తన సినీప్రయాణంలో హృతిక్ రోషన్ పోషించిన మేటి స్టైలిష్ అవతారాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఈరోజు 'గ్రీక్ గాడ్' హృతిక్ రోషన్ పుట్టినరోజు ! తన డాన్స్ నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకోవటం నుంచి నటనకి ప్రశంసల వరకు, అతను బాలీవుడ్ లో పెద్ద స్టైల్ ఐకాన్.

best stylish avatars adopted by hrithik roshan

21శతాబ్దంలో పెరిగిన యువకులందరూ అప్పట్లో అతని అద్భుతమైన స్టైల్ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం మరియు రాబోయే తరాలలో కూడా ఆయన ఒక స్టైల్ సెన్సేషన్ గా మారతాడని అప్పుడే అందరూ సులభంగా ఊహించారు.

అతను ఇప్పటికి కూడా ప్రతి స్త్రీ కోరుకునే ఫర్ఫెక్ట్ స్టైల్ తో ఉండే వ్యక్తిగానే ఉన్నారు మరియు ఇప్పటికీ అమ్మాయిలందరికీ అతనంటే క్రేజ్.

అతను ఎప్పుడూ పద్దతిప్రకారం నటనకే ఓటేస్తూ, వివిధ పాత్రలకి తగ్గట్టు స్టైల్స్ ను మార్చాలనే సిద్ధాంతంతో ఉంటాడు. తన నటన జీవితంలో ఇప్పటివరకూ వివిధ చిత్రాలకు ఆయన పాటించిన వివిధ స్టైల్ మార్గాలను లోతుగా పరిశీలిద్దాం.

కహో నా ప్యార్ హై

కహో నా ప్యార్ హై

తన అద్భుత నటన, డాన్స్, స్టైల్ నైపుణ్యాలతో అమ్మాయిలకి పిచ్చి ఎక్కిస్తూ హృతిక్ తన మొదటిచిత్రంతో ముందుకొచ్చాడు. ‘ఏక్ పల్ కా జీనా' పాట రిలీజ్ అయ్యాక చాలా వారాల పాటు, నెలల పాటు స్పీకర్లను హోరెత్తించిందంటే ఆశ్చర్యం లేదు. ఆ పాటలో హృతిక్ తలకి కట్టుకున్నటువంటి బ్యాండ్, హృతిక్ -స్టైల్ కళ్లద్దాలు ఆ సమయంలో చాలా ప్రాచుర్యం పొందాయి.

ఇంకా, ఆ సినిమాలోనే రోహిత్ లా ఉండే రాజ్ లుక్స్ కూడా, అతని రంగురంగుల లెదర్ జాకెట్లు, రిమ్ లేని కళ్లద్దాలు ఆ సమయంలో చాలా ట్రెండీగా ఉన్నాయి.

కైట్’స్

కైట్’స్

బాక్సాఫీసు వద్ద ఎలా తన హవా చూపించిందో ఎక్కువ చెప్పలేం కానీ స్పానిష్ సంస్కృతిని చక్కగా తీసుకుని అందంగా మలచిన చిత్రం ఇది. హృతిక్ సామాన్య స్పానిష్ యువకుడు ఎలా ఉంటాడో అలా మారిపోయి, ఎంబ్రాయిడరీ చేసిన చొక్కాలు,పైన గీతలున్న ప్యాంట్లతో అలరించాడు. అందంగా ఉన్నాడు కదా?

జోధా-అక్బర్

జోధా-అక్బర్

ఎ, ఆశుతోష్ గోవారికర్ చిత్రం మరియు బి,గ్రాండ్ గా రాజరిక దుస్తుల్లో స్టైల్ స్టేట్మెంట్లు ఇచ్చిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ (జోధా) మరియు హృతిక్ రోషన్ ( అక్బర్), మనం దాదాపు మూడున్నర గంటల పాటు అలా నోరుతెరుచుకు చూస్తూనే ఉండిపోయాం. డిజైనర్ నీతా లుల్లా ఇద్దరు నటులకి బట్టలు డిజైన్ చేసారు. హృతిక్ ను రాజరిక దుస్తుల్లో చూసి, మనకు నోట మాట రాలేదు, కదా?

నీతా లుల్లా డిజైన్ చేసిన ‘రాజ్ పోషక్స్' నుంచి తనిష్క్ వారి అందమైన నగల కలెక్షన్ వరకు, అన్నీ హృతిక్ ను ఎప్పటికన్నా ఎక్కువగా అందంగా ఆకర్షణీయంగా మార్చేసాయి.

ధూమ్ 2

ధూమ్ 2

ఈ చిత్రంలో హృతిక్ లుక్స్ గురించి మాట్లాడటం మొదలుపెడితే శతాబ్దాలు గడిచిపోతాయేమో. తన పాత్ర అసలు రూపాన్ని దాచటానికి అతను ఇందులో అనేక పాత్రలు పోషిస్తాడు. మా కళ్ళకి కట్టినవి వాటిల్లో, చొక్కా లేని బనియన్లు, షర్టులు, ప్రింట్లతో వున్న తల బ్యాండ్లు ,మరియు స్టోన్ తో ఎంబెలిష్ చేసిన ప్యాంట్లు. వీటిల్లో ప్రతీదీ చిత్ర రిలీజ్ సమయంలో స్టైల్ ఐకాన్స్ గా మారిపోయాయి.

లక్ష్య

లక్ష్య

ఈ చిత్రం హృతిక్ కెరీర్లోనే బెంచ్ మార్క్ మాత్రమే కాదు, ఒక యువకుడైన సైనికుడిగా నటించడానికి ఆయన తన పూర్తి అవతారాన్ని మార్చుకోవాలసి వచ్చింది. ఈ చిత్రంలోని ఒక పాట కోసం, హృతిక్ కస్టమ్ స్టైల్డ్ జుట్టు మరియు మెటాలిక్ ప్యాచ్ లతో కూడిన పాంట్లు మరియు తెల్లని టి షర్ట్ ధరించారు.

క్రిష్

క్రిష్

పెద్ద స్టైలిష్ కాదు కానీ, హృతిక్ క్రిష్ సినిమా కోసం మళ్ళీ ఒక పూర్తి భిన్నమైన రూపాన్ని ఎంచుకున్నారు. ఆయన సూపర్ హీరో నల్ల బట్టలు వేసుకున్నారు. ఈ వినైల్ గ్లాసీ దుస్తులు హృతిక్ కి బాగా నప్పాయి, అతన్ని సరిగ్గా భారతీయ సూపర్ హీరోని చేసాయి. ఈ లుక్ కి మాస్క్,అతని మార్కుగా జత కలిసింది.

ఈ చిత్రం విడుదల అయినప్పుడు, పిల్లలు క్రిష్ స్టైల్ కోసం వెంపర్లాడిపోయారు, చాలామంది తమ తల్లిదండ్రుల చేత ఆ క్రిష్ బట్టలను కొనిపించారు కూడా !

గుజారిష్

గుజారిష్

ఆఖరిది కానీ ముఖ్యమైనది, పక్షవాతంతో చచ్చుబడిన ఒక ఆంగ్లో ఇండియన్ వ్యక్తిగా గుజారిష్ చిత్రంలో హృతిక్ వేసిన పాత్ర, ఆ పాత్రకే కాదు, స్టైల్ స్టేట్ మెంట్ కి కూడా తను న్యాయం చేసాడు. అతను ఆంగ్లో స్టైల్డ్ దుస్తులను, బౌ టైలను నిజమైన ఒక ఆంగ్లో ఇండియన్ ఎలా ఉంటారో అలాంటి బాడీలాంగ్వేజ్ తో, హుందాగా అది కూడా వికలాంగుడి పాత్రను పోషిస్తూ, హృతిక్ నిజంగా అలరించారు.

ఈ చిత్రాలు హృతిక్ కెరీర్లో వివిధ మైలురాళ్ళుగా నిలిచిపోయాయి మరియు ఇప్పుడు మరియు తర్వాతి తరాల వారికి కూడా అతను అభిమాన స్టైల్ ఐకాన్ గానే నిలిచిపోతాడు.

English summary

Best Stylish Avatars Adopted By Hrithik Roshan

It is the 'Greek God' Hrithik Roshan's birthday. From winning hearts with his dancing skills to his acting accolades, he is also one of the biggest style icons of B-Town. Let us take a detailed look at Hrithik's different style statements adopted for different movies.