మిస్ వరల్డ్ టూర్ లో మానుషీ చిల్లర్ బెస్ట్ లుక్స్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మిస్ వరల్డ్ టూర్ లో పాల్గొంటున్న మానుషీ చిల్లర్ రక రకాల స్టైల్స్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. ఒక ఇండియన్ ఈ టూర్ లో పాల్గొని దాదాపు 17 సంవత్సరాలైంది. 2000లో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందింది. 17 సంవత్సరాల తరువాత మానుషీ ఆ కిరీటాన్ని మళ్ళీ మన దేశానికి తీసుకువచ్చింది. ఇది దేశానికి నిజంగా గర్వకారణం.

మిస్ వరల్డ్ టూర్ లో భాగంగా మానుషీ వివిధ దేశాలను చుట్టి వచ్చింది. ఈ టూర్ లో ఈ బ్యూటీ కాంటెస్ట్ కి చెందిన మిగతా ఫైనలిస్ట్ లు కూడా పాల్గొన్నారు.

ఈ టూర్ కోసం మానుషీ వివిధ స్టైల్స్ లో మెరిసింది. వాటిలో కొన్ని బెస్ట్ లుక్స్ ని మీకోసం ఇక్కడ పొందుబరిచాము.

మనోహరమైన సెక్విన్

మనోహరమైన సెక్విన్

సునైనా ఖేర్వా చే డిజైన్ చేయబడిన ప్లాంజ్ క్రాప్డ్ హాల్టర్ సెక్విన్ గౌన్ ను ధరించింది మానుషీ. ఈ వైన్ రెడ్ బాడీ కాన్ గౌన్ లో మానుషీ మరింత అందంగా కనిపించింది. ఈ అటైర్ కి ఇషార్య ఇయర్ రింగ్స్ ను అలాగే బ్యాంగిల్ ను మ్యాచ్ చేసింది. న్యూడ్ ఐస్ అలాగే డార్క్ రెడ్ లిప్స్ తో ఈ లుక్ మరింత అదిరిపోయింది.

కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ

వాల్డ్రిన్ సాహితీ చే డిజైన్ చేయబడిన గోల్డెన్ గౌన్ ను ధరించిన మానుషీ కుందనపు బొమ్మలా తళుక్కుమంది. ఈ లుక్ ని క్యారీ చేయడంలో మానుషీ సక్సెస్ అయింది. సెక్విన్ బాల గౌన్ తో మెరిసే ఇయర్ రింగ్స్ ని మ్యాచ్ చేసింది. ఈ మెరుపుల అటైర్ లో తారలా మెరుస్తూ అందాల తార మరింత అందంగా మెరిసిపోయింది.

స్విమ్ సూట్ తో యూత్ ను ఆకట్టుకున్న మానుషీ

స్విమ్ సూట్ తో యూత్ ను ఆకట్టుకున్న మానుషీ

ఈ టూర్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ వద్ద స్విమ్మింగ్ బాడీ సూట్ ను ధరించింది ఈ అందాల రాశి. ఈ మెష్ బ్లాక్ స్విమ్మింగ్ బాడీ సూట్ లో హాట్ గా అలాగే మరింత అందంగా కనిపించింది. సన్ బాస్కింగ్ లో లీనమై సూపర్ హాట్ పిక్చర్ కోసం మంచి స్టిల్ ని ఇచ్చింది.

ఎథెరల్ గ్రీన్

ఎథెరల్ గ్రీన్

మిస్ వరల్డ్ టూర్ లో మానుషీ కి సంబంధించిన ఈ లుక్ గురించి మన ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎంబ్రాయిడరీ చేయబడిన ఆక్వా గ్రీన్ షరారా సూట్ లో మానుషీ అద్భుతంగా కనిపించింది. వరుణ్ బాహ్ల్ కౌతుర్ కి చెందిన ఈ డ్రెస్ మానుషీ అందాన్ని మరింత పెంచేందుకు తోడ్పడింది. ఈ లుక్ ను అద్భుతంగా క్యారీ చేసిన మానుషీ స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది.

ఫస్ట్ టూర్ లుక్

ఫస్ట్ టూర్ లుక్

మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఆ పర్పస్ టూర్ ని ప్రారంభించడానికి ముందు హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు మానుషీ లుక్ ఇదే. ఆ సమయంలో హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే కి చెందిన ఆఫ్ వైట్ మినీ డ్రెస్ ని ధరించింది మానుషీ. యూరము జ్యువలరీని ఈ అటైర్ కి మ్యాచ్ చేసింది.

పెర్ఫెక్ట్ ట్రావెల్ అవుట్ ఫిట్

పెర్ఫెక్ట్ ట్రావెల్ అవుట్ ఫిట్

టూర్ కి ముందు జర్నీ కోసం మానుషీ ధరించిన ఈ డ్రెస్ ఒక బెస్ట్ అవుట్ ఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగే ఈ లుక్ లో మానుషీ ఎమేజింగ్ గా కనిపించింది. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ పై స్ట్రిప్డ్ కళోట్స్ మరియు బ్లాక్ హీల్స్ ను మ్యాచ్ చేసింది. ఈ లుక్ అనేది స్టన్నింగ్ గా ఉంది. మలిబు తీరం వద్ద ఈ లుక్ ని క్యాప్చర్ చేశారు.

English summary

Best Looks Of Manushi Chillar From Miss World Tour

Manushi Chillar was recently a part of Miss World World Tour and it is after 17 years, an Indian has been a part of this tour. In the Miss World Tour, Manushi went around different parts of the country with the other finalists of the prestigious beauty contest. For the tour, Manushi wore some super-amazing style books and we have picked up the best of the lot.
Story first published: Thursday, February 22, 2018, 15:00 [IST]