'నేషనల్ క్రష్' అద్భుతమైన ఫ్యాషన్ ఐకాన్ కూడా; ప్రియా ప్రకాష్ వర్రియర్ మేటి స్టైల్ లుక్స్

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

రాత్రికిరాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన మోడల్ మరియు నటి ప్రియా ప్రకాష్ వర్రియర్ అద్భుతమైన స్టైల్ స్టేట్ మెంట్ తో అలరిస్తున్నారు. ఆమె వృత్తి మోడలింగ్ మరియు నటనకి తగ్గట్టుగా స్టైల్ గా వుండటం కూడా ఆమె వృత్తిలో చాలా ముఖ్యమైన విషయం, ఈ 18 ఏళ్ళ టీనేజ్ నటి ఫ్యాషన్ దిగ్గజాలకి తక్కువ ఏం తీసిపోవట్లేదు.

priya prakash varrier best style books

మేము ఆమె కొన్ని స్టైల్స్ ను కలిపి, కేవలం కన్నుగీటటం వలనే కాదు, ఈ 'జాతీయ క్రష్' గా మారిన ప్రియా ప్రకాష్ వర్రియర్ లో, అంతకుమించి తనను తాను స్టైలింగ్ కూడా అద్భుతంగా చేసుకుని ప్రెజెంట్ చేసుకునే కళ ఉన్నదని మీకు ఈ ఆర్టికల్ చదివితే నిరూపణ అవుతుంది.

మనం ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం.

కంటిచూపు మరియు స్టైలింగ్

కంటిచూపు మరియు స్టైలింగ్

ప్రియ ముఖ్యంగా తన కంటితో భావాలు పలికించడం మరియు కనుబొమ్మలను కదపటంతో చాలామందిని పడేసింది. ఈ లుక్ లో, ఆమె సెమీ ఫార్మల్స్ జతలో చెక్స్ ఉన్న తెల్ల షర్టు మరియు చిరిగిన జీన్స్ వేసుకున్నారు. ఈ లుక్ లో కంటి ఎక్స్ ప్రెషన్ చాలా అందంగా ఉంది.

చక్కని మిక్స్ అండ్ మ్యాచ్

చక్కని మిక్స్ అండ్ మ్యాచ్

సెమీ ఫార్మల్స్ తో పాటు, ఆమె మరో ఫోటోకి కూడా పోజిచ్చింది, ఒక చాంబ్రే క్రాప్ జాకెట్, ఒక బీజె టోటె బ్యాగ్ మరియు నల్ల షూల జతతో కలిపి ధరించింది. ఈ పూర్తి దుస్తులు మరియు అదనపు బట్టల కాంబినేషన్ అందర్నీ మెప్పించింది అందుకే ఆమెకి ఫ్యాషన్ ఐకాన్ అనే టైటిల్ ను మనందరం ఇవ్వవచ్చు.

సమ్మెరీ రాణి

సమ్మెరీ రాణి

ఒక మోడలింగ్ అసైన్ మెంట్ కోసం, ప్రియ ఈ అద్భుతమైన పువ్వుల సమ్మెరీ డ్రస్ ధరించి ర్యాంప్ పై నడిచారు. ఆమె ఈ సెక్సీ మరియు పువ్వుల ప్రింటెడ్ సమ్మెరీలో చాలా స్టైల్ గా, హుందాగా కన్పించారు. ఆమె ఈ లుక్ కి మరింత అందం తేవడానికి కొన్ని పువ్వులను కూడా పెట్టుకున్నారు.

మలయాళీ దివాగా అలరించారు

మలయాళీ దివాగా అలరించారు

ఈ కేరళ బంగారు బోర్డర్ ఉన్న,చేతి పెయింట్ కళ ఉన్న కాటన్ చీరలో, ప్రియ చాలా అందంగా కన్పించారు. ఆమె అద్దాలు పొదిగిన పసుపుపచ్చ కాటన్ బ్లౌజ్ మరియు మ్యాచింగ్ నగలు ధరించారు. ఈ నగలలో రంగురంగుల గాజులు, జుంకాలు, నత్తు కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఆమె తలపై పువ్వులను ధరించారు.

అందాలపోటీని గెలవటం

అందాలపోటీని గెలవటం

ఒక అందాల పోటీ ఫైనల్స్ కి, ప్రియ ఇంతకుముందులాంటి కేరళ కాటన్ చీరనే ధరించారు, దీనికి కూడా అవే బంగారు జరీ ఉన్నది. దానితోపాటు, ఆమె మ్యాచింగ్ నగలు మరియు మలయాళీలు పెట్టుకునే ఎర్ర బిందీ పెట్టుకున్నారు. ఆమె పోటీ గెలిచారు,అందులో ఎవరికీ ఏ సందేహం లేదు. విజేతగా ఆమె ధరించిన బంగారు కిరీటం ఆమె లుక్ ను మరింత అందంగా మార్చింది.

పోటీ తర్వాత ఫోటో షూట్

పోటీ తర్వాత ఫోటో షూట్

ఆమె ఇక్కడ కూడా అదే లుక్ లో కన్పించారు మరియు మనం ఇక్కడ కేరళ చీరతో కలిపి వేసుకున్న అందమైన బ్లౌజ్ పై కళను దగ్గరగా పరిశీలించవచ్చు. మెష్ ఉన్న బంగారు బ్లౌజ్ కి బంగారు జరీతో ఎంబెలిష్మెంట్'స్ ఉండి బ్లౌజ్ ను అందంగా మార్చి, ప్రియను మరింత అందంగా కన్పించేట్టు చేసింది.

భరతనాట్యం అలంకరణ

భరతనాట్యం అలంకరణ

అద్భుతమైన నటి, మోడల్ మాత్రమే కాక, ప్రియ శాస్త్రీయ నృత్యకారిణి కూడా, భరతనాట్యం నేర్చుకున్నారు. ఇక్కడ ఆమె భరతనాట్యం దుస్తులను ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా వేసుకుని, మ్యాచింగ్ నగలు, మేకప్ తో మరింత అందంగా కన్పించారు.

ప్రియ వెస్ట్రన్ దుస్తుల్లో లేదా సాంప్రదాయ అవతారంలో ఎందులో ఎక్కువ బాగున్నారు? మాకు తెలపండి.

English summary

Best Style Books Of Priya Prakash Varrier

Priya Prakash Varrier, the model and actress who turned into an internet sensation overnight, has got an amazing style statement. Catering to her profession of a model and an actress, being in style matters the most and this 18-year-old teenager actress is no less than a fashionista. We have combined a few of her best style books.