్లేజర్లో పిన్ చేసిన గుండ్రని బంగారు పతకం, ఆకర్షణీయంగా కనిపించింది.

Bebo Gave It Back To Her Haters In The Most Stylish Way

తన హావభావాలతో, తన నడవడికలను ఏమాత్రం కోల్పోకుండా, ఒక బిడ్డకు తల్లైనా కూడా అందం చెక్కు చెదరని బెబో భారత దేశపు టిన్సెల్ టౌన్ ముంబాయి లోనే “హాటెస్ట్ మామ్” గా పేరు పొందింది.

అభిమానులను మత్తెక్కించే కళ్ళు కరీనా సొంతం, మరి ఆ కళ్ళకు ఇంకాస్త మేకప్ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది? గోధుమ రంగు అలల జుట్టుని లీవ్ చేస్తూ, మేకప్ టచ్ ఇచ్చిన కళ్ళతో మైమరపించే చూపులతో కెమరా కళ్ళ పడితే, క్లిక్ అనిపించకుండా ఉంటాయా.

Bebo Gave It Back To Her Haters In The Most Stylish Way

వోగ్ మాగజైన్ ఫోటో షూట్ లో బికినీతో దర్శనమిచ్చిన కరీనా ఫోటోలను, ఫోటోషాప్ ఫోటోలుగా పుకార్లు పుట్టించిన వారికి, ఈ కార్యక్రమానికి తన శరీరాకృతిని పరిచయం చేసే దుస్తులతో హాజరై దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది కరీనా. ఈ పరిస్థితి ఈ మద్య కిమ్ కర్దాషియన్ కూడా ఎదుర్కొంది.

తన పట్ల అయిష్టత చూపే వారికి, తన స్టైలిష్ ప్రదర్శనతో నోటికి తాళం వేసే కరీనా, మరో సారి తన అందాలతో చెక్ పెట్టింది.

తన ప్రెగ్నెన్సీ తర్వాత మొదటి సినిమా అయిన ఈ “వీరే దీ వెడ్డింగ్” ప్రచార కార్యక్రమంలో తన సహచర నటులైన సోనంకపూర్, స్వరభాస్కర్, మరియు షికా తల్సానియాతో కలిసి సందడి చేసింది.

Bebo Gave It Back To Her Haters In The Most Stylish Way

కరీనా మరియు సోనం :

ఈ కార్యక్రమంలో భాగంగా కరీనానే కాకుండా సోనం కపూర్ కూడా రాజకుమారి దుస్తులలో ఆకర్షణీయమైన స్లీవ్స్ తో కూడిన తెల్లటి వస్త్రాలతో కనిపించింది. కానీ కరీనాని తలదన్నలేకపోయింది అని ఒప్పుకోక తప్పదు. మరియు సహాయ నటి నుండి “నిల్ బాటరీ సనాటా” తో ఉత్తమ నటిగా మారిన స్వర భాస్కర్ నిర్మాణాత్మక పింక్ రంగు దుస్తులలో కనిపించగా, షికా తెల్లని షర్ట్, ప్లేయిడ్ స్కర్ట్ ధరించి ఆకర్షణీయంగా కనిపించారు.

ఈ గాంగ్ లో ప్రతిఒక్క నటి ఎంతో స్టైలిష్ గా హుందాగా కనిపించారు. కానీ వీరందరిలో కరీనా ఒక మెరుపులా కనిపించింది. ఈ అందాల నటి కొత్త చిత్రం “వీరే దీ వెడ్డింగ్” మంచి విజయాన్ని అందుకోగలదని ఆశిద్దాం.

English summary

Bebo Gave It Back To Her Haters In The Most Stylish Way

In a blue, statement pant-suit, Kareena Kapoor Khan proved that she is still the 'Poo' of Bollywood that young girls looked up to for fashion inspiration.