2017 సంవత్సరానికి బాలీవుడ్ ట్రెండ్ సెట్టర్లు!!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ఫాషన్ కి వచ్చే సరికి 2017 చాలా విశేషమైన సంవత్సరం. బీ-టౌన్ మహిళలు ఈ ఏడాదికి కొన్ని వాస్తవికమైన స్టైల్ లక్ష్యాలు నిర్దేశించారు. కోల్డ్ షోల్డర్స్ నుంచి కులాట్ ల వరకు ట్రెండ్ మన మనసును దోచేసాయి - వాటిలో ప్రతి ఒక్కటి అనుసరించాలని అనిపించేంతగా.

ఈ స్టైల్ లు కొంచెం ప్రచారంలోకి వచ్చాయి కానీ టిన్సెల్ టౌన్ లో ట్రెండ్ సెట్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా మనం చూశాం.

బాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ లను ఒక సారి పరికిద్దాం...

తాప్సీ – సాక్ హీల్ ట్రెండ్

తాప్సీ – సాక్ హీల్ ట్రెండ్

పశ్చిమ దేశాల్లో ఈ ట్రెండ్ ను కేండాల్ జెన్నర్ ప్రవేశ పెట్టి ఉండచ్చు కానీ భారత దేశంలో అందమైన తార తాప్సీ పన్ను ఈ సాక్ హీల్స్ ట్రెండ్ ను విపరీతంగా ప్రచారం లోకి తెచ్చింది. ఈ ట్రెండ్ ను దేశవ్యాప్తంగా ప్రజలంతా స్వాగతించారు - దీంతో ఈ నటిని సాక్ హీల్స్ ట్రెండ్ సెట్టర్ గా గుర్తించారు.

తాప్సీ, ఓపెన్-టో బూట్స్ ట్రెండ్

తాప్సీ, ఓపెన్-టో బూట్స్ ట్రెండ్

తాప్సీ తరచూ ఓపెన్-టో బూట్లు ధరించి నిజానికి మమ్మల్ని మళ్ళీ ఆమె స్టైల్ వైపు పడేట్టు చేస్తుంది. ఏ ట్రెండ్ నైనా ఎలా సెట్ చేయాలో ఆమెకు తెలుసు, అందుకే ఆమె తిరిగి ఓపెన్-టో బూట్ల ట్రెండ్ తో అద్భుతాలు సృష్టించింది. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, ఇది ఖచ్చితంగా 2017 కి ఒక మంచి ట్రెండ్.

తాప్సీ, సారీ ట్రెండ్ తో పురుషుల బూట్లు

తాప్సీ, సారీ ట్రెండ్ తో పురుషుల బూట్లు

స్త్రీలు పురుషుల బూట్లు ధరిస్తారా, అదికూడా భారతీయ సాంప్రదాయ బట్టలతో? ధరించవచ్చేమో, ఇదే తాప్సీ నిరూపించింది. ఆమె చీరలు, కుర్తాలు, ఇతర సాంప్రదాయ దుస్తులతో ఈ రకం బూట్లను ధరించడం ప్రారంభించింది. ఆమె ఎంతో అద్భుతంగా కనిపించింది, మేము ఈ ట్రెండ్ ని అనుసరించాల్సి వచ్చింది.

దీపిక, టైర్ బ్లౌజెస్ ట్రెండ్

దీపిక, టైర్ బ్లౌజెస్ ట్రెండ్

దీపిక పడుకొనే మొదట భారతదేశ కొటుర్ వీక్ సమయంలో టైర్ బ్లౌస్ ని ధరించారు, ఆతరువాత, అది ఒక ట్రెండ్ గా అనుసరించడం జరిగింది. ఇది ఎంతో హాట్ గా, సాంప్రదాయ సమ్మేళనంతో కనిపిస్తుంది. మరే ఇతర కలయిక అంత మంచిగా అనిపించలేదు.

శిల్పా శెట్టి, అనుకూలమైన సారీ డ్రేప్స్ ట్రెండ్

శిల్పా శెట్టి, అనుకూలమైన సారీ డ్రేప్స్ ట్రెండ్

ఒకసారి కాదు చాలాసార్లు, శిల్పాశెట్టి తన చీరలను భిన్న మార్గంలో డ్రేప్ చేసింది, ఈ సంవత్సరం మొత్తం. ఫాషన్ షో ల దగ్గర నుండి ఫార్మల్ మీట్స్ వరకు, ఈ నటి వివిధ రకాల చీరల ధారణతో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఒక భుజం నుండి ఒక వైపుకి, కొన్ని నిజమైన చీర ధరించే లక్ష్యాలను మాకు చూపించింది.

శిల్ప శెట్టి కుర్తా డ్రెస్ ట్రెండ్

శిల్ప శెట్టి కుర్తా డ్రెస్ ట్రెండ్

శిల్పాశెట్టి ఖచ్చితంగా ఈ సంవత్సర ట్రెండ్ సెట్టర్ అనవోచ్చు. ఎటువంటి బాటమ్ లేకుండా ఆమె కుర్తా ధరించడం మేము చూసాము, అయితే, కాళ్ళు అనువుగా ఉంటాయి. ఆమె డ్రెస్ లాగా ధరించే కుర్తాతో పూర్తిగా ముగ్ధుల్ని చేస్తుంది. ఆమె ఈ బెంచ్ మార్క్ సెట్ చేసిన తరువాత ప్రజలందరూ దానిని అనుసరించడం ప్రారంభించారు.

ఝాన్వి, సేక్విన్ స్టైల్

ఝాన్వి, సేక్విన్ స్టైల్

2017 పార్టీ సీజన్ సమయంలో, సేక్విన్ దుస్తుల తో ఝాన్వి కపూర్ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది, ఆమె మొట్టమొదటగా కనిపించిన సెలబ్రిటీలలో ఒకరు. ఆమె జెన్నర్ సిబ్లింగ్స్ కి మంచి అనుచరురాలు, ఈ స్టైల్ కూడా పశ్చిమ దేశాల ప్రేరణ పొందింది.

శ్రద్ధా కపూర్, బెల్ట్ ఆన్ టాప్ ట్రెండ్

శ్రద్ధా కపూర్, బెల్ట్ ఆన్ టాప్ ట్రెండ్

బెల్ట్ ఆన్ టాప్ తో అత్యంత సాధారణ స్టైల్ బుక్ ధారణని శ్రద్ధ ప్రారంభించింది. ఆతరువాత నుండి, ఇది ఈ సంవత్సరం కూలేస్ట్ ట్రెండ్స్ లో ఒకటిగా తయారయింది.

మీరు ఈ ట్రెండ్స్ అన్నిటినీ అనుసరిస్తారా? ఇప్పటికీ అనుసరించట్లేదా? మీరు 2018 స్టైల్ లో ఈ ట్రెండ్స్ ని ఖచ్చితంగా ప్రయత్నిస్తారని మేము అనుకుంటున్నాము.

English summary

Bollywood Trendsetters Of 2017

2017 has been a happening year when it comes to fashion. The B-town ladies had set some real style goals around the year. From cold-shoulders to the culottes trend has stolen our hearts, alluring us to follow each one of them. While these are just styles which got popular, we have also seen Bollywood celebrities setting trend in and around