For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీదేవి జయంతి : బాలీవుడ్ మూవీస్ లో స్టన్నింగ్ స్టయిల్ తో ఆకట్టుకున్న శ్రీదేవి

నేడు శ్రీదేవి జయంతి : బాలీవుడ్ మూవీస్ లో స్టన్నింగ్ స్టయిల్ తో ఆకట్టుకున్న శ్రీదేవి

|

"సిరిమల్లె పువ్వా" అంటూ తన అందంతో యావత్ సినీ ప్రపంచం ప్రశంసలు అందుకున్న అందాలతార నింగికెగసిపోయింది. తన హొయలుతో ఆకట్టుకున్న శ్రీదేవి స్టయిల్ ను ప్రశంసించని వారు ఉండరు. శ్రీదేవికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా శ్రీదేవి గురించి మాట్లాడుతూ శ్రీదేవి ప్రతి సినిమా స్టైల్ కి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్పిస్తుందని అభిప్రాయపడ్డారు. శ్రీదేవితో వర్క్ చేసిన ఈ డిజైనర్ వ్యక్తపరిచిన అభిప్రాయం సరైనదే అని శ్రీదేవి స్టయిల్ ను మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. లౌడ్ మరియు వైబ్రెంట్ అవుట్ ఫిట్స్ తో పాటు మ్యూటేడ్ ఎలిగెంట్ షేడ్స్ తో శ్రీదేవి ఫ్యాషన్ ప్రపంచాన్ని రాణిలా ఏలింది. ఎంతో మంది మహిళలకు స్టయిల్ ఐకాన్ గా నిలిచింది. ఎంతో మంది డిజైనర్స్ కు చక్కటి ఇన్స్పిరేషన్ లా నిలిచింది.

ఆమె నటించిన చివరి చిత్రం వరకు స్టయిల్ గురించి ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందనే చెప్పుకోవాలి. ఎలిగెంట్ మరియు సింపుల్ లుక్స్ ను ఎంతో కాన్ఫిడెంట్ గా క్యారీ చేసింది. శ్రీదేవి ఎన్నో పాత్రలను పోషించింది. ఆ పాత్రలకు తగినట్టుగా తన అపియరెన్స్ ను తీర్చిదిద్దుకుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ను అర్థం చేసుకుని తనని తాను పాత్రకు తగినట్టుగా మరల్చుకుంది. తన వృత్తి పట్ల అంతటి నిబద్దత కలిగిన శ్రీదేవి నేటి హీరోయిన్స్ కి కూడా స్టయిల్ విషయంలో అలాగే నటన విషయంలో ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడైతే, యూట్యూబ్ వంటి కొన్ని మాధ్యమాలలో మేకప్ కి సంబంధించిన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో కూడా శ్రీదేవి అప్పటి హీరోయిన్స్ లలో ప్రత్యేకంగా నిలవడానికి అనేక రకాల స్టైల్స్ ను క్యారీ చేసింది. ఆమె అతిలోక సుందరిగా ప్రేక్షకుల మన్ననలు పొందటానికి ఆమె స్టైల్ ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. ఆమె ఎన్నో రకాల పాత్రలను పోషించింది. సినిమాలలో ఆమె ఫ్రేమ్ లోకి ఎంటర్ అవగానే ఆమె నుంచి చూపు మరల్చుకోవడం కష్టతరమని చెప్పుకోవచ్చు. ఆమె ఎంతో తేజస్సుతో వెండితెరలో కనిపించేది. అందుకే, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Birthday Special: Sridevis Stunning Style Transformation In Bollywood Movies

నేడు శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా శ్రీదేవి నటించిన కొన్ని బాలీవుడ్ సినిమాల లిస్ట్ ను ఇక్కడ పొందుపరిచాము. వాటిలో, శ్రీదేవి అవుట్ ఫిట్స్ గురించి ఆమె స్టైల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం.

శ్రీదేవి నటించిన చిత్రాలు

శ్రీదేవి నటించిన చిత్రాలు

జూలీ (1975)

శ్రీదేవి టీనేజ్ నుంచే స్టయిల్ ను తనలోని భాగంగా చేసుకుందనడంలో ఆశ్చర్యం లేదు. శ్రీదేవి మొదటి బాలీవుడ్ మూవీ "జూలీ". ఈ సినిమాతో బాలనటిగా బాలీవుడ్ లో ప్రవేశించింది. సింపుల్ స్వేటర్స్ మరియు మ్యాచింగ్ రిబ్బన్స్ తో బేబీ శ్రీదేవి క్యూట్ గా అలాగే బ్యూటిఫుల్ గా కనిపించింది.

హిమ్మత్వాలా (1983)

హిమ్మత్వాలా (1983)

"హిమ్మత్వాలా" అనేది శ్రీదేవి కెరీర్ లో రిమార్కబుల్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో, శ్రీదేవి వివిధ రకాల అవుట్ ఫిట్స్ ను ధరించింది. డ్యాన్సర్ అవుట్ ఫిట్స్ ను కూడా ధరించింది. వాటిలో శ్రీదేవి అత్యంత మనోహరంగా కనిపించింది. ప్రతి లుక్ ను ఎలిగెంట్ గా క్యారీ చేసింది. మ్యాచింగ్ యాక్ససరీస్ తో ఆమె లుక్ అనేది మరింత ఎలివేట్ అయింది.

మిస్టర్ ఇండియా (1987)

మిస్టర్ ఇండియా (1987)

ఈ సినిమాతో శ్రీదేవికి అన్ని వయసుల వారు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇందులోని స్టోరీ లైన్ కి అంతటి పటుత్వం కలిగి ఉంది. స్టోరీ లైన్ కి తగిన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది శ్రీదేవి. అంతేకాక, పాత్రకు తగిన కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ తో శ్రీదేవి తనలో సహజంగానే ఇమిడిపోయిన స్టైల్ ను వెలికితీసింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని "హవా హవాయి" మరియు "కాటే నహీ కాటాటే" అన్న పాటలు ప్రాచుర్యంలోనే ఉన్నాయి. ఈ పాటల్లో శ్రీదేవి అవుట్ ఫిట్స్ ని గమనించారా? శ్రీదేవి స్టయిల్ స్టన్నింగ్ గా ఉంది కదా?

చాందినీ (1989)

చాందినీ (1989)

శ్రీదేవి బాలీవుడ్ కెరీర్ లో "చాందినీ" సినిమా అత్యంత ప్రత్యేకమైనది. ఇందులో భాను అథైయ మరియు లీనా దారుచే డిజైన్ చేయబడిన అనేక రకాల అవుట్ ఫిట్స్ ను శ్రీదేవి ధరించింది. అథైయ ఈ చిత్రానికి గాను బెస్ట్ డిజైనర్ అవార్డును కైవసం చేసుకుంది. డిజైనర్ నీతా లల్లా కూడా ఈ చిత్రానికి శ్రీదేవి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి అసిస్టెన్స్ ఇచ్చింది.

చాలా బాజ్ (1989)

చాలా బాజ్ (1989)

శ్రీదేవి ఈ చిత్రంలోని తన నటనకు గాను అనేక ప్రశంసలను పొందింది. ఇందులో శ్రీదేవి తన కెరీర్ లోనే బెస్ట్ గా కనిపించింది. బెస్ట్ లుక్స్ తో అలరించింది. ఆఫ్ షోల్డర్ డ్రెసెస్ నుంచి ఫ్లోరల్ ప్రింటెడ్ శారీస్ వరకు శ్రీదేవి అత్యంత సుందరంగా కనిపించింది. ఈ సినిమాలో డబుల్ రోల్ పోషించిన శ్రీదేవి రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ ని తన అవుట్ ఫిట్స్ మరియు హావభావాల ద్వారా స్పష్టంగా తెలియచేసింది.

నాగిన (1986 మరియు 1989) :

నాగిన (1986 మరియు 1989) :

"నాగిన" సీక్వెల్ లో శ్రీదేవి కనబరచిన ప్రతిభ అనిర్వచనీయం. ఆమె ప్రతిభ ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోతుంది. 80స్ కి సంబంధించిన రాయల్ అవుట్ ఫిట్స్ లో ఆమె అందంగా ఇమిడిపోయింది. ఈ మూవీ సీక్వెల్ లో వివిధ రకాల స్టైల్ బుక్స్ ని కనబరిచింది. ఈ మూవీలో ట్రెడిషనల్ అట్టైర్స్ తో మరింత ఆకట్టుకుంది శ్రీదేవి.

లమ్హే (1991)

లమ్హే (1991)

శ్రీదేవి కెరీర్ లోని ఇది ఒక ఉత్తమ చిత్రం. లమ్హే 90ల ప్రారంభంలో విడుదలయింది. శ్రీదేవి ఈ సినిమాలో స్టయిల్ బుక్స్ ను అందంగా క్యారీ చేసింది. ఆ సమయానికి సంబంధించిన స్టైల్ ఇప్పటికీ అందరికీ గుర్తుండటమే ఇందుకు ఉదాహరణ. 20వ శతాబ్దపు లుక్స్ ను కూడా అతిలోక సుందరి ఎలిగెన్స్ తో పాటు స్టైల్ తో క్యారీ చేసింది.

ఇంగ్లీష్ వింగ్లిష్ (2012)

ఇంగ్లీష్ వింగ్లిష్ (2012)

దాదాపు 15 ఏళ్ళ విరామం తరువాత శ్రీదేవి మళ్ళీ వెండితెరను "ఇంగ్లీష్ వింగ్లిష్" అనే మూవీతో పలకరించింది. తన అద్భుత నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకులను అలరించడమే కాక మహారాష్ట్రకు చెందిన మహిళగా డిఫెరెంట్ స్టైల్ లో శారీస్ ను కట్టుకుంది.

మామ్ (2017)

మామ్ (2017)

ఈ సినిమా శ్రీదేవి ఆఖరి చిత్రం. ఇందులో శ్రీదేవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. కూతురి కోసం పోరాడే తల్లిగా ఈ చిత్రంలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఇది శ్రీదేవి కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీలో శ్రీదేవి ధరించిన అవుట్ ఫిట్స్ అనేవి ఫ్లాషీగా లేవు. అత్యంత సాధారణంగానే ఉన్నా వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంది. కథలోని భావావేశాలు తగినట్టుగా గ్రే మరియు బ్లాక్స్ లో శ్రీదేవి తన స్టైల్ స్టేట్మెంట్స్ ను కొనసాగించింది. మోనోటోన్స్ ను ఎంతో ఎలిగెంట్ గా క్యారీ చేసింది.


English summary

Birthday Special: Sridevi's Stunning Style Transformation In Bollywood Movies

Manish Malhotra once said of Sridevi that her every movie was a learning curve in terms of style. The designer who has been very close to Sridevi, rightly said so, as we saw a stunning style transformation of the diva in her movies. From wearing loud and vibrant outfits to muted elegant shades, Sridevi pulled off any look with grace.
Desktop Bottom Promotion