నిధి నుంచి తమన్నావరకు ; లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 లో షోస్టాపర్లుగా మేటిగా తయారయిన సెలబ్రిటీలు

By: Deepthi TAS
Subscribe to Boldsky

నిధి నుంచి తమన్నావరకు ; లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 లో షోస్టాపర్లుగా మేటిగా తయారయిన సెలబ్రిటీలు

నిన్న రాత్రి ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2018 ముగిసింది, ఏడాదికి రెండుసార్లు జరిగే ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఉన్న మేటి డిజైనర్లకి తమ స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్లను ప్రదర్శించే ఫ్యాషన్ వేదికగా నిలిచింది.

డిజైనర్ల అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించటానికి అనేకమంది తారలు షోస్టాపర్లుగా తమ మేటి లుక్స్ లో అందంగా కన్పించారు. లాక్మే ఫ్యాషన్ వీక్ రిసార్ట్ 2018 లో మేటిగా కన్పించిన బాలీవుడ్ సెలబ్రిటీ షోస్టాపర్ల లిస్టును మేము మీకోసం తీసుకొచ్చాం. చదవండి.

నిధి అగర్వాల్

నిధి అగర్వాల్

శ్లోకా సుధాకర్ డిజైన్ చేసిన పేస్టెల్ పింక్ లెహంగా చోళీ మరియు నీలి ఎంబెలిష్డ్ బ్లౌజ్ లో నిధి ర్యాంప్ పై నడుస్తూ చాలా అందంగా కన్పించారు. లెహంగాలో హుందాగా నడిచిన ఆమె, మ్యాచింగ్ అయ్యే ఇయర్ లూప్స్ మరియు గాజులు కూడా ధరించి భారతీయ పెళ్ళికూతురు లుక్ ను ప్రదర్శించారు.

దిశా పటానీ

దిశా పటానీ

డిజైనర్ శ్రియ సోమ్ కి షో స్టాపర్ గా దేవతలా కన్పించే దిశా పటానీ, ఫుల్లీ టైయర్డ్ రఫుల్డ్ బార్డోట్ గౌన్ లో మెరిసారు. ఈ హాఫ్ వైట్ రంగు గౌన్ ధరించటంతో దిశా పువ్వుల రాణిగా కన్పించారు. ర్యాంప్ పై ఎంతో అమరికగా, స్థిరంగా నడిచిన ఆమె ప్రతి విషయంలో మనల్ని ఆకట్టుకున్నారు.

తమన్నా భాటియా

తమన్నా భాటియా

అనుష్కా రెడ్డి డిజైన్ చేసిన చాలా ప్రత్యేకమైన లెహంగాలో తమన్నా భాటియా ర్యాంప్ పై నడిచారు. ఆమె టైయర్డ్ భుజాలు లేని లెహంగాను ధరించారు, దాని మీద అంతా పువ్వుల డిజైన్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ సెట్ లో ఎంబెలిష్ చేసిన ట్యుల్లె దుప్పట్టా కూడా వచ్చింది. నటి ఈ దుస్తుల్లో చాలా అందంగా కన్పించారు.

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి

అల్లావుద్దీన్ ఖిల్జీ భార్య మెహరున్నీసాగా అదితి యొక్క అందమైన, అద్వితీయ రూపం మనల్ని ఇప్పటికే మంత్రముగ్థులను చేసింది. ఇప్పుడు కూడా ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ కి అలాంటి లుక్ నే ఎంచుకున్నారు. పాయల్ సింఘాల్ షో స్టాపర్ గా నడిచిన ఆమె అద్భుతమైన ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా చోళీలో చాలా అందంగా కన్పించారు.

కృతి సానన్

కృతి సానన్

తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ఫ్లోరల్ పేస్టెల్ లెహెంగా చోళీ సెట్ లో కృతి కూడా ఆకట్టుకున్నారు. ఆమె ర్యాంప్ పై హుందాగా నడుస్తూ, తన అద్భుత స్టైల్స్ ను ప్రదర్శిస్తూ అలరించారు. షో తర్వాత కూడా ఆమెకు పేస్టెల్ షేడ్లున్న దుస్తులంటే చాలా ఇష్టమని తెలిపారు.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

కరణ్ జోహార్ తనకు నచ్చినవి వేసుకోటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, కొన్నిసార్లైతే ఆయన మరీ విచిత్రమైన బట్టలు కూడా వేసుకున్నారు. ఈ సారి అలాంటిది ఏమీ వేసుకోలేదు, మా అందరికీ బాగా నచ్చింది కూడా. ఫాల్గుని అండ్ షేన్ పీకాక్ డిజైన్ చేసిన సెక్విన్ మెటాలిక్ లుక్ చాలా నప్పింది మరియు అతను చాలా అందంగా కన్పించారు.

English summary

Best-Dressed Celebrity Showstoppers At The Lakme Fashion Week

Lakme Fashion Week Summer Resort 2018 got a wrap last night in Mumbai and the bi-annual fashion event gave another platform for ace designers across the country to showcase their Spring/Summer collections. To celebrate the amazing styling collection of the designers, there were many celebrity showstoppers who had hit the ramp in some gorgeous style books.
Story first published: Tuesday, February 6, 2018, 15:00 [IST]
Subscribe Newsletter