కేన్స్ 2018 - రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యారాయ్ ధరించిన ఆభరణాలు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

కేన్స్ సంబరంలో ఐశ్వర్యారాయ్ ఇప్పటివరకు ఎప్పుడు కళ్ళు తిప్పుకోనివ్వని అందగత్తెలలో ఒకరిగా పేరుపొందారు. వన్నెలొలికే డిజైనర్ దుస్తులలో ఈ కేన్స్ పోస్టర్ గర్ల్ వీక్షకులను ఎప్పుడు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం పరిపాటిగా మారింది. "రెడ్ కార్పెట్ రారాణి"గా ఆమె పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆమె తన అబ్బురపరిచే రూపురేఖలతో అభిమానులపై సమ్మోహనాస్త్రం ఎక్కుపెట్టడం ఏ యేటికాయేడు రివాజయిపోయింది.

ఆమె సౌందర్యం, దానిని రెట్టింపు చేసేందుకు ఆమె ధరించే నాటకీయమైన గౌనులు చూపరులకు అమూల్యమైనవిగా కనిపిస్తాయి. సమయంతో పాటు ఆమె తననుతాను మలచుకుంటున్న తీరు శ్లాఘనీయం. కానీ ఆమె సొగసు కేవలం తను ధరించే దుస్తులు మరియు చేసుకునే మేకప్ పై మాత్రమే ఆధారపడి లేదు, ఆమె ధరించిన మిరుమిట్లు గొలిపే ఆభరణాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

Cannes 2018: Luxury Jewels Aishwarya Was Spotted In, On The Red Carpet

ఐశ్వర్య తన రూపాన్ని అమూల్యమైన ఆభరణాలతో అపురూపంగా మార్చుకుంది. ఆమె ధరించిన నగలు సున్నితత్వానికి మరియు ఆధునికతకు అద్దం పడుతున్నాయి. కేన్స్ ఉత్సవానికి క్రమం తప్పకుండా హాజరయ్యే ప్రముఖులలో ఒకరైన ఐశ్వర్య, తన మెరిపై మెరిసే ఆభరణాల సంఖ్య విషయంలో ఎంతో మెళకువగా వ్యవహరిస్తుంది. అతి తక్కువ ఆభరణాలు ధరించినప్పటికిని, వాటి సోయగంలో ఆమె సంతకం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఆమె ఎటువంటి ఆభరణాలు ధరించిందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారా? అయితే ఆమె నగలు రెడ్ కార్పెట్ పై ఎలా కనికట్టు చేసాయో చూద్దాం రండి!

Cannes 2018: Luxury Jewels Aishwarya Was Spotted In, On The Red Carpet

1. వర్ణాలలో రాగాలు- కేన్స్ 2018 లో ఐశ్వర్య: మైఖేల్ సింకో అద్భుతంగా సృష్టించిన ఇరవై అడుగుల నెమలి వన్నెల దుస్తులు ధరించింది. ఆమె ధరించిన గౌను ఊదా రంగులోని వివిధ ఛాయల సమ్మేళనంతో కూడుకుని ఉంది. వీటికి జతగా ఆమె డే గ్రిసోగోనో చెవిరింగులను ధరించింది. వీటి మెరుపు, ఆమె ధరించిన దుస్తుల శోభను మరికాస్త పెంచింది. ఆమె ధరించిన గౌనుకు మల్లే నీలాలు మరియు గరుడపచ్చ (అమెథిస్ట్)లను పొదిగిన ఆమె చెవికమ్మలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి.

Cannes 2018: Luxury Jewels Aishwarya Was Spotted In, On The Red Carpet

2. సామాన్యమైనదిగా ఉన్నా సందర్భానుసారంగా ఉన్నాయి, ఆమె తరువాత ధరించిన దుస్తులు. రమి కదిచే రూపొందించబడిన మంచు వంటి నీలిరంగు దుస్తులపై ఇరవై వేల స్వరవస్కీ రాళ్లు పొదగబడ్డాయి. ఆమె జుట్టును బన్ గా ముడి పెట్టుకుని అతి తక్కువగా బౌచెరోన్ జ్యువెలరీ ధరించినా, నిండుగా కనిపించింది. నిరాడంబరంగా ఉండే దిద్దులు మరియు రింగులు తన మంచు వంటి గౌనుకు జతగా ధరించింది. ఆమె వేలికి పెట్టుకున్న, పూవులను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసిన ఉంగరం మతిపోగొట్టేసింది.

English summary

Cannes 2018: Luxury Jewels Aishwarya Was Spotted In, On The Red Carpet

Aishwarya's style at Cannes 2018 was not merely limited to her attires and make-up but her opulent jewellery also left us all dazed. Ash meticulously accessorized her look with precious ornamental baubles. There was a great sophistication in the way she sported her jewellery. Let's unlock her invaluable jewels