కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : తన న్యూడ్-కార్సెట్ గౌన్లో గేం-చేంజర్ గా మారిన సోనం

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సోనమ్ కపూర్ అహుజా ప్రస్తుత ఫ్యాషన్ గేం-చేంజర్ గా ఉంది మరియు వెరా-వాంగ్ దుస్తులలో రెడ్ కార్పెట్ కు వ్యతిరేకంగా అలంకరించబడి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సోనం. స్వర్గంలో రూపుదిద్దబదినట్లు ఉన్న సృజనాత్మక దుస్తులలో ఫాషన్ ప్రపంచానికి సరికొత్త సూత్రాలను నిర్దేశిస్తుంది సోనం . కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో వెరా-వాంగ్ నూతన బ్రైడల్ స్ప్రింగ్2019 కలెక్షన్ నుండి సేకరించిన నాన్-కన్ఫార్మిస్ట్ పెళ్లి దుస్తులను ధరించేందుకు ఖచ్చితమైన అవకాశంగా ఉంది.

ముందురోజు, సోనమ్ మార్కెట్-ఆధారిత మరియు అద్భుతమైన సమకాలీన-దుస్తులను పోలి ఉండే సంప్రదాయ వైట్ లెహెంగా ధరించిన సోనం, నేడు అబ్స్ట్రాక్ట్ దుస్తులలో దర్శనమిచ్చి అబ్బురపరచేలా కనిపించింది. దేశీయ సంప్రదాయాలే కాదు, విదేశీ సంప్రదాయాలలో కూడా ప్రత్యేకతను ప్రదర్శించవచ్చు అని తలపించేలా సోనం కేన్స్లో సందడి చేస్తుంది.

Cannes 2018: Sonam Was The Game-Changer In Her Nude Corset Gown

ఆమె కోర్సెట్-గౌను వివాహ అలంకరణల మరియు విలక్షణమైన రంగులకు ఒక కొత్త భాషను, సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్లైoది. ఒక వైపు, ఆమె దుస్తులు శృంగారభరితoగా కనిపిస్తున్నా, మరోవైపు, కొత్త ఫాషన్ పోకడలకు నాంది పలికేలా కనిపించింది. సమకాలీన వధువులను ఆదర్శవాద మనసులతో ఆకట్టుకోడానికి, బహుశా ఆ దుస్తులు రూపొందించబడినవేమో అన్న ఆలోచన స్పురించేలా సోనం కనిపించింది.

ఏమైనప్పటికీ, సొనoకపూర్ అత్యంత పరిపూర్ణతతో నివ్వెరపరచేలా తయారైందని చెప్పవచ్చు. ఆమె పసుపు-న్యూడ్ టోన్డ్ దుస్తులలో రెడ్ కార్పెట్ కు వ్యతిరేకంగా దుస్తులను ఎంపిక చేసుకుoది. ఆమె తన వస్త్రధారణ ద్వారా సౌందర్యాన్ని ఎలా ప్రదర్శిoచవచ్చో అని మెళకువలు ఇచ్చేలా కనిపిస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

Cannes 2018: Sonam Was The Game-Changer In Her Nude Corset Gown

ఆమె టైట్-ఫిట్టెడ్ స్లీవ్ లెస్ బ్లౌస్, నిర్మాణాత్మకంగా రూపొందించబడిన వెనుకకు వ్రేలాడే పొరలవలెనున్న పసుపు రంగు టఫ్ఫెటా దుస్తులకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. తద్వారా దుస్తులలో ముందు భాగం న్యూడ్-కలర్ వస్త్రం కలిగి, కేవలం టఫ్ఫెటా వరకు పసుపు రంగును కలిగి ఉండడం వలన, రెడ్ కార్పెట్ కు వ్యతిరేక భావన కలిగించేలా నిలబడి అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది సోనం.

వదులుగా ముడివేయబడి ఉన్న బన్(కేశాలంకరణ) ధరించిన దుస్తులకు డ్రీమీ వైల్డ్ టచ్ ఇచ్చేలా ఉంది. మరియు ఎల్లో ఐ-షాడో ఆమె రూపాన్ని పరిపూర్ణం చేసింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆమె ఫాషన్ దిగ్గజమైన, చోపార్డ్ నుండి తన వస్త్రాలకు తగిన విధంగా ఆభరణాలను ఎంచుకుంది. ముందు రోజు కేన్స్ ఫెస్టివల్లో కూడా చోపార్డ్ ఆభరణాలను ధరించినా, ఆమ్రపాలి ఆభరణాలు కూడా తోడయ్యాయి.

దేశీయ దుస్తులలో అందరినీ ఆకర్షించిన సోనంకపూర్, నేడు ఉత్కృష్టమైన దుస్తులలో ఫాషన్ దిగ్గజాలను తనవైపు తిప్పుకునేలా చేసి అందరి మన్ననలూ అందుకుంది.

కొత్త పెళ్ళికూతురు సోనం కపూర్ అహుజా లుక్ పై మీ అభిప్రాయం ఏమిటి ? మీ సమాధానాలను వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Cannes 2018: Sonam Was The Game-Changer In Her Nude Corset Gown

Sonam wore a very abstract corseted gown for her second red carpet appearance at Cannes 2018. Her attire, designed by Vera Wang, was every inch romantic. The fashionista looked straight out of a Renaissance painting in her dreamy gown that featured a body-hugging blouse, ruffled taffeta, and layers of tulle. Also, her yellow eyeshadow complemented well with attire.
Story first published: Thursday, May 17, 2018, 13:30 [IST]