కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్: సెక్సీ లుక్ తో అదరగొట్టిన హూమా ఖురేషీ

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

హుమా ఖురేషి కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఫ్రెంచ్ రివీరాలో సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించారు, కానీ ఈ దివా మామూలు లుక్ నుండి కొద్దిపాటి నిష్క్రమణ తీసుకుంది మరియు పార్టీ తర్వాత "ఫ్యాషన్ ఫర్ రిలీఫ్" లో ఆమె తన సెక్సీ షేడ్ చూపించి అదరగొట్టింది. ఎలియో అబౌ ఫేసల్ వస్త్రధారణలో అబ్బురపరచే దుస్తులతో జనాలకు శ్వాస ఆడనీయకుండా చేసింది హూమా.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఫ్రెంచ్ రివీరాలో నిఖిల్ థంపి మెటాలిక్ పాంట్ సూట్ పై , వరుణ్ బాల్ రూపొందించిన ఉత్కృష్టమైన తెల్లటి కోర్సెట్ గౌన్ ధరించి సాంప్రదాయక లుక్ తో అబ్బురపరచిన హూమా ఖురేషీ, ఇప్పుడు తనలోని సెక్సీ పోజులకు అడ్డగా డయాస్ ను మార్చి తనకోసమే ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నదేమో అని అనిపించేలా దుస్తులను ధరించి, తనలోని సెక్సీ షేడ్ ను పరిచయం చేసింది.

cannes-2018-huma-shows-us-her-sexier-side-for-a-change

నల్లటి మేఘాలలో వెండి మెరుపులా, షిమ్మర్- మీట్స్-ది షార్ప్ ఎడ్జెస్ దుస్తులను ధరించిన హూమా, ఊహించని కోణాన్ని ప్రదర్శించి, ఒక పీస్ ఆఫ్ కేక్ మీకోసం అన్నట్లుగా అలరించింది.

ఈ సాటిన్ డ్రెస్ లో లోతైన స్లిట్ (చీలిక) కలిగి, హొయలొలికిస్తూ ఇచ్చిన పోజు సామాజిక మాధ్యమాలలో షేర్ల మీద షేర్లు చేసేలా చేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. నిజానికి నైటీని తలపించే దుస్తుల వలె ఉన్న ఈ దుస్తులపై ధరించిన కోట్ (క్లోక్) లేయర్స్ తో కూడుకుని ఉన్న ఆర్గాన్జాతో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఆ దుస్తులకు ప్రత్యేక ఆకర్షణగా కోట్ అత్యధ్బుతమైన అధునాతనమైన లుక్ తీసుకుని రావడంలో సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.

ఇక ఆభరణాల విషయానికి వస్తే , దుస్తులకు సరిగ్గా నప్పేలా ఆభరణాలు ధరించడం అంటే మాటలు కాదు, ఆ విషయంలో హూమా జాగ్రత్త తీసుకుంటుందనే చెప్పాలి.వేలాడే స్వారోవ్స్కీ చెవి రింగులు, అవుట్హౌస్ ఆభరణాలు, అలెగ్జాండర్ బిర్మాన్ పెన్సిల్ హీల్స్ ధరించి దేవకన్యే కళ్ళ ముందున్నట్లుగా కనిపిస్తే, కెమరాలు క్లిక్ అనకుండా ఉంటాయా చెప్పండి.

మాకైతే హూమా నిద్రలేకుండా చేసింది అని చెప్పగలం, మరి మీకు? హూమా ఖురేషీ, మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలుపండి?

English summary

cannes-2018-huma-shows-us-her-sexier-side-for-a-change

Huma Qureshi was seen pretty much conservatively dressed at Cannes 2018 but the diva took a slight departure from the usual and showed us her sexy side at a 'Fashion For Relief' after-party. She wore a ravishing satin attire by Elio Abou Fayssal, draped a complementing robe, and teamed her look with Swarovski danglers and Alexandre Birman's pencil heels.